Wednesday, 30 August 2017

సాలిగ్రామం ఎలా పుట్టింది.............?

మిత్రులకు శుభోదయం.
సాలిగ్రామం ఎలా పుట్టింది.............?
గండకీ సరసస్తీరే చంద్ర తీర్థేన శోభితే|
సాలగ్రామ పురశ్రేష్ఠ కనకాఖ్య విమానగ:||
శ్రీ మూర్తిదేవ శ్శ్రీ దేవ్యా కుబేరోముఖ సంస్థిత:|
గండకీ గణికా రుద్ర బ్రహ్మణా మక్షిగోచర:
శ్రీవిష్ణుచిత్త కలిజిత్ స్తుతి భూషిత నిగ్రహ:||
సాలిగ్రామం అంటే తెలుసా.......? విష్ణు చిహ్నంగల శిలనే సాలిగ్రామం అంటారు. అలాంటి సాలిగ్రామాలు ఒకటి కాదు రెండు కాదు వందలూ వేలు కాదు, లెక్కకు మిక్కిలిగా ఆ ఒక్క నదిలోనే పుడతాయి. మరెక్కడా దొరకవవి. ఆనది పేరు గండకీ. చిన్నగా పెద్దగా రకరకాల పరిమాణాల్లో ఉంటాయి. గండకీ నదిలోనే దొరుకుతాయి. గుండ్రని రాళ్ళలా ఉన్నా – తాబేలు నోరు తెరచుకున్నట్టు ఉండి లోపల శ్రీ మహా విష్ణువే శేషసాయిగా ఉండి దర్శన మిస్తాడంటారు. పూజిస్తుంటారు. మరి గండకీ నదిలోనే ఈ సాలిగ్రామాలు పుట్టడానికి వెనుక ఒక కథ ఉంది!
గండకీ నది నదిగా మారడానికి ముందు ఒక స్త్రీ, గండకీ పేరుతోనే శ్రావస్తి నగరంలో ఉండేది. ఆమె అందాల వేశ్య. ఆమె అనుగ్రహం కోరి ధనవంతులు కూడా పరితపిస్తూవుండేవారు. గండకీ అందరినీ అంగీకరించేది కాదు. ప్రతి రోజూ ముందొచ్చిన బేరం ఒప్పుకొనేది. ఆరోజుకి అతనే భర్త. రెండో మనిషికీ రెండో బేరానికి ఒప్పుకొనేది కాదు. ధనం ఆశ చూపినా దరి చేరనిచ్చేది కాదు. ఆమె తల్లి గండ్రకి మార్చాలని ఎన్నోవిధాల ప్రయత్నించి విఫలమైంది. సాక్షాత్తూ నారాయణుడికే గండకిని పరీక్షించాలని కోరిక పుట్టింది.
ఒక రోజు పరివారంతో పొద్దున్నే వచ్చిన ధనవంతుడు బేరం చేసుకొని కానుకలు ఇచ్చాడు. అలవాటుగా గండ్రకి అతనికి స్నానం చేయించాలని దుస్తులు తీస్తే దుర్వాసన… ఒళ్ళంతా పుండ్లు. ఈగల ముసిరాయి. కుష్టు వ్యాధి ఉందని కూడా గ్రహించింది. తల్లి తిట్టి పొమ్మనబోతే గండ్రకి ఆమెనే తరిమేసింది. సంపంగి తైలం పూసింది. గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేయించింది. చేనేత వస్త్రాలు చుట్టింది. చక్కని భోజనం పెట్టింది. అతడు తినబోతే పుచ్చిన చేతులు. వేళ్లూడి పడితే పక్కన తీసి పెట్టింది. తినిపించింది. అదే కంచంలో తానూ తిన్నది. పక్కమీదకు చేర్చింది. విసురుతూ కూర్చుంది. జ్వరంతో అతడు ఆ రాత్రే ప్రాణాలు వదిలాడు. అప్పటి ఆచారం ప్రకారం సహగమనానికి పూనుకుంది. తల్లీ బంధువులూ తల్లడిల్లినా ఆగలేదు. తాళి కట్టని భార్యలా తల్లడిల్లింది. తనువుని చాలించదలచింది. ఉన్న ధనమంతా బీదసాదాలకు పంచి పెట్టింది. ధాన ధర్మాలు చేసి దహన కార్యక్రమానికి శవం వెంట మేళ తాళాలతో వెళ్ళింది. శ్మశాసనంలో చితి పేర్చింది. తనే నిప్పంటించింది. తనూ చితిలోకి దూకింది. చిత్రంగా ఎగిసిన మంటలు మల్లెలయ్యాయి. కాలిన కట్టెలు పువ్వులయ్యాయి. లక్ష్మి సమేతంగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. గండకి చూస్తూనే ముగ్దురాలైంది. చేతులు జోడించింది. కన్నీళ్ళతో కీర్తించింది. కీర్తిస్తూ కాళ్ళు కడిగింది. శరీరమూ మనసూ స్వచ్ఛంగా నిలిపింది.
గండకి పవిత్రతకు నారాయణుడు పరవశించిపోయాడు. ఆమె నియమ నిబంధనలకు నిర్ఘాంతపోయాడు. ఆమె నిశ్చలతకు చలించిపోయాడు. నిష్టకు ఇష్టపడ్డాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. గండకి డబ్బూ ధనం కోరలేదు. మోక్షమూ కోరలేదు. మాతృత్వాన్ని వరంగా కోరింది. మహా విష్ణువుని తన కడుపున కొడుకుగా పుట్టాలని కోరింది. ఫలితమే. మరు జన్మలో గండకీ నదిగా పుట్టింది. నది కడుపులో సాలిగ్రామాల రూపంలో విష్ణుమూర్తి పుట్టి పూజలందుకున్నాడు.
గండకి ఏకులంలో పుట్టినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనసు మలినం కాలేదు. ఆ విధంగా పవిత్రురాలైంది. విష్ణుమూర్తిని తన గర్భంలో దాచుకొని తల్లయింది. కృతయుగాన జరిగినా ఈయుగానికీ గండకీ కథ నిలిచిపోయింది!.

Monday, 28 August 2017

మంత్రాత్మక శ్రీ మారుతి స్తోత్రం............... మన్యుసూక్తం......

మిత్రులకు శుభోదయం.
మంత్రాత్మక శ్రీ మారుతి స్తోత్రం............... మన్యుసూక్తం......
ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే |
నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే || ౧ ||
మోహశోకవినాశాయ సీతాశోకవినాశినే |
భగ్నాశోకవనాయాస్తు దగ్ధలంకాయ వాగ్మినే || ౨ ||
గతి నిర్జితవాతాయ లక్ష్మణప్రాణదాయ చ |
వనౌకసాం వరిష్ఠాయ వశినే వనవాసినే || ౩ ||
తత్త్వజ్ఞాన సుధాసింధు నిమగ్నాయ మహీయసే |
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయ తే || ౪ ||
జన్మమృత్యుభయఘ్నాయ సర్వక్లేశహరాయ చ |
నేదిష్ఠాయ ప్రేతభూత పిశాచభయహారిణే || ౫ ||
యాతనా నాశనాయాస్తు నమో మర్కటరూపిణే |
యక్ష రాక్షస శార్దూల సర్పవృశ్చిక భీహృతే || ౬ ||
మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ధతే |
హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే || ౭ ||
బలినామగ్రగణ్యాయ నమో నః పాహి మారుతే |
లాభదోసి త్వమేవాశు హనుమాన్ రాక్షసాంతకః || ౮ ||
యశో జయం చ మే దేహి శతౄన్ నాశయనాశయ |
స్వాశ్రితానామభయదం య ఏవం స్తౌతి మారుతిమ్ |
హానిః కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్ || ౯ ||
మన్యుసూక్తం......
యస్తే” మన్యో‌உవి’ధద్ వజ్ర సాయక సహ ఓజః’ పుష్యతి విశ్వ’మానుషక్ |
సాహ్యామ దాసమార్యం త్వయా” యుజా సహ’స్కృతేన సహ’సా సహ’స్వతా || 1 ||
మన్యురింద్రో” మన్యురేవాస’ దేవో మన్యుర్ హోతా వరు’ణో జాతవే”దాః |
మన్యుం విశ’ ఈళతే మాను’షీర్యాః పాహి నో” మన్యో తప’సా సజోషా”ః || 2 ||
అభీ”హి మన్యో తవసస్తవీ”యాన్ తప’సా యుజా వి జ’హి శత్రూ”న్ |
అమిత్రహా వృ’త్రహా ద’స్యుహా చ విశ్వా వసూన్యా భ’రా త్వం నః’ || 3 ||
త్వం హి మ”న్యో అభిభూ”త్యోజాః స్వయంభూర్భామో” అభిమాతిషాహః |
విశ్వచ’ర్-షణిః సహు’రిః సహా”వానస్మాస్వోజః పృత’నాసు ధేహి || 4 ||
అభాగః సన్నప పరే”తో అస్మి తవ క్రత్వా” తవిషస్య’ ప్రచేతః |
తం త్వా” మన్యో అక్రతుర్జి’హీళాహం స్వాతనూర్బ’లదేయా”య మేహి’ || 5 ||
అయం తే” అస్మ్యుప మేహ్యర్వాఙ్ ప్ర’తీచీనః స’హురే విశ్వధాయః |
మన్యో” వజ్రిన్నభి మామా వ’వృత్స్వహనా”వ దస్యూ”న్ ఋత బో”ధ్యాపేః || 6 ||
అభి ప్రేహి’ దక్షిణతో భ’వా మే‌உధా” వృత్రాణి’ జంఘనావ భూరి’ |
జుహోమి’ తే ధరుణం మధ్వో అగ్ర’ముభా ఉ’పాంశు ప్ర’థమా పి’బావ || 7 ||
త్వయా” మన్యో సరథ’మారుజంతో హర్ష’మాణాసో ధృషితా మ’రుత్వః |
తిగ్మేష’వ ఆయు’ధా సంశిశా”నా అభి ప్రయం”తు నరో” అగ్నిరూ”పాః || 8 ||
అగ్నిరి’వ మన్యో త్విషితః స’హస్వ సేనానీర్నః’ సహురే హూత ఏ”ధి |
హత్వాయ శత్రూన్ వి భ’జస్వ వేద ఓజో మిమా”నో విమృధో” నుదస్వ || 9 ||
సహ’స్వ మన్యో అభిమా”తిమస్మే రుజన్ మృణన్ ప్ర’మృణన్ ప్రేహి శత్రూ”న్ |
ఉగ్రం తే పాజో” నన్వా రు’రుధ్రే వశీ వశం” నయస ఏకజ త్వమ్ || 10 ||
ఏకో” బహూనామ’సి మన్యవీళితో విశం”విశం యుధయే సం శి’శాధి |
అకృ’త్తరుక్ త్వయా” యుజా వయం ద్యుమంతం ఘోషం” విజయాయ’ కృణ్మహే || 11 ||
విజేషకృదింద్ర’ ఇవానవబ్రవో(ఓ)3’‌உస్మాకం” మన్యో అధిపా భ’వేహ |
ప్రియం తే నామ’ సహురే గృణీమసి విద్మాతముత్సం యత’ ఆబభూథ’ || 12 ||
ఆభూ”త్యా సహజా వ’జ్ర సాయక సహో” బిభర్ష్యభిభూత ఉత్త’రమ్ |
క్రత్వా” నో మన్యో సహమేద్యే”ధి మహాధనస్య’ పురుహూత సంసృజి’ || 13 ||
సంసృ’ష్టం ధన’ముభయం” సమాకృ’తమస్మభ్యం” దత్తాం వరు’ణశ్చ మన్యుః |
భియం దధా”నా హృద’యేషు శత్ర’వః పరా”జితాసో అప నిల’యంతామ్ || 14 ||
ధన్వ’నాగాధన్వ’ నాజింజ’యేమ ధన్వ’నా తీవ్రాః సమదో” జయేమ |
ధనుః శత్రో”రపకామం కృ’ణోతి ధన్వ’ నాసర్వా”ః ప్రదిశో” జయేమ ||
భద్రం నో అపి’ వాతయ మనః’ ||
ఓం శాంతా’ పృథివీ శి’వమంతరిక్షం ద్యౌర్నో” దేవ్య‌உభ’యన్నో అస్తు |
శివా దిశః’ ప్రదిశ’ ఉద్దిశో” న‌உఆపో” విశ్వతః పరి’పాంతు సర్వతః శాంతిః శాంతిః శాంతిః’ ||

హనుమంతుడికి తమలపాకులతో పూజలు చేయడం మనకు తెలిసిన విషయమే. అలాగే ఇష్టమైన పుష్పాలు ఏమిటో తెలుసుకుందాం. హనుమంతునికి పొన్నపువ్వు, మొగలి, పొగడ, నందివర్ధనము, మందారము, కడిమి, గజనిమ్మ, పద్మము, నల్లకలువ, ఎర్ర గన్నేరు, సన్నజాజి, మల్లె, గులాబి, మోదుగ, సంపంగి, కనకాంబర, మెట్ట తామర, పొద్దు తిరుగుడు పువ్వులంటే చాలా ఇష్టం.
అలాగే మంకెన, బండికెరివెంద, అడవిమల్లె, సురపున్నాగ, కుంకుమ పువ్వు, మద్ది, సువర్ణ పుష్పం, గౌరీ మనోహరం వంటి పుష్పాలతో పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయి.
ఇంకా పసుపు, అక్షింతలు, తిరుమారేడు, నేరేడు, రుధ్ర జడ, తులసి, మాచిపత్రి, ఎర్రకలువ, గోరింట, ఉత్తరేణి, తమలపాకులంటే ఆంజనేయ స్వామికి ఇష్టం. ఈ పుష్పాలతో స్వామిని పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. సమస్త గ్రహదోషాలు నివారింపబడతాయి.

Sunday, 27 August 2017

ఓం నమో భగవతే వాసుదేవాయ ! ఈ మంత్రం ఎందుకు జపించాలి.............?

ఓం నమో భగవతే వాసుదేవాయ ! ఈ మంత్రం ఎందుకు జపించాలి.............?
ఇప్పటికి సరిగ్గా 1500 సంవత్సరాల క్రితం సంఘటన.
ఒక ముసలివాడు ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని వల్లెవేస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల మెడలో రుద్రాక్ష హారం ధరించాడు. ఈ నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రం చదవడం వలన ఆ తరంగాలు కలిపురుషుడు ని తాకాయి. ఎక్కడి నుండి వస్తున్నది ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్ర శబ్దం అని చుట్టూ పరికించాడు. గంగానది తీరంలో ఒక బక్కచిక్కిన ముదుసలి ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబోయాడు. అయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి అర యోజన దూరం లో పడ్డాడు. కొంతసేపు ఏమి జరిగిందో తెలియక చూస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు. ఎలాగైనా పట్టుకుని నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు. పట్టుకోబోతే ఈసారి యోజనం దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ ఒణికిపోయాడు. చూస్తే బక్కచిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి వస్తే ఎగిరేలా ఉన్నాడు. కాని పట్టుకుందామంటే నేను ఎక్కడో పడుతున్నాను.
ఒకవేళ నాశక్తి సన్నగిల్లిందా? కలియుగం ఆరంభంలో కృష్ణుడు వలన నా రాక ఆలస్యం అయింది. ఇదేమైన శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవ్వడు. శివుడా? విష్ణువా? అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న ”వేదవ్యాసుడు” కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడు దగ్గరికి వెళ్లి మహానుభావ సమయానికి వచ్చావు. నా సందేహాన్ని నివృత్తి చేయండి. అన్నాడు. వ్యాసుడు నవ్వి. ఇది నీరాజ్యం. ఈకలికాలం నీది. నీకు సందేహమా?
ఏ ఇద్దరుని సక్రమంగా ఉండనివ్వవు. ఎవరైనా కలిసున్నారంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావు. ఇలాంటి నీకు నా అవసరం ఏముంది? ఇంతకి నువ్వు కుశలమే కదా!
కుశలమే! నారాజ్యంలో నేను కాక నువ్వు పాలించవు. కదా! అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు? ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇదసలు నా రాజ్యమేనా? లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి అని వేడుకున్నాడు. వేదవ్యాసుడు నవ్వి, ఓహో అదా నీ సందేహం. అయన పరమ విష్ణు భక్తుడు. అయన జపించే నామం వలన విష్ణు శక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు. పట్టుకోవాలని ప్రయత్నించవా! విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్దిగా నిత్యం ” ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకనుకూడా తాకలేవు. కనుక ”ఓం నమో భగవతే వాసుదేవాయ” ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో. లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు. అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపించండి.
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ..........

ఆయుర్దాయం...........

ఆయుర్దాయం...........
యస్మిన్ విన్యస్య భారం విజయిని జగతాం జఙ్గమస్థావరాణాం
లక్ష్మీనారాయణాఖ్యం మిథునమనుభవత్యత్యుదారాన్ విహారాన్|
ఆరోగ్యం భూతిమాయుః కృతమిహ బహునా యద్యదాస్థపదం వః
తత్తత్సద్యః సమస్తం దిశతు స పురుషో దివ్య హేత్యక్షవర్తీ||
“శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి” అనేది వేద పురుష ఆశీర్వచనం. మనలను నిండా నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తోంది. వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం. అలాగే నిత్యం చేసుకొనే సూర్యోపస్థానంలో “పశ్యేమ శరదశ్శతం, జీవేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం” అని చెప్పబడించి. “నిండు నూరేళ్లు ఆ సూర్యుని చూడగలగాలి. నిండా నూరేళ్ళు జీవించాలి. ఆది కూడ ఆనందంగా జీవించాలి” అని ఆకాంక్షిస్తాం. ఇలా ఆకాంక్షించటంలో ఎంతో విలువ ఉంది. “గుడ్ మార్నింగ్” అని చెప్పడం, “గుడ్ నైట్” చెప్పటంలోనూ లౌకికంగా కూడ అట్టి ఆకాంక్షలు ఆధునిక కాలంలోనూ అనుసరిస్తూనే ఉన్నాం. మంచి మనస్సు నుండి వచ్చే శుభాశీస్సుకు, శుభాకాంక్షాలకు కూడ శక్తి ఉంది. దాని వలన మేలూ జరుగుతుంది. ఇది పూర్వకాలపు విషయమే కాదు, నేటి విషయం కూడా అని అర్థం చేసుకొనగలం.
“బ్రతికి యుండిన శుభములు బడయవచ్చు” కాబట్టి బ్రతికి ఉండటం అంటే ఆయుర్దాయం మొదట కోరదగినది. అందుకే ఏ పూజ చేసినా సంకల్పంలో ఆయురారోగ్య భోగభాగ్యాలు కాంక్షిస్తాం. అందులో ముందు కోరేది ఆయుర్దాయాన్నే. కోట్ల సంపద లభించినా అయుర్దాయం లేక మరుసటి రోజే మరణించే వానికి ఈ కోట్ల సంపద వలన ప్రయోజనమేమిటి? అందువలనే మొదట కోరదగినది ఆయుర్దాయం. నిజమే. ఆయుర్దాయమనేది కోరుకొంటే వచ్చేదా? అనేది ప్రశ్న. “దీర్ఘాయుష్మాన్ భవ” అని దీవించటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందా? ఆని సందేహం.
ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధన మేవ చ|
పంచైతా న్యపి సృజ్యంతే గర్భస్థస్తైవ దేహినః||
అని చెప్పబడింది. అంటే “ఆయుష్షు, వృత్తి, ధనం, విద్య, చావు అనేవి ఐదూ జీవి గర్భంలో ఉండగానే నిర్ణయింపబడుతూ ఉంటా”యని దాని అర్థం. ఆయుర్దాయం, మరణం అనేవి ముందే నిర్ణయింపబడితే ఇంకా ఈ ఆశీస్సుల వల్ల కాని, మరే జాగ్రత్తల వల్ల కాని ప్రయోజనమేమిటని ప్రశ్న. “లలాట లిఖితా రేఖా పరిమార్ట్షుం న శక్యతే” నుదుట వ్రాసిపెట్టినది ఎవరూ తుడవలేరని, మార్చలేరని, జరిగి తీరుతుందని మరికొందరి మాట. “ఏది నిజం” మనేది సామాన్యునకు వచ్చే ప్రశ్న. ఆయుష్షుకు వృద్ధి, క్షీణతలు ఉంటాయా? ఉంటేనే దాని విషయంలో జాగ్రత్తలు తీసుకొనటం అవసరం తప్ప అదేమీ లేనప్పుడా యత్నమే వ్యర్థం కదా! ఆయుర్వేదం అనే వైద్య విధానం పేరులోనే ఆయువు ఉన్నది. ఆయుర్వేదమనేది ఊసుపోక చెప్పిన సామాన్యపు మాట కాదు. వేదాలలో మొదటిదైన ఋగ్వేదానికి సంబంధించిన ఉపవేదమే ఆయుర్వేదం. అంటే ఆయువును గూర్చి తెలిసికొనదగిన విజ్ఞానం అది. అందువల్ల ఆయువునకు సంబంధించి వృద్ధి క్షయాలు కూడ పరిగణింపదగినవే అని తెలుస్తుంది.
లలాట లిఖితమైన ఆయుర్దాయాన్ని ఎవ్వరూ మార్చలేరనేది యదార్థమైనా మార్కండేయుడు, శంకరాచార్యుల వారు మొదలైన వారు దైవానుగ్రహం వలన ఆయుర్దాయాన్ని పెంచుకొనటం చూస్తాం. అంతే కాదు హనుమంతుడు, విభీషణుడు మొదలగు వారు చిరంజీవులుగా పరమందటమూ చూస్తాం. ఇంకా విశేషం ద్వాపర యుగంలో చనిపోయిన సాందీపని గురువు యొక్క పుత్రుని శ్రీకృష్ణుడు బ్రతికించినట్లు, త్రేతాయుగంలో చనిపోయిన వానర వీరుడు గంధమాదనుని హనుమంతుడు బ్రతికించి తెచ్చినట్లు కూడ ఇతిహాసాల ద్వారా తెలిసికొన్నాం. కాబట్టి దైవానుగ్రహం వలన కాని, అమోఘవచనులైన ఋష్యాదుల ఆశీర్వచనాల వల్ల కాని ఆయుర్దాయం పెంచుకొనటం సాధ్యమే అని తెలుస్తుంది. కాబట్టే మన పూర్వజులు “ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం” అని సంకల్పంలో చెప్పుకొనటంలో అనౌచిత్యం లేదని, “శతమానం భవతి” అంటూ మహనీయుల ఆశీస్సులు పొందటం శ్రేయస్కరమే అని తెలుస్తుంది. అందుకే అట్టి ఆశీర్వచనాల కోసం పెద్దల యెడ వినయ విధేయతలతో ఉండాలి.

కాలభైరవుడు.............

కాలభైరవుడు.............
" దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే "
కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ. రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు. కాలభైరవుడు అనగానే హేళనగా కుక్క అనేస్తాం. కుక్కను వాహనంగా చేసుకుని తిరిగే వాడే తప్ప ఆయనే కుక్క కాదు. కుక్క అంటే విశ్వసనీయతకు మారుపేరు. రక్షణకు కూడా తిరుగులేని పేరు. సమయోచిత జ్ఞానానికి ప్రతీక.
భైరవః పూర్ణ రూపోహి శంకరస్యపరాత్మనః
మూఢాస్తంవై నజానంతి మోహితాశ్శివమాయయా..........
...అంటుంది శతరుద్రసంహితం. శివపురాణమూ, కాశీఖండమూ కాలభైరవుడి గొప్పదనాన్ని కొనియాడాయి. భైరవుడిని స్మరించుకోవడానికైనా ఓ యోగం ఉండాలంటారు. పక్కనే కాలభైరవక్షేత్రం ఉన్నా చాలా సందర్భాల్లో మనం పట్టించుకోం. లోపలికెళ్లాలన్న ఆలోచనా రాదు. అందుకో కారణం ఉందంటారు ఆధ్యాత్మికవేత్తలు. పరమశివుడు మనల్ని ఓరకమైన మాయాలో పడేస్తాడట. దీంతో... కాలభైరవుడి మహత్తును అర్థం చేసుకోలేకపోతామట. ఆ మాయాపొర తొలగిననాడు... పరమేశ్వరుడి పూర్ణాంశ అయిన కాలభైరవుడు కట్టెదుట దర్శనమిస్తాడు. కాలభైరవ ఉపాసన ప్రాచీనమైంది. భైరవుడిని పూజిస్తే గ్రహ దోషాలూ, అపమృత్యు గండాలూ తొలగిపోతాయనీ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనీ మంత్రశాస్త్రం చెబుతోంది. కాశీ మహానగరం, ఉజ్జయిని తదితర ప్రాచీన క్షేత్రాల్లో కాలభైరవుడి ఆలయాలున్నాయి.
ఎవరీ కాలభైరవుడు...
శివపురాణంలో కాలభైరవ వృత్తాంతం ఉంది. ఓసారి మహర్షులకు ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవాలన్న జిజ్ఞాస కలిగింది. ఎవరు చెబుతారా అని ఆలోచించారు. సృష్టికర్తను మించిన బ్రహ్మజ్ఞాని ఎవరుంటారు? నేరుగా బ్రహ్మ తపస్సు చేసుకుంటున్న మేరు పర్వతానికి వెళ్లారు. బ్రహ్మదేవుడు కూడా ఆ నిగూఢ రహస్యాన్ని తప్పక బోధిస్తానని మాటిచ్చాడు. అంతలోనే...సృష్టికర్త చుట్టూ ఓ మాయాపొరను సృష్టించాడు పరమేశ్వరుడు. దీంతో, మనసులో ఏ మూలనో ఉన్న అహంకారం బయటికొచ్చింది. ‘పిచ్చి మహర్షులూ! పరమతత్వం గురించి చెప్పేదేముంది? నేనే ఆ మహాతత్వాన్ని. స్వయంభువును నేను. విధాతను నేను. సృష్టిస్థితిలయ కారకుడినీ నేను. మీ ప్రశ్నకు జవాబు కూడా నేనే..’ అంటూ ప్రగల్బాలు పలికాడు. అక్కడే ఉన్న విష్ణుమూర్తికి ఆ మాటలు వినిపించాయి. మాయకే మాయలు నేర్పగలిగిన విష్ణుమూర్తిని కూడా మాయాపొర కమ్మేసింది. ‘కాదుకాదు...నేనే గొప్ప’ అంటూ వాదానికి దిగాడు. ఇద్దరూ కలసి వేదాల దగ్గరికెళ్లారు. వేదాలు పురుషరూపాన్ని ధరించి ‘యదంతస్థ్సాని భూతాని యత్సర్వం ప్రవర్తరే...’ - సకల ప్రాణుల్నీ తనలో లీనం చేసుకున్నవాడైన రుద్రుడే పరమతత్వం అంటూ ఆ వేదపురుషుడు పరమేశ్వరుడిని కొనియాడాడు. ఓంకారం కూడా శివుడే సర్వేశ్వరుడని నిర్ధారించింది. అంతలోనే...దివ్యతేజస్సుతో ముక్కంటి ప్రత్యక్షం అయ్యాడు.
ఆ ఆకారాన్ని చూసి బ్రహ్మ ఐదో తల ఫక్కున నవ్వింది. దీంతో శివుడు ఆగ్రహంతో వూగిపోయాడు. భృకుటి ముడిపడింది. అందులోంచి భయంకరమైన ఆకారంతో ఓ కాలపురుషుడు ఆవిర్భవించాడు. అతడే కాలభైరవుడు. భయంకరంగా ఉంటాడు కాబట్టి భైరవుడన్న పేరొచ్చింది. పాపాల్ని పరిహరించేవాడిగా ‘పాపభక్షు’ అయ్యాడు. కాలభైరవుడికి కాశీనగరం మీద ఆధిపత్యాన్ని ప్రసాదించాడు మహాదేవుడు. శివుడి ఆదేశాన్ని అనుసరించి ...తన వేలిగోటితో బ్రహ్మ ఐదో తలను తెగ నరికేశాడు కాలభైరవుడు. కానీ, ఆ తల కిందపడిపోకుండా భైరవుడి చేతికి అంటుకుపోయింది. అంతలోనే విష్ణువు చుట్టూ తిరుగుతున్న మాయ కూడా తొలగింది. శివతత్వాన్ని నోరారా మెచ్చుకున్నాడు. దీంతో, నాగభూషణుడు శాంతించి విష్ణుమూర్తిని ఆలింగనం చేసుకున్నాడు. చేతికి అంటుకున్న బ్రహ్మకపాలాన్ని మాత్రం కాలభైరవుడు వదిలించుకోలేకపోయాడు. ముల్లోకాలూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. కాశీనగరంలో కాలుపెట్టగానే, మహాద్భుతం జరిగినట్టు...కపాలం వూడిపడింది. దీంతో కాలభైరవుడు ఆనంద తాండవం చేశాడు. కాశీక్షేత్రంలోని ఆ ప్రాంతమే ‘కపాలమోచన’ దివ్యతీర్థంగా ప్రసిద్ధమైంది. ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. ఈ తీర్థానికి ఎదురుగా కాలభైరవుడు కొలువుదీరాడు. పరమశివుడి ఆదేశం ప్రకారం...కాలభైరవుడే కాశీ క్షేత్రాధిపతి.

Saturday, 26 August 2017

దర్భ ( గడ్డి ) యొక్క ప్రాముఖ్యం...........

దర్భ ( గడ్డి ) యొక్క ప్రాముఖ్యం...........
మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన “దర్భ” ముఖ్యమయినది. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో దర్భ జాతి దర్భను అపరకర్మలకు, కుశ జాతి దర్భనుశుకర్మలకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, శరము (రెల్లు) జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి. కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు. కూర్మ పురాణం ప్రకారం, విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని (క్షీరసాగర మధనం సందర్భములో) మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మము వంటిమీద ఉండే కేశములు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశముగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అనీ చెప్పబడింది. వరాహ పురాణం ప్రకారం, ఈ దర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువుశరీర కేశములని చెప్పబడింది. అందువలననే దర్భ గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపములని జనులు భావించి భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వీటికి దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉందని నమ్మిక. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు, రక్తస్రావం, మూత్రపిండాలలో రాళ్ళు, మూత్రవిసర్జనలో లోపాలు మొదలయిన వానికి మందుగా వాడుతున్నారు.
అలానే ముంజ పర్వతం మీద ఉండే దర్భ అతిసారాది రోగాలకు ఔషధమని అథర్వణ వేదంలో చెప్పబడింది.అసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణ కాలం. ఆ సమయంలో అన్నిటి మీదా దర్భను ఉంచడం మనకు అలవాటు. కానీ అలా చేయటం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే:సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమయిన విష కిరణాలు భూమి మీదకు ప్రసారమవుతాయని ఈనాటి విజ్ఞానశాస్త్రంనిరూపిస్తోంది. ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో కూడా తేలింది. అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు తమ గృహాలను పూర్తిగా దర్భగడ్డితోనే నిర్మించుకుంటున్నారు. ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు గూడా గుర్తించి, గ్రహణ సమయంలో, ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ళ కప్పులను దర్భగడ్డితోకప్పుకొమ్మని శాసనం చేశారు (బహుశా అందుకనే గడ్డితో ఇంటి పైకప్పుని ఎక్కువగా కప్పుకునేవారు).కాలక్రమంలో ఆ శాసనం మార్పులు చెంది, ఇంటి మధ్యలో రెండు దర్భ పరకలు పరచుకొని తూ తూ మంత్రంలా కానిచ్చేస్తున్నారు. ఇలాకాక, కనీసం పిడికెడు దర్భలైనా ప్రతివ్యక్తీ గ్రహణ సమయాలలో శిరస్సుమీద కప్పుకొంటే, చెడు కిరణాల ప్రభావం వుండదని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. సదాశివరావు అనే ఒక వైద్యులు ఈ దర్భ గురించిన ఎన్నో విషయాలను తెలుసుకుని, నమ్మకం కుదరక, కొన్ని దర్భలను తీసుకుని అరచేతిలో ఉంచుకుని మరీ X-Ray తీయించుకోగా, ఆయన నమ్మలేని విధంగా అరవై శాతం రేడియేషన్ ఈ దర్భ గడ్డి చేత శోషించబడిందిట. దీనికి కారణం దర్భల కొనలుతేజమును కలిగి ఉండుట.
ఇటువంటి దర్భ గురించి మరెన్నో ఆసక్తికరమయిన విషయాలున్నాయి.శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనఃనాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజినకుశోత్తరంఅని భగవద్గీతలో చెప్పబడింది. అంటే ఒక మంచి, స్థిరమయిన ప్రదేశంలో, మనసుని లగ్నం చేసేందుకు సరయిన ఆసనం ఎత్తుగా కాకుండా, మరీ క్రిందకి కాకుండా, చక్కని కుశ గడ్డిని పరచి, దాని మీద జింక చర్మం వేసి ఆ పైన ఒక చక్కని వస్త్రము ఉండేటటువంటి దర్భాసనమే ధ్యానానికి ఉత్తమం అని శ్రీకృష్ణుడు చెప్తారు. అలానే తైత్తరీయోపనిషత్తులో బర్హిషావై ప్రజాపతి: అని ఉంది. అనగా బర్హిష అనే గడ్డిని పరిచి దాని పైన ప్రజలను ఉత్పన్నం చేయటం, వృద్ధి పరచటం చేసేవారని చెప్పబడింది. ఋగ్వేదంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఈ రకమయిన గడ్డి ఎక్కువగా ఉండే ద్వీపాన్ని కుశ ద్వీపం అని కూడా అంటారు. వీటిని గూర్చి మన వేమన గారు ఏమన్నారో చూడండి:దాతగానివాని తఱచుగా వేఁడినవాడుఁ దాతయగునె వసుధలోనఅవురు దర్భ యౌనె యబ్ధిలో ముంచినవిశ్వదాభిరామ వినర వేమ!అనగా దానము అంటే ఎరుగని వాడిని ఎన్నిసార్లు అడిగినా వాడు దానము ఇస్తాడా? దాత అవుతాడా? అదే విధముగా ఇంటిపై కప్పు గడ్డిని పవిత్రమైన సముద్రములో ముంచినంత మాత్రాన దాని రూపు మారి దర్భ అవుతుందా? అని. కానీ ఇక్కడ ఇంటిపైకప్పు గడ్డి అన్నది రెల్లు గడ్డి కాదని గుర్తుంచుకోమని మనవి. ఈ విధముగా దర్భలు ఆధ్యాత్మికతతో పాటూ సాహిత్యంలో కూడా చోటు సంపాదించుకున్నాయి.వేద పాఠం మననం చేసుకునేటప్పుడూ, నేర్చుకునేటప్పుడూ, పఠించేటప్పుడూ దర్భ ఉంగరం కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి అని మన శాస్త్రాల్లో చెప్పబడింది. చావు సంబంధిత కర్మలకి ఏక ఆకు దర్భని, శుభప్రదమయిన వాటికి రెండు ఆకుల దర్భని, అశుభకార్యాలకి (పితృ పూజ, తర్పణాలు, మొ) మూడు ఆకుల దర్భని, పూజా తదితర కార్యక్రమాలకు నాలుగు ఆకుల దర్భని ఉంగరముగా వాడవలెననీ ఉంది.
అలానే శ్రాద్ధ కర్మలకు బ్రాహ్మణులు దొరకని పక్షంలో దర్భ ఉంగరాన్ని ఆ స్థానంలో ఉంచి కర్మ చేయవలెనని శ్రీ పద్మ పురాణములో చెప్పబడింది.దర్భల కొనలు విడుదల చేసే తేజము – దేవతలనూ, పితృ దేవతలను సైతం ఆకర్షించి మనం ఏ పనయితే చేస్తున్నామో ఆ పనికి తగ్గట్టు వారిని ఆహ్వానించి మన ముందు ఉంచుతుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. సమూలస్తు భవేత్ దర్భః పితృణాం శ్రాద్ధ కర్మణింఅన్నట్టుగా దర్భను వేరుతో (మూలము నుండి) సహా భూమి నుండి పెకిలించి దానిని వాడాలి. ఎందుకంటే ఈ వేరులు మాత్రమే పితృ లోకంలోని పితృ దేవతలకు విజయాన్ని చేకూరుస్తాయని అంటారు. అందుకే యజ్ఞ యాగాదులలో అగ్ని గుండానికి నలువైపులా దర్భలను పరుస్తారు.వీటికి ఉండే సహజసిద్ధమయిన గుణములను ఆరు నెలల తరువాత కోల్పోతాయిట. ఇవి స్వ, పర జనాల కోపాలను పోగొట్టి, సముద్రాన్ని సైతం అణచిపెడుతుంది అని అథర్వణ వేదంలో చెప్పబడింది. దర్భలను ఎక్కువగా వాడుట వలన మనలో సత్వ గుణం పెరుగుతుంది. ఒకవేళ మనం వాటిని నేలకేసి కొట్టినా, గోటితో చీలినా, వాటికి ఎటువంటి హాని కలుగ చేసినా మనలో రజ-తమో గుణాల తీవ్రత పెరిగి మనలో ఉండే సత్వ గుణాన్ని కూడా నాశనం చేస్తుందిట. వీటిని పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి నాడు మాత్రమే ఈ క్రింది శ్లోకం చదువుతూ కొయ్యాలి:విరించినా సహోత్పన్న పరమేష్ఠి నిసర్గజనుద సర్వాణి పాపాని దర్భ స్వస్తికరో భవఈ విధముగా దర్భలు ఎన్నో కార్యక్రమాలలో, ఎన్నో విషయాలలో మనకు చేరువయ్యాయి. దర్భల కొన కోసుగా ఉండుట వలననే అమృతం నాకడానికి వచ్చిన పాముల నాలుకలు రెండు క్రింద చీలాయని నిందలు భరించినా అవి మాత్రం మనకు ఎన్నో విధాలుగా మంచి చేస్తూ, సహకరిస్తూనే ఉన్నాయి. వీటి విలువ తెలిసింది కనుక ఎప్పుడూ ఒక గుప్పెడన్నా ఇంట్లోఉండేలా చూసుకోవడం మరువకండి.

Friday, 25 August 2017

తిరుమల చరిత్ర...........

తిరుమల చరిత్ర
తిరుమల కలియుగ వైకుంఠం. కలియుగంలో దర్శన ప్రార్థనార్చనలతో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడు. తిరుమల ఆలయాన్ని, ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు.
దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వేంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాభ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాభ్దానికి చెందిన చోళులు (తంజావురు) పాండ్య రాజులు (మదురై), 13-14 శతాభ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతుడైన శ్రీ కృష్ణదేవ రాయలు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.
తిరుమల కాలక్రమము.
ఇక్కడ లభ్యమైన శాసనాలనుబట్టి 15 వందల ఏళ్ల నాటి నుండి తిరుమల చరిత్ర ఈ విధంగా ఉంది. పల్లవ రాణి సామవై క్రీ.శ.614. ఈ మహారాణి కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్దరణ కావింపబడింది. శ్రీవారి అనేక ఆభరణాలు సమర్పిస్తూ, ఉత్సవాలు నిర్వహిస్తూ పరమభక్త శిరోమణిగా తిరుమల చ్రిత్రలో శాశ్వతంగా నిలిచింది.ఈమెకి 'పేరుందేవి'అని మరో పేరువుంది. తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు క్రీ.శ.1328, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాధయాధవరాయలు క్రీ.శ.1429, హరిహరరాయలు క్రీ.శ. 1446 లలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.
సాళువ నరసింహరాయలు క్రీ.శ.1470 లో భార్య ఇద్దరు కుమారుల తన పేర్లతో సంపగి ప్రదక్షిణం నాలుగు మూలలో నాలుగు స్తంభాల మండపాలని నిర్మిచాడు.క్రీ.శ.1473 లో తిరుమలరాయ మండపానికి వేదిక నిర్మించాడు. ఉత్సవాలు జరిపించేవాడు.
శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ.1513 నుండి 1521 వరకు ఏడు సార్లు తిరుమలకి వచ్చి ఎన్నో కానుకలు సమర్పించాడు, ఉత్సవాలు నిర్వహించాడు. రాయలు 1513 ఫిబ్రవరి 10 న 25 వెండి పళ్లాలను ఇవ్వగా, స్వామివారి పాల ఆరగింపు కొరకు రాయల దేవేరులు రెండు బంగారు గిన్నెలు ఇచ్చారు. 1513 మే 2న రెండవసారి, 1513 జూన్ 13న మూడో సారి తిరుమల సందర్శించి, మూల విరాట్టుకు ఆభరణాలు, ఉత్సవ మూర్తులకు మూడు మణిమయ కిరీటాలు సమర్పించాడు. నిత్య నైవేద్యానికి ఐదు గ్రామాలను కానుకగా ఇచ్చాడు. 1514 జూన్ 6న నాల్గవసారి తిరుమలని దర్శించి,30 వేల వరహాలతో కనకాభిషేకం చేసాడు. నిత్యారాధన కోసం తాళ్ళపాక గ్రామాన్ని దానంగా ఇచ్చాడు.
1517 జనవరి 2న ఐదవ సారి తిరుమలకు వచ్చి ఆలయ ప్రాంగణంలో తమ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నాడు. 1518 సెప్టంబర్ 9న ఆనందనిలయానికి బంగారు పూత చేయించాడు. 1518 లో ఆరవసారి, 1521 ఫిబ్రవరి 17న ఏడవసారి తిరుమలకి వచ్చి నవరత్న కుళ్ళాయిని, పీతాంబరాలని సమర్పించాడు.
అచ్యుత రాయలు 1530 లో ఉత్సవాలు నిర్వహించాడు. ఆలయానికి ఎన్నో గ్రామాలు భూములను కానుకగా ఇచ్చాడు. 16 శతాబ్దం చివరలో తిరుమల రాయలు అన్నాఊయల మండపాన్ని విస్తరింపజేసి, ఉత్సవాలు నిర్వహించాడు. 1570లో వెంకటపతి రాయలు చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు.
విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఆలయం మహమ్మదీయుల పరమైనది. కర్నాటకకు నవాబైన దావూద్ ఖాన్ హైదరాబాదు నిజాం ప్రభువులకి కట్టవలసిన పన్నుల కొరకై ఆలయంపై పన్నులు విధించాడు. ఈ ఆదాయానికై మహమ్మదీయులు, మరాఠాలు గొడవలు పడ్డారు, 1740 లో మరాఠీ ప్రభువు ఆలయాన్ని స్వాధీన పరచుకుని, రక్షించి స్వామివారికి ఎన్నో అమ్మూల్య ఆభరణాలు సమర్పించాడు.
తరువాత క్రమంగా 1801 నాటికి ఆలయం ఈస్టిండియా కంపెనీ వారి వశమైంది. ఈస్టిండియా కంపెనీ మొదట్లో హిందూ దేవాలయాలను, ముస్లిముల మసీదులను కాపాడుతూ వారి ధర్మాలను స్వయంగా పరిపాలించేవారు. దీనికి సంబంధించిన శాసనం ఒకటి క్రీ.శ.1810లో బెంగాలు ప్రాంతంలో వేయించారు. క్రీ.శ.1817లో చేసిన 7వ రెగ్యులేషన్ చట్టంలో కూడా ఇదే పాలసీని కొనసాగించారు. ధర్మాదాయాల సొమ్మును రెవెన్యూతో పాటు జిల్లా కలెక్టర్లు వసూలు చేసి, దేవునికి క్రమంతప్పక ఉ్సతవాలు, అర్చనలు, భోగాలు స్వయంగా పర్యవేక్షించి జరిపేవారు. దేవాలయంపై వచ్చిన సొమ్ములో ఈ కార్యక్రమాలు చేశాకా మిగిలిన సొమ్ము ఈస్టిండియా కంపెనీ వారి ఖజానాలో చేరేది. కలెక్టర్లపై రెవెన్యూబోర్డుకు తనిఖీ అధికారం ఉండేది. తిరుమల దేవాలయాన్ని కూడా ఇదే పద్ధతిలో పరిపాలన చేసేవారు. దేవాలయంలో చేయాల్సిన సేవలు, ఉత్సవాలు, అర్చనలకు ఖర్చుచేయగా కంపెనీకి మిగిలిన ఆదాయం 1830లోనే దాదాపుగా సాలుకు రూ.లక్షకు పైగా ఉండేదంటే తిరుమల వైభవం ఊహించవచ్చు. తిరుమలలో ఏ దానధర్మాలు చేయాలన్నా ప్రభుత్వానికి సొమ్ము ఇచ్చుకోవలసిన స్థితి ఉండేది [1]. క్రైస్తవ మిషనరీలు కంపెనీ ప్రభుత్వం హిందూదేవాలయాలను, ముస్లిముల మసీదులను నిర్వహించడం ప్రోత్సహించడం క్రిందికే వస్తుందని, ఇది సరైన పని కాదని ఇంగ్లాండులో ఆందోళన చేయగా 1833 నుంచి కంపెనీ వారు దేశంలో మతాల పట్ల జోక్యం కలిగించుకోరాదన్న పద్ధతిలో ప్రవర్తించడం ప్రారంభించారు. ఐతే తిరుమల, పూరి వంటి సుప్రసిద్ధ ఆలయాలకు వచ్చే ఆదాయం బాగా ఎక్కువ కావడంతో వాటిని తమ వశంలోనే ఉంచుకున్నది. ఎప్పటిలా కంపెనీ ఉద్యోగులే నిర్వహించేవారు. ఐతే 1841లో ఆంగ్లప్రభుత్వం హిందూ మతసంస్థలలో జోక్యం చెసుకోకూడదని చట్టం చేసినందున ఆ ఆలయ నిర్వహణ మహంతులకు అప్పజెప్పింది. అప్పటి నుంచి 1863 వరకూ దేవాలయాలను సక్రమంగా నిర్వహించే నాథుడులేక, ఉన్న ధర్మకర్తలు అక్రమాలకు పాల్పడుతూండడం మూలంగా బ్రిటీష్ ఇండియాలోని దేవాలయాలు దెబ్బతిన్నాయి. ఈ స్థితిలో 1863లో కొత్త దేవాదాయధర్మాదాయ చట్టం ఈ అరాచక స్థితిని సరిజేసే ప్రయత్నం చేసింది.[1] 1843 నుండి -
మహంతు సేవాదాస్ జీ,
మహంతు ధర్మ దాస్ జీ,
మహంతు భగవాన్ దాస్ జీ,
మహా వీరదాస్ జీ,
రామకృష్ణ దాస్ జీ,
ప్రయాగదాస్ జీ,
ఇలా 90 ఏళ్ల పాటు మహంతుల పాలనసాగింది.
వీరి తరువాత,1933 లోఅప్పటి గవర్నర్ ధర్మ కర్తల మండలిని ఏర్పాటు చేసాడు.
19 వ శతాబ్దాంతానికి కొండపైన శ్రీవారి ఆలయం, హథీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలూ ఉండేవి కావు. అర్చకులు సైతం కొండ కింద ఉన్న కొత్తూరులోనే ఉండేవాళ్లు. తెల్లవారుజామునే లేచి సప్తగిరులూ ఎక్కి ఉదయం ఏడు గంటలకు స్వామికి మేలుకొలుపులు పాడేవారు. అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ, గోవిందనామ స్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు. రాళ్లూరప్పలూ నిండిన దారిలో కొంతసేపు వెళుతూ మధ్యలో వంటావార్పు కోసం ఆగుతూ... మొత్తానికి పైకి చేరుకునేసరికి దాదాపు రెండురోజులు పట్టేదట. వారు మధ్యలో ఆగేందుకు మూడుచోట్ల దిగుడుబావులూ విశ్రాంతి మండపాలూ ఉండేవి. వాటిని ఠాణాలు అనేవారు. వయసు మళ్లినవారినీ అంగవికలురనూ పిల్లలనూ పైకి తీసుకువెళ్లేందుకు డోలీ కూలీలు ఉండేవారు. కావడి బద్దకు కుర్చీలు అమర్చి నడవలేనివారిని వాటి మీద కూచోబెట్టుకుని వారు పైకి మోసుకెళ్లేవారు. అందుకు పది అణాలు రుసుము వసూలు చేసేవారు. సామాన్యులకు ఆ మాత్రం స్తోమత కూడా ఉండేది కాదు. తిరుమల రాగిచెట్టు (ఇప్పుడు కల్యాణకట్ట ఉన్న ప్రదేశం) దగ్గర డోలీలు నిలుపుకోవడానికి ఒక ప్రత్యేక మండపం ఉండేది. అక్కడిదాకానే ఈ డోలీలను అనుమతించేవారు. ఆ స్టాండును డోలీమండపం బ్లాక్ అనేవారు. (ఇప్పుడా రోడ్డునే డి.ఎం.బి. రోడ్డుగా వ్యవహరిస్తున్నారు.) అక్కణ్నుంచి సన్నిధి వీధి మీదుగా గుడికి చేరుకుని నేరుగా మహాద్వారం గుండా లోపలికి ప్రవేశించి భక్తులు స్వామి దర్శనం చేసుకొనేవారు. 1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండమీదకు మెట్లు నిర్మించింది. 1933లో ఏర్పడిన తితిదేబోర్డు రూ.26వేల ఖర్చుతో ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది. ఐదుపదుల ఏళ్లనాటి దేవస్థానం రికార్డుల ప్రకారం అప్పట్లో పొద్దున ఏడున్నరకు సుప్రభాత సేవ, రాత్రి పదిన్నరకు ఏకాంతసేవ జరిగేవి. ఇప్పుడు రాత్రి రెండున్నరకు ఆలయం మూసివేసి సరిగ్గా అరగంటలోనే మళ్లీ సుప్రభాతంతో మేల్కొలుపులు మొదలుపెడుతున్నారు.
కొండ మీద ఊరు.
తిరుమల నిర్వహణ హథీరాంజీ మఠం ఆధ్వర్యంలో ఉన్నప్పుడు యాత్రికులకు సౌకర్యాలు ఏర్పరచాలంటే చాలా కష్టమయ్యేది. ఎందుకంటే అక్కడ ఎవరూ ఉండేవారు కాదు. తిరుమలలోనే ఉందామంటే విపరీతమైన చలి. దానికి తోడు ఆ ప్రాంతమంతా అడవిలా ఉండేది. జంతువుల భయం సరేసరి. కొండమీద ఒక ఊరు తయారైతే ఈ ఇబ్బందులన్నీ అధిగమించవచ్చన్న ఆలోచనతో 1910-20 కాలం నాటికి జనావాసాలను ఏర్పరచేందుకు ప్రయత్నించారు. వారికి ఆవాసం కల్పించేందుకు హథీరాంజీ మఠం భూములు లీజుకు ఇచ్చింది. నెమ్మదిగా ఆలయం చుట్టూ నాలుగు వీధులతో ఒక ఊరు తయారైంది. మొదట్లో అక్కడి జనాభా 200 నుంచి 300 మంది మాత్రమే. స్వామిని చూడవచ్చే భక్తులకు ఈ కుటుంబాలే మొదట్లో అన్ని సౌకర్యాలూ కల్పించేవి. క్రమేణా తిరుమలలో ఉండే వారి సంఖ్య 25వేలకు పెరిగింది. 30 ఏళ్ల క్రితం వరకూ కూడా వారంతా రోజూ సరాసరి మహాద్వారం గుండానే గుడిలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకుని తమ పనులు చేసుకొనేవారు. కానీ యాత్రికుల సంఖ్య పెరుగుతుండటంతో తితిదే వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి తిరుపతికి తరలించింది.
ఘాట్‌రోడ్డు నిర్మాణం.
1940ల నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది. అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండమీదకు రోడ్డుమార్గం గురించి ఆలోచించింది. బ్రిటిష్ అధికారులు సర్వే బృందాల వారు తిరుపతి చేరుకున్నారు. 1944 ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్‌రోడ్డు నిర్మాణం పూర్తయింది. అదేనెల పదోతేదీన మద్రాసు రాష్ట్ర గవర్నర్ ఆర్ధర్‌హోప్ రోడ్డుమార్గాన్ని ప్రారంభించారు. మొదట్లో ఎద్దులబళ్లు, గుర్రపుబళ్లు తిరిగేవి. దీంతో భక్తుల పని సులువైంది. నెమ్మదిగా దేవస్థానమే తిరుమల-తిరుపతి మధ్య రెండు బస్సులు ప్రారంభించింది. ఆ సర్వీసులు తిరుపతిలోని మొదటిసత్రం నుంచి రోజుకు మూడుసార్లు ఉండేవి. తిరుమల నుంచి రాత్రి ఏడు దాటితే బస్సులే ఉండేవి కావు. 1955-56లో రైల్వేస్టేషన్ సమీపాన శ్రీనివాస బస్టాండు ఏర్పడే నాటికి భక్తుల సంఖ్య రోజుకు 500 నుంచి 600 వరకు ఉండేది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తసాగారు. దీంతో రెండో ఘాట్‌రోడ్డు గురించి ఆలోచించాల్సి వచ్చింది. 1974 నాటికి అదీ పూర్తయింది.

Wednesday, 23 August 2017

వినాయక చవితి రోజున 21 ( ఏకవింశతి ) పత్రాలతో పూజ చేయండి.......



వినాయక చవితి రోజున 21 ( ఏకవింశతి ) పత్రాలతో పూజ చేయండి.......
వినాయక చవితి నాడు చేసే పూజలో పత్రాలు ప్రధానమైనవి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ.
1. మాచీ పత్రం: మాచ పత్రి అనేది తెలుగు పేరు. చేమంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి. చేమంతి ఆకుల మాదిరే ఉంటాయి.
2. దూర్వా పత్రం: దూర్వా పత్రం అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలుంటాయి. గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి.
3. అపామార్గ పత్రం: తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా వుంటాయి. గింజలు, ముళ్ళు కలిగి వుండి కాళ్ళకు గుచ్చుకుంటాయి.
4. బృహతీ పత్రం: దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి. తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో వుంటాయి.
5. దుత్తూర పత్రం: దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఇది వంకాయ జాతికి చెందింది. ముళ్ళతో కాయలు వంకాయ రంగు పూలు వుంటాయి.
6. తులసీ పత్రం: హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు.
7. బిల్వ పత్రం: బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా ఉంటాయి. ఇవి శివునికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడ ఇష్టమైందిగా చెపుతారు.
8. బదరీ పత్రం: బదరీ పత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి.
9. చూత పత్రం: చూత పత్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగరోజులలో కనిపించదు.
10. కరవీర పత్రం: దీనినే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది.
11. మరువక పత్రం: దీన్ని వాడుక భాషలో ధవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ పత్రం ప్రత్యేకత.
12. శమీ పత్రం: జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
13. విష్ణుక్రాంత పత్రం: ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు.
14. సింధువార పత్రం: సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అనికూడ పిలుస్తుంటారు.
15. అశ్వత్థ పత్రం: రావి ఆకులనే అశ్వత్థ పత్ర మంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం మనసంప్రదాయం.
16. దాడిమీ పత్రం: దాడిమీ అంటె దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీఫల నైవేద్యం ఎంతో ఇష్టం.
17. జాజి పత్రం: ఇది సన్నజాజి అనే మల్లిజాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు.
18. అర్జున పత్రం: మద్దిచెట్టు ఆకులనే అర్జున పత్రమంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి వుంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది.
19. దేవదారు పత్రం: దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది.
20. గండలీ పత్రం: దీనినే లతాదూర్వా అనికూడా అంటారు. భూమిపైన తీగమాదిరి పాకి కణుపులలో గడ్డిమాదిరి పెరుగుతుంది.
21. అర్క పత్రం: జిల్లేడు ఆకులను అర్క పత్రమంటారు. తెల్లజిల్లేడు పేరుతో తయారుచేసిన వినాయకప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలం వుంటుంది.
ఈ 21 పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతుంది అని శాస్త్రవచనం.
ఈ పత్రాలలో కొన్ని పాలు స్రవించేవి, మరికొన్ని పసరు స్రవించేవి. స్వహస్తాలతో త్రుంచేటప్పుడు వాటినుంచి స్రవించే పాలు, పసర్లు కొంచమైనా మన చర్మ రంధ్రాలగుండా శరీరంలోకి వెళ్లి రక్తాన్ని శుద్ధిచేసి, నరాలకు పుష్టిని కలిగిస్తాయి. ఆ పత్రాలను సేకరించేందుకు చాలా సమయం చెట్ల దగ్గర మొక్కల దగ్గర గడుపుతూ, అవి విడుదల చేసే ప్రాణవాయువును పీలుస్తాం.మామూలు మొక్కలు విడుదల చేసే ప్రాణవాయువు కన్న, ఓషధీ మొక్కలు విడుదల చేసే ప్రాణవాయువు మృత్యుంజయ కారకాలు కనుక ఊపిరితిత్తులు శుద్ధిపడి, శ్వాస సంబంధమైన వ్యాధుల నుంచి విడుదల పొందుతాం. ఇది ఆరోగ్య కారణం. ఏనుగు వన సంచారి. ఆకులు, అలములు దాని ఆహారం. కనుక గజముఖుడైన వినాయకుని ఆకులతోనే అర్చించాలి. ఇది భౌతిక కారణం అంతేకాక.. అవసరమున్నా, లేకపోయినా, ఏనుగు.., తన తొండాన్ని కాళీగా ఉంచకుండా ఏ తీగనో, కొమ్మనో లాగుతూంటుంది. అలాగే గజముఖుడైన వినాయకుడు మన మనో వనసంచారి. ఆయన అంకుశం లాంటి తన తొండంతో మన మనస్సులలోని కల్మష భావాలనే కలుపు మొక్కలను సమూలంగా పీకేసి, తన మోదక ప్రసాదాలతో మన బుద్ధిని పవిత్రం చేసి, ఆనందమయ మార్గంలో మనలను నడుపుతాడు. ఇది ఆధ్యాత్మిక కారణం. అందుకు కృతఙ్ఞతగా వివాయకునికి ఇష్టమైన పత్రాలతో ఆయనను పూజిస్తాం.

‘గురు’ అవతారం... దత్తాత్రేయుడు............

‘గురు’ అవతారం... దత్తాత్రేయుడు............
పరమాత్మ ఒక్కో సమయంలో ఒక్కో అవతారంలో వచ్చి ప్రజల్ని ఉద్ధరిస్తాడు. ధర్మావతారాల్లో...రాముడిగా, కృష్ణుడిగా రాక్షస సంహారం ద్వారా ధర్మసంస్థాపన జరిపిన నారాయణుడే...దత్తాత్రేయుడి అవతారంలో సమర్థ గురువుగా జ్ఞానప్రబోధ చేశాడు.
దత్తాత్రేయుడు శ్రీమన్నారాయణుడి ఆరో అవతారమని భాగవతమూ, విష్ణుపురాణమూ ఘోషిస్తున్నాయి. అత్రి మహర్షి, అనసూయ దంపతుల తనయుడిగా జన్మించాడు బాలదత్తుడు. ఆ దంపతులు ఓంకారాన్ని ధ్యానిస్తూ మహాతపస్సు చేశారు. ఆ సాధనకు మెచ్చి ఓ దివ్య తేజస్సు ప్రత్యక్షమైంది. ఆ కాంతిపుంజంలో త్రిమూర్తులు దర్శనమిచ్చారు. ఆ ముగ్గురు మూర్తుల అంశగా దత్తుడు వారికి జన్మించాడు. అత్రి...అంటే త్రిగుణాతీత స్థితికి చేరుకున్నవాడని అర్థం. అతడి అర్ధాంగి అనసూయ...అసూయలేనిది. నిజానికి ఇవి పేర్లు కాదు...ఆ ఆలూమగల సుగుణాలు. ఆ సద్గుణ సంపన్నుల బిడ్డగా జన్మించాడు దత్తుడు. దత్తం..అంటే సమర్పించుకోవడం. దత్తుడు జ్ఞానబోధ కోసం తనను తాను అంకితం చేసుకున్నాడు. అత్రిపుత్రుడు కాబట్టి ఆత్రేయుడన్న పేరూ వచ్చింది.
దత్తుడిది జ్ఞానావతారం! పిచ్చివాడిలానో, వ్యసనపరుడిలానో కనిపించి...పైపై మెరుగులకు భ్రమపడిపోయే అజ్ఞానులకు బుద్ధిచెప్పిన ఉదంతాలు అనేకం. దేవతలకు కూడా చేతిలో కల్లుముంతతో, ఒడిలో ప్రియురాలితో దర్శనమిచ్చాడోసారి. అది సుర కాదు, బ్రహ్మజ్ఞానం. ఆమె శ్రీలక్ష్మి. దత్తుడు ఓపట్టాన అర్థం కాడు. దత్తతత్వాన్ని తెలుసుకోవాలంటే అహాన్ని వదిలిపెట్టాలి. శరణాగతి సూత్రాన్ని పాటించాలి.
అసుర సంహారం...
పూర్వం జంభాసురుడనే రాక్షసుడు ప్రజల్ని హింసించేవాడు. దీంతో దేవతలంతా...విష్ణు స్వరూపుడైన దత్తాత్రేయుడిని ప్రార్థించారు. ‘ఆ రాక్షసుడిని నా దగ్గరికి తీసుకురండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను’ అని మాటిచ్చాడు. దీంతో దేవతలు జంభాసురుడి మీద కయ్యానికి కాలుదువ్వుతున్నట్టు నటించారు. ఆ అసురుడికి కోపం తన్నుకొచ్చింది. ‘ఇంతకుముందే చావుదెబ్బ తీశాను. అంతలోనే ఇంత ధైర్యం ఏమిటి?’ అంటూ కోపంగా మళ్లీ రంగంలో దూకాడు. దేవతలు ఉద్దేశపూర్వకంగా వెన్నుచూపారు. జంభాసురుడు వాళ్లను తరుముతూ వెళ్లాడు. దత్తుడి సమక్షంలోకి వెళ్లగానే ఠక్కున మాయమైపోయింది దేవగణమంతా. ఎదురుగా...ఒడిలో అందాల రాశితో, మహాభోగిలా దర్శనమిచ్చాడు దత్తాత్రేయుడు. జంభాసురుడి కళ్లు ఆ సౌందర్యరాశి మీదికి మళ్లాయి. ఆమె శ్రీమహాలక్ష్మి అన్న ఇంగితం కూడా లేకుండా... బలవంతంగా తీసుకెళ్లి నెత్తిమీద పెట్టుకున్నాడు. సంపద నెత్తికెక్కిందంటే, పతనం మొదలైనట్టే. జంభాసురుడి బలం క్షీణించసాగింది. దేవతల పని సులువైపోయింది. అసుర సంహారం జరిగిపోయింది.
ప్రహ్లాద వరదుడు...
అనేక సంవత్సరాల రాజ్యపాలన తర్వాత...జ్ఞానాన్వేషణలో ప్రహ్లాదుడు అరణ్యమార్గం పట్టాడు. అక్కడ, అజగరవృత్తిలో ఓ వ్యక్తి కనిపించాడు. అజగరం అంటే...కొండచిలువ! ఆ విషప్రాణికో ప్రత్యేకత ఉంది. కొండచిలువ ఆహారం కోసం వేటకు వెళ్లదు. తాను ఉన్నచోటికి ఆహారం వస్తే మాత్రం...గుటుక్కున మింగి కడుపు నింపుకుంటుంది. లేకపోతే ఉపవాసమే. సాధకులు కూడా...ఆహారపానీయాల విషయంలో ఇలాంటి నిర్మోహత్వాన్నే అనుసరిస్తారు. పిచ్చివాడిలా కనిపిస్తున్న ఆ మనిషే దత్తుడని ప్రహ్లాదుడు గ్రహించాడు. ‘జై గురుదత్తా...’ అంటూ పాదాల మీద పడ్డాడు. ఆ మహాగురువు కరుణించి జ్ఞానమార్గాన్ని బోధించాడు. వివిధ సందర్భాల్లో... కార్తవీర్యార్జునుడికీ, పరశురాముడికీ, యదువంశ మూలపురుషుడు యదువుకూ...ఇలా ఎంతోమందికి జ్ఞానాన్ని బోధించాడు దత్తగురుడు. యోగిరాజ వల్లభుడు, జ్ఞానసాగరుడు, సంస్కారహీన శివురూపుడు...ఇలా భిన్నరూపాలలో కనిపించి భక్తులకు దివ్యప్రబోధ చేశాడు. మహారాష్ట్రలోని మహుర్‌ సుప్రసిద్ధ దత్తక్షేత్రం. దత్తుడు కాశీలో స్నానంచేసి, కొల్హాపూర్‌లో భిక్ష స్వీకరించి, మహుర్‌లో నిద్రించేవాడని అంటారు. శ్రీపాద శ్రీవల్లభుడు (పిఠాపురం), నరసింహ సరస్వతి (మహారాష్ట్ర), అక్కల్‌కోట మహరాజ్‌ (అక్కల్‌), షిర్డీసాయి (షిర్డీ) దత్తుని అవతారాలని చెబుతారు. దత్తుడు స్మృతిగామి...తలచిన వెంటనే భక్తుల హృదయాల్లో ప్రత్యక్షమైపోతాడని సాధకుల విశ్వాసం.
తెలుగు గడ్డ మీద....
మార్గశిర పౌర్ణమినాడు దత్తుడు ఉదయించాడు. అదే దత్తజయంతి. దత్తుడి రూపం అపురూపం. ఆరు చేతులూ, మూడు తలలూ, చేతిలో డమరుకమూ, త్రిశూలమూ...తదితర ఆయుధాలుంటాయి. చుట్టూ కుక్కలు ఉంటాయి. ఆ శునకాలు వేదానికి ప్రతీకలు. ఆయన వెనకాల కనిపించే గోవు...ఉపనిషత్తుల సారం. దత్తజయంతినాడు ఆస్తికులు...జపతపాలతో, పూజలతో గడుపుతారు. పగలంతా ఉపవాసం చేసి, సాయంత్రం భజనలూ సత్సంగాలూ నిర్వహించుకుంటారు. దత్తచరిత్ర, అవధూత గీత తదితర గ్రంథాల్ని పారాయణ చేస్తారు. ఒకానొక సమయంలో దత్త సంప్రదాయం తెలుగు గడ్డ మీద వెలుగులీనింది. దత్తుడి అవతారమని భావించే శ్రీపాద శ్రీవల్లభుడు ఆంధ్రదేశంలోని పిఠాపురంలో జన్మించాడు. కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని కురుపురంలో ఆశ్రమజీవితం గడిపాడు. అక్కడి కృష్ణాతీరంలో ఓ ఆలయాన్ని నిర్మించారు భక్తులు. నేపాల్‌ తదితర ప్రాంతాల్లోనూ దత్తక్షేత్రాలున్నాయి.

Tuesday, 22 August 2017

భాద్రపద మాస విశిష్టత...............

భాద్రపద మాస విశిష్టత...............
చంద్రమాన రీత్యా చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండడం వాళ్ళ ఇది భాద్రపద మాసం.
ఈ మాసం లో ఒంటి పూట భోజనం చేస్తే ధన సమృద్ది ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. ఉప్పు మరియు బెల్లం దానాలు కూడా ఈ మాసం లో విశేష ఫలితాన్నిస్తాయి. కొన్ని ప్రదేశాలలో
స్త్రీలు భాద్రపద శుక్ల తదియ రోజున హరితాళిక వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించి, ఉపవాసం జాగరణ చేస్తారు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరిస్తే కష్టాలు తొలగి, అష్టైశ్వర్యాలతో తులతూగుతారు.
భాద్రపద శుద్ద చవితి నాడు ఆది దేవుడైన వినాయక ఆవిర్భావం జరిగిన రోజు, ఈ రోజున గణపతి పూజ ఉపవాసం వంటివి విశేష ఫలితాన్నిస్తాయి. ఈ పండుగ ఆదివారం రోజు కాని, మంగళవారం రోజు కాని రావడం మరింత విశేషాన్ని సంతరించుకొంటుంది.
భాద్రపద శుద్ద పంచమి నాడు ఋషి పంచమి జరుపుకొంటారు. ఇది కేవలం ఆడవారికి సంబంధించిన ప్రాయోశ్చితాత్మకమైన వ్రతం. ఈ వ్రతం చేయడం వలన స్త్రీలు ఋతుశ్రావ సమయం లో చేసిన పాపాలన్నీ తొలగి పుణ్య ఫలితం లభిస్తుంది అని భావిష్యపురాణం లో చెప్పబడింది. ఈ వ్రతం లో ముఖ్యం గా ఆచరించవలసినది, బ్రహ్మహణుడికి అరటి పళ్ళు, నెయ్యి, పంచదార, దక్షిణ ఇవ్వాలి. ఒంటి పూట భోజనం చేయాలి. అంతే గాక ఆ భోజనం ధాన్యం, పాలు, పెరుగు, ఉప్పు, పంచాదారలతో తయారైనదవకుండా ఉండాలి. పళ్ళని స్వీకరించడం శ్రేయస్కరం.
బౌద్ద జయంతి ని కూడా ఈ రోజునే జరుపుకొంటారు. బుద్దుని భోధనలు మానవుని ధర్మబద్దమైన, పవిత్రమైన జీవనానికి వెలుగు బాట వేసాయి. ప్రపంచం లోని ధర్మమతస్తాపనకు బుద్దుడు అత్యున్నత స్థానం వహించాడనే విషం లో ఏమాత్రం భేదాభిప్రాయాలు లేవు.
భాద్రపద శుద్ద షష్ఠి /సూర్య షష్ఠి , సప్తమి కలసిన షష్ఠి సూర్యునికి ప్రీతికరం, ఈరోజున సూర్యుడిని ఆవుపాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రం తో ప్రాశనం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలం కంటే ఎక్కువఫలం కలుగుతుందని శాస్త్రం లో చెప్పబడింది. షష్ఠి తో కూడిన సప్తమి కనుక ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి ని పూజిస్తే ఎటువంటి పాతకాలైన నశిస్తాయి.
భాద్రపద శుద్ద అష్టమి నాడు కేదారవ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని సంప్రదాయ సిద్దం గా ఆచరిస్తుంటారు
భాద్రపద శుద్ద దశమి నాడు దశావతార వ్రతం ఆచరించడం, దేవ, ఋషి, పితరులకు తర్పణాలు చేయడం ముఖ్యమైన విధులు.
భాద్రపద శుద్ద ఏకాదశి, దీన్నే పద్మ పరివర్తన ఎకాదసిఅని కూడా అంటారు. తోలి ఏకాదశి రోజున పాల సముద్రం లో శేషతల్పం పై శయనించిన శ్రీమహావిష్ణువు, ఈ ఏకాదశి రోజున ప్రక్కకు పొర్లి పరివర్తనం చెందుతాడు, అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కరువు కాటకాలు తొలగి పోతాయి, ముఖ్యం గా సంధ్యాసమయం లో శ్రీ మహావిష్నువుని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
భాద్రపద శుద్ద ద్వాదశి వామన జయంతి గా చెప్పబడింది, ఈ రోజున వామనున్ని ఆరాదిస్తే అన్ని విషయాలలోనూ విజయం లభిస్తుంది. ముఖ్యం గా ఈ రోజున బ్రాహ్మణులకు పెరుగును దానం చేస్తే మంచి ఫలితాలని పొందవచ్చు.
భాద్రపద మాసం లో శుద్ద చతుర్దశి నాడు అనంత పద్మనాభ చతుర్దశి అంటారు. శేషతల్పసాయిగా నాభికమలం తో శ్రీమహాలక్ష్మి సమేతుడైన శ్రీమహావిష్ణువు ని పూజించి, వ్రతమాచరిస్తే దారిద్ర్యం తొలగి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.
భాద్రపద పూర్ణిమ రోజు ఉమామహేశ్వర వ్రతం జరుపుకొంటారు, భక్తి శ్రద్దలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖశాంతులతో పాటు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.
భాద్రపద పూర్ణిమ తో మహాలయపక్షం ఆరంబమవుతుంది, అమావాస్య వరకు గల ఈ కాలాన్ని పితృ పక్షం అని కూడా అంటారు. మృతులైన పితరులకు, పూర్వీకులకు తప్పనిసరిగా తర్పణలివ్వాలి. శ్రాద్దాన్ని యధాశక్తి గా ఈ దినాలలో చేయాలి.
భాద్రపద బహుళ తదియ ని ఉండ్రాళ్ళ తద్దేగా చెప్పబడింది. ఇది స్త్రీలు చేసుకొనే పండుగ, ముఖ్యం గా కన్నె పిల్లలు గౌరీ దేవి ని పూజించి, ఉండ్రాళ్ళను నివేదిస్తే మంచి భర్త వస్తాడని చెప్పబడింది. స్త్రీలకూ అయిదవతనం వృద్ది చెందుతుంది.
భాద్రపద కృష్ణ ఏకాదశి /అజ ఏకాదశి దీన్ని ధర్మప్రభ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతమాచరించి నూనె గింజలను దానం చేస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు.
భాద్రపద కృష్ణఅమావాస్య /పొలాల అమావాస్య/మహాలయమావాస్య, ఈ రోజున పితృ తర్పణాలు, దానధర్మాలు చేయడం ఆచారం. ఈ రోజున స్త్రీలు పొలాల అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తారు ముఖ్యం గా సంతానం కొరకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

వినాయక వ్రతకల్పము..............

వినాయక వ్రతకల్పము..............
వినాయకచవితి రోజున చేయు వినాయకవ్రతము ప్రముఖ శుభకార్యం కనుక ముందు పసుపుతో చేసిన గణపతిని పూజించవలెను. పసుపుతో చేసిన గణపతికి కుంకుమ పెట్టి తమలపాకులో ఉంచవలెను. చిన్నపళ్ళెములో బియ్యం పోసి ఆ బియ్యముపై పసుపుతో చేసిన గణపతిని తమలపాకుతో సహా ఉంచవలెను. ఆకు కొన తూర్పునకు ఉండవలెను. ఆవు నేతితో గాని, నూనెతో గాని దీపము వెలిగించి, గణపతికి నమస్కరించి ఈ విధముగా చదువ వలెను.
పార్థివ ప్రతిమా ప్రాశస్త్యము:
వినాయకుని ప్రతిమ మట్టిదే వాడవలెనా? ఏ రంగుది వాడవలెను? ఇవి అనేకుల ప్రశ్నలు. దీనికి గణేశ పురాణంలో సమాధానం కలదు.
శ్లో: పార్థివీ పూజితామూర్తి:స్థ్రియావా పురుషేణవా ఏకాదదాతి సా కామ్యం ధన పుత్రి పశూనపి
పురుషుడు గాని, స్త్రీ గాని మట్టితో చేసినగణపతి ప్రతిమను పూజ చేసినచో ధన,పుత్ర, పశ్వాది సమస్త సంపదలను పొందగలరు.
ఆ ప్రతిమ ఎట్టిమతో చేయవలెను?
“మృత్తికాం సుందరాం స్నిగ్ధాం క్షుద్ర పాషాణ వర్జితాం“
శుభ్రం అయినది. మెత్తనిది, రాళ్ళు, ఇతర మాలిన్యములు లేనిది అగు మట్టిని స్వచ్చం అయిన నీటితో తడిపి ప్రతిమచేయవలెను
శ్లో. కృత్వా చారుతరాం మూర్తిం గ ణేశస్య శుభాం స్వయం సర్వావయవ సంపూర్ణాం చతుర్భుజ విరాజితాం
నాలుగు చేతులు గల వినాయక ప్రతిమను స్వయముగ చేసుకొనవలెను. అయితే ఇది అందరికి సాధ్యం కానిది. ప్రతి పట్టణములోను అప్పటికప్పుడు మట్టిని అచ్చులో వేసి ప్రతిమను చేసి ఇచ్చు అంగళ్ళు వినాయకచవితి ముందురోజునుండే పెడుతున్నారు. అట్టి ప్రతిమ అన్నిటికన్న మంచిదని గణేశ పురాణమును బట్టి గ్రహించవలెను.
దూర్వాయుగ్మ పూజ:
వినాయకునికి అత్యంత ప్రీతికరమైనవి దూర్వలు. దూర్వలు అనగా గరిక పోచలు. గరిక అనగా గడ్డి ప్రతిచోట ఉండును. చిగురులు కల గరికపోచలు వినాయకుని పూజలో వజ్రాల కన్న, బంగారు పూవులు కన్న ఎక్కువ విలువ అయినవి. గణేశుడే స్వయంగా “మత్పూజా భక్తినిర్మితా మహతీ స్వల్పికావాపి వృధా దూర్వ్వంకురై ర్వినా“ అంటే నాకు భక్తితో చేసినపూజ గొప్పది అయినను, చిన్నది అయినను దూర్వాంకురములు లేకుండా చేసినచో అది వృధా కాగలదు.
“వినా దూర్వాంకు రై: పూజా ఫలంకేనాపి నాప్యతే
తస్మాదుషసి మద్భ త్కై రేకా వాప్యేక వింశతి:
భక్త్యా సమర్పితా దూర్వా దదాతి యత్ఫలం మహత్
నతత్క్ర్ తుశతై ర్దా నైర్వ తానుష్టాన సంచయై :“
దూర్వాంకురములు లేని పూజ వలన ఫలమేమియు కలుగదు. అందుచే నాకు భక్తులగువారు ఉష:కాలమందు ఒకటి గాని, ఇరువది ఒకటి గాని దూర్వలచే పూజింవచినచో కలుగు ఫలితము వంద యజ్ఞములవలన గాని, దానముల వలన గాని, వ్రతముల వలన గాని, తపముల వలన గాని పొందుట సాధ్యము కాదు. “దూర్వాయుగ్మమం” అంటే రెండేసి గరికపోచలు సమర్పించవలెను. ఒకటి ఒకటి విడదీయరాదు. శుభములు కలిగించునది, పుణ్యమును చేకూర్ఛునది అయిన కార్యములు చేయునపుడు ఆటకములు లేకుండ ఆ కార్యము జరుగుటకు గణాధిపతిని ముందుగ పూజించవలెను.
వినాయకచవితి రోజున చేయు వినాయకవ్రతము ప్రముఖ శుభకార్యం కనుక ముందు పసుపుతో చేసిన గణపతిని పూజించవలెను. పసుపుతో చేసిన గణపతికి కుంకుమ పెట్టి తమలపాకులో ఉంచవలెను. చిన్నపళ్ళెములో బియ్యం పోసి ఆ బియ్యముపై పసుపుతో చేసిన గణపతిని తమలపాకుతో సహా ఉంచవలెను. ఆకు కొన తూర్పునకు ఉండవలెను. ఆవు నేతితో గాని, నూనెతో గాని దీపము వెలిగించి, గణపతికి నమస్కరించి ఈ విధముగా చదువ వలెను.
శ్రీ మహాగణాధిపతయే నమ: శ్రీ గురుభ్యోనమ: హరి: ఓం
శ్లో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే.
మం. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా: పశవో వదంతి సామోమంద్రేషమూర్జంయహానాధేనుర్వాగస్మానం పసుష్టుతైతు
అయం ముహూర్త స్సుముహూర్తో అస్తు.
ఆచమనం:
పాత్ర(అనగా చిన్న చెంబు లేక గ్లాసు) తో నీరు తీసుకొని ఉద్ధరిణి లేదా చెంచాతో ఆచమనం చేయవలెను. బొటనవ్రేలి చివరను మధ్యవ్రేలి మధ్యకణుపునకు చేర్చి అరచేతిలో మినపగింజ మునిగేటంత నీటిని పోసుకుని ఆచమనం చేయవలెను.
ఓం కేశవాయ స్వాహా:
ఓం నారాయణాయ స్వాహా:
ఓం మాధవాయ స్వాహా :
(ఈ మూడు నామములు చెప్పుచూ కుడి చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను.)
ఓం గోవిందాయ నమ: (చేతిని కడుగ వలెను.)
ఓం విష్ణవే నమ: ఓం త్రివిక్రమాయ నమ: ఓం వామనాయ నమ: ఓం శ్రీధరాయ నమ: ఓం హ్రుషీకేశవాయ నమ:ఓం పద్మనాభాయ నమ: ఓం దామోదరాయ నమ:
ఓం సంకర్షణాయ నమ: ఓం వాసుదేవయ నమ: ఓం ప్రద్యుమ్నాయ నమ: ఓం పురుషోత్తమాయ నమ: ఓంఅధోక్షోజాయ నమ: ఓం అచ్యుతాయ నమ: ఓం జనార్థనాయ నమ: ఓం హరయే నమ: ఓం శ్రీ కృష్ణాయ నమ:
దైవ ప్రార్థన:
(గణపతికి నమస్కరించి ఈ క్రింది శ్లోకములు చదువ వలెను.
శ్లో: 1. యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా తయోస్సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ: యేషామిందీవరశ్శ్హ్యామో హృదయస్థో జనార్థన:
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే.
శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ: ఉమా మహేశ్వరాభ్యాం నమ: శచీ పురంధరాయ నమ: అరుంధతీ వశిష్టాభ్యాంనమ: శ్రీ సీతారామాభ్యాం నమ: సర్వేభ్యో మహాజనేభ్యో నమ:
భూతోచ్చాటన: (క్రింది విధముగా చదువుతూ అక్షతలు వెనుక వేసుకొనవలెను.)
శ్లో: ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే
తా: భూతోచ్చాటన అంటే భూతపిశాచములను పారద్రోలుట. చేయబోవు కార్యమునకు అవరోధము కలిగించు భూతపిశాచములను అచటినుండి వెడలిపొమ్మని భావము.
ప్రాణాయామము: ఓం భూ: ఓం భువ: ఓం సువ: ఓం మహ: ఓం జన: ఓం తప: ఓం సత్యం ఓంతత్సవితుర్వరేణ్యం భర్గోదేవశ్యధీమహి ధియోయోన: ప్రచోదయాత్ ఓమాపోజ్యోతి రసోమృతంబ్రహ్మభూర్భువస్సువరోం
(గృహస్థులు ఐదు వ్రేళ్ళతోను ముక్కును పట్టుకుని ఎడమరంధ్రం ద్వారా గాలిని పీల్చి, ఓం భూ: నుండి భూర్భువస్సువరోం వరకు మంత్రము చదివేంతకాలము గాలిని బంధించి తర్వాత మెల్లగా గాలిని కుడి ముక్కు రంధ్రం ద్వారావిడువ వలెను. దీనినే పూరకం, కుంభకం, రేచకం అందురు. మంత్రం చదివే సమయంలో గాలిని బంధించుటను ప్రాణాయామము అందురు. బ్రహ్మచారులు బొటన వ్రేలు, చిటికెన వ్రేళ్ళతో దీనిని చేయవలెను.)
సంకల్పము:
(ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏమి కోరి,ఏ పని చేస్తున్నారో స్పష్టముగా చెప్పుకొనుటను సంకల్పము అందురు.)
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే,కలియుగే, ప్రధమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీ శైలస్య అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ…………….నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షఋతౌ, భాద్రపదమాసే,శుక్లపక్షే, చతుర్థ్యాం ………………. వాసరే,శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం శుభతిధౌ శ్రీమాన్………… గోత్ర: ……….నామధేయ: ధర్మపత్నీ సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే.
(నీరు ముట్టుకొనవలెను.)
కలశారాధనం: (కలశం అనగా పూజ చేయుటకు నీరు తీసుకున్న పాత్ర. ఆచమనము చేయుటకు పెట్టుకున్న నీటిపాత్రను కలశారాధనకు వాడరాదు.వేరేపాత్రలో నీటిని పోసి ఆ పాత్రచుట్టూ మూడుచోట్ల గంధము, కుంకుమ, అక్షతలు అద్ది ఆనీటిలో గంధమును, పుష్పములను, అక్షతలను ఉంచితే అదే కలశము. దానిపై చేతిని ఉంచి ఈ క్రింది విధముగా చదువవలెను.
శ్లో: కలశస్య ముఖే విష్ణు: కంటే రుద్ర స్సమాశ్రిత: మూలే తత్ర స్థితోబ్రహ్మ మధ్యే మాతృ గణాస్మృతా:
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా. ఋగ్వేదోధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణ:
అంగై శ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితా: కలశే గంధ పుష్పాక్షతాన్ నిక్షిప్యహస్తే నాచ్చాద్య.
మం: ఆదల శేషుధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్ధైర్యజ్ణేషు వర్ధతే, ఆపోవా ఇదగ్ం సర్వం విశ్వాభూతా న్యాప:ప్రాణావా ఆప: పశవ ఆపోన్నమాపోమృతమాపస్సమ్రాడాపోవిరాడాపస్స్వరాడాపశ్చందాగ్ స్యాపో జ్యోతీగ్ష్యాపో యజూగ్ ష్యాప స్సత్యమాపస్సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాప ఓం.
గంగేచ యమునేకృష్ణె గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్ధం మమ దురితక్షయకారకా: కలశోదకేన దేవం, ఆత్మానం, పూజా ద్రవ్యాణి చ సంప్రోక్ష్య. (కలశములోని నీరు పుష్పముతో గణపతి పైన, పూజాద్రవ్యములపైన చల్లవలెను.
గణపతి పూజ
ప్రాణ ప్రతిష్ట
(పుష్పముతో పసుపు గణపతిని తాకుతూ ఈ క్రింది విధముగా చదువ వలెను.
ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవింకవీనాం ఉపవశ్రవస్తమం
జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్నణస్పత ఆనశృణ్వమన్ న్నోతిభి స్సీదసాధనం
అసునీతే పునరస్మాను చక్షు: పున: ప్రాణమినహనోదేహి భోగం
జ్యోక్పశ్యేమసూర్యముచ్చరంతమనుమతే మృళయాద స్స్వస్తి
అమృతంవై ప్రాణామృతమాప:ప్రాణానేవయధాస్థానముపహ్వ్యయతే.
శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నిపుత్ర పరివార సమేతం శ్రీమహాగణాధిపతింఆవాహయామిస్థాపయామి పూజయామి స్థిరో భవ, వరదోభవ, సుప్రసన్నోభవ, స్థిరాసనం కురు. గణపతిప్రాణప్రతిష్టాపన ముహూర్త స్సుముహూర్తో అస్తు.
షోడశోపచార పూజ:
(క్రింది విధముగా ఒక్కొక్క ఉపచారము చెప్పి గణపతికి అక్షతలు సమర్పించవలెను.)
శ్రీ మహాగణాధిపతయే నమ: ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి,
(క్రింది విధముగ చదువుతు కలశములోని నీరు పుష్పముతో గణపతిపై చల్లవలెను.)
శ్రీ మహాగణాధిపతయే నమ: పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వారత్మక: శ్రీ మహాగణాధిపతయో నమ: వస్త్రయుగ్మం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమ: యజ్ణోపవీతం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమ: దివ్యశ్రీ చందనం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమ: అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి
(ఏ క్రింది నామములు చదువుతూ గణపతికి పుష్పములు గాని, అక్షతలు గాని భక్తితో సమర్పింవవలెను.)
ఓం సుముఖాయ నమ: ఓం ఏకదంతాయ నమ: ఓం కపిలాయ నమ: ఓం గజకర్ణాయ నమ: ఓం లంబోదరాయ నమ: ఓం వికటాయ నమ: ఓం విఘ్నరాజాయ నమ: ఓం గణాధిపతయే నమ: ఓం ధూమకేతవే నమ: ఓం గణాధ్యక్షాయ నమ: ఓం పాలచంద్రాయ నమ: ఓం గజాననాయ నమ:
ఓం వక్రతుండాయ నమ: ఓం శూర్పకర్ణాయ నమ: ఓం హేరంబాయ నమ: ఓం స్కందపూర్వజాయ నమ: ఓం సర్వసిద్ధి ప్రదాయ నమ: ఓం మహాగణాధిపతయే నమ: షోడశ నామభి: పూజాం సమర్పయామి.
(అగరవత్తులు వెలిగించి ధూపమును చూపించవలెను.)
శ్రీ మహాగణాధిపతయే నమ: ధూపమాఘ్రాపయామి.
(దీపమునకు నమస్కరించవలెను.)
దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్దాచమనీయం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి.
(బెల్లముపై నీరు చల్లి, చుట్టూ నీరు వేసి క్రింది విధముగా చదివి నివేదనము చేయవలెను.)
ఓం భూర్భువస్సువ: తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యధీమహి ధియోయోన: ప్రచోదయాత్, సత్యంత్వర్తేన పరిషించామి.
శ్రీ మహాగణాధిపతయే నమ: అవసరార్ధం గుడోపహారం నివేదయామి అమృతమస్తు అమృతోపస్తరణమసి ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం
ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా (క్రిందివిధముగా చదివి కలశములోని నీరు వదలవలెను.) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాపోశనం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమ: తాంబూలం సమర్పయామి.
(కర్పూరం వెలిగించి గంట మ్రోగించుచూ క్రింది విధముగా చదివి హారతి యివ్వవలెను.)
శ్రీ మహాగణాధిపతయే నమ: ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి
సమ్రాజంచ విరాజంచాభి శ్రీర్యాచనోగృహే లక్ష్మీ రాష్ట్ర స్యయాముఖే తయామాసగ్ం సృజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు, శ్రీ మహాగణాధిపతయే నమ: కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ద ఆచమనీయమ్ సమర్పయామి.(పళ్ళెములో నీరు వదలి హారతి కళ్ళకు అద్దుకొనవలెను.తరువాత క్రిందివిధముగా ఉపచారములు చెబుతూ అక్షతలు సమర్పించవలెను.)
సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ప్రదక్షిణ్ నమస్కారాన్ సమర్పయామి. గణాధిపతి స్సుప్రీత స్సుప్రసన్నో వరదో బవతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. (పూజ చేసిన అక్షతలు, పుష్పములు శిరస్సున ధరించవలెను.)
శ్లో: ఆవాహనం నజానామి నజానామి విసర్జనం పూజావిధిం నజానామి క్షమస్వ గణనాయక.
ఉద్వాసన:
మం: యజ్ణేన యజ్ణ మయజంత దేవా: తాని ధర్మాణి ప్రధమాన్యాసన్, తేహనాకం మహిమానస్సచంతే,యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవా:
శ్రీ మహాగణాధిపతిం యధాస్థానముద్వాసయామి. శోభనార్ధం పునరాగమనాయచ.
(గణపతిని తమలపాకుతో తీసి పూజామందిరంలో ఈశాన్యభాగంలో ఉంచవలెను.)
(పసుపు గణపతి పూజ సమాప్తం)
హరి: ఓం తత్సత్.
శ్రీ వరసిద్ది వినాయక వ్రతకల్పము
పాలవెల్లిని పండ్లు, పుష్పములు, మామిడి ఆకులు మొదలగు వాటితో అందముగా అలంకరింవి దేవుని మందిరముపై వ్రేలాడదీసి, ఆ పాలవెల్లి క్రింద కర్ర చెక్కను గాని, పీటను గాని పసుపు పూసి, కుంకుమ, వరిపిండి మొదలగువానితో అలంకరింవిఉంచుదురు. ఆపీటపై ఒక తమలపాకును కొన తూర్పువైపు ఉండునట్లు పెట్టి దానిపై వినాయకప్రతిమను ఉంచవలెను.
శ్లో: ఓం శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే.
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ:
ఆచమనం: ఓం కేశవాయస్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా,ఓం గోవిందాయ నమ:
విష్ణో, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరే, శ్రీ కృష్ణాయ నమ:
భూతోఛ్ఛాటన:
శ్లో: ఉత్తిష్టంతు భూతవిశాచా: ఏతే భూమిభారకా: ఏతేషామవిరోధేన, బ్రహ్మకర్మ సమారధే.
ప్రాణాయామము:
మం: ఓం భూ:, ఓంభువ:, ఓగ్ం సువ:, ఓం మహ:, ఓంజన: ఓంతప:, ఓగ్ం సత్యం, ఓంతత్సవితుర్వరేణ్యం,భర్గోదేవస్య ధీమహి, ధియో యోన: ప్రచోదయాత్, ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం.
సంకల్పము:
మమ ఉపాత్తదుతితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ణయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్వంతరే, కలియుగే, ప్రధమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే,మేరోర్దక్షిణదిగ్భాగే, శ్రీ శైలస్య ఈశాన్యప్రదేశే,
గంగా గోదావర్యోర్మధ్యదేశే, శోభనగృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విజయనామ సంవత్సరే, దక్షిణాయనే, భాద్రపదమాసే, శుక్లపక్షే, చతుర్ధ్యాం ——–వాసరే,శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణ ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం శుభతిదౌ శ్రీమాన్ ——–గోత్ర:ధర్మపత్నీ సమేతస్య, అస్మాకం సహకుటుంబానాం క్షేమ,స్థైర్య,ధైర్య,విజయ,అభయ,ఆయురారోగ్య, ఐశ్వర్యాభివృద్ధ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధసిద్ధ్యర్ధం,
పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం, సకల కార్వేషు సర్వదాదిగ్వజయ సిద్ధ్యర్ధం, ఇష్టకామ్యార్ధ ఫలసిద్ధ్యర్ధం,వర్షే వర్షే ప్రయుక్త స్రీ వరసిద్ది వినాయక దేవతాముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయకదేవతాప్రీత్యర్ధం, సంభవద్భి: అంకై, సంభవద్భి:ఉపచారై:,సంభవతానియమేన, పురుషసూక్త విధానేన, కల్పోక్తప్రకారేణ, ధ్యాన ఆవాహనాది షోడచోపచార పూజాం కరిష్యే. (నీరు ముట్టుకొనవలెను.)
వరసిద్ధి వినాయక ప్రతిమాశోధనం కరిష్యే:
(వినాయక ప్రతిమను పంచామృతములచే శుద్ధి చేయవలెను. పంచామృతములు అంటే ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలిపిన నీరు. వీనిలో ఒక్కొక్క ద్రవ్యముతో ప్రతిమను శుద్ధి చేయుచూ చదువ వలసిన మంత్రములు ఇవ్వబడినవి. మంత్రము చదువుచు కొంచెము కొంచెముగా పంచామృతములు పుష్పముతో ప్రతిమపై చల్లవలెను. పంచామృతములు లభింపనిచో కొబ్బరినీటితో ప్రతిమా శోధనం చేయవచ్చును.)
పాలు: మం: ఆప్యాయస్వసమేతుతే, విశ్వత స్సోమవృష్ణియం, భవా వాజస్య సంగధే
పెరుగు: మం: దధిక్రావ్ణ్ణోఅకారిషం, జిష్ణోరశ్వస్యవాజిన:, సురభినోముఖాకరత్, ప్రణ ఆయుగ్ంషితారిషత్
నెయ్యి: మం: శుక్రమసి జ్యోతిరసి తేజోపిదేవోవస్సవితోత్పునాత్వచ్ఛిధ్రేణ వసోస్సూర్యస్య రశ్మిభి:,
తేనె: మం: మధు వతఋతాయతే, మధుక్షరంతి సింధవ: మాధ్వీర్నస్సంత్వోషధీ:, మధుసక్తముతో షసి, మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తుసూర్య:, మాధ్వీర్గావో భవంతున:
పంచదార: మం: స్వాదు: పవస్వ దివ్యాయ జన్మనే, స్వాదురింద్రాయసుహ వేతునామ్నే, స్వాదుర్మిత్రాయవరుణాయ వాయవే, బృహస్పతయే మధుమాగ్ం అదాభ్య:
ఉదకము: మం: ఆపోహిష్టామయోభువ: తానఊర్జేదధాతన, మహేరణాయ చక్షసే, యోవశ్శివతమోరస:తస్యభాజయతే హన:, ఉశతీరివ మాతర:, తస్మా అరంగ మామవ: యస్యక్షయాయ జిన్వధ, ఆపోజనయధాచన:
ప్రాణప్రతిష్ట: (పుష్పములు, అక్షతలు తీసుకొని నమస్కరించి ఈ విధముగా చదువ వలెను.)
మం: తత్పురుషాయ విద్మ్హహే మహాదేవాయ ధీమహి, తన్నో దంతి: ప్రచోదయాత్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివార సమేతం శ్రీ వరసిద్ధి వినాయక మావాహయామి స్థాపయామి పూజయామి
(పుష్పములు , అక్షతలు వినాయకునిపై ఉంచవలెను. తరువాత పుష్పమతో వినాయకువి తాకుతూ ఈ క్రింది విధముగాచదివి, ఆ పుష్పమును వినాయకుని వద్ద ఉంచవలెను.)
మం: అసునీతే పునరస్మాను చక్షు: పున: ప్రాణమిహనోధేహి భోగం, జ్యోక్పశ్యేమ సూర్య మచ్చరంత,మనుమతేమృడయాన స్స్వస్తి, అమృతం వై ప్రాణా:, అమృతమాప: ప్రాణానేవ ధాస్థానముపహ్వయతే. శ్రీవరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు.
ధ్యానం: (పుష్పములు, అక్షతలు తీసుకొని నమస్కరించి ఈ క్రింది విధముగా చదివి వినాయకునిపై ఉంచవలెను.)
శ్లో: 1. భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం, విఘ్నరాజ మహం భజే.
ఏకదంతం శూర్పకర్ణం, గజవక్త్రం చతుర్భుజం – పాశాంకుశధరం దేవం, ద్యాయేత్సిద్ధి వినాయకం.
ఉత్తమం గణనాధస్య వ్రతం సంపత్కరం శుభం – భక్తాభీష్టప్రదంతస్మాత్, ధ్యాయేత్తం విఘ్ననాయకం.
ధ్యాయేద్గజాననం దేవం, తప్తకాంచన సన్నిభం – చతుర్భుజం మహాకాయం, సర్వాభరణ భూషితం.
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: ధ్యాయామి ధ్యానం సమర్పయామి
ఆవాహనం: మం: సహస్రశీర్షా పురుష:, సహస్రాక్ష స్సహస్రపాత్,సభూమిం విశ్వతో వృత్వా, అత్యతిష్టద్దశాంగులం.
శ్లో: అత్రాగఛ్ఛ జగద్వంద్య, సుర రాజార్చితేశ్వర, అనాధ నాధసర్వజ్ఞ, గౌరీ గర్భ సముద్భవ.
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: ఆవాహయామి.
రత్నసింహాసనం: (పుష్పములు, అక్షతలు తీసుకొని నమస్కరించి ఈ విధముగా చదివి వినాయకునికి సమర్పింవవలెను.)
మం: పురుష ఏ వేదగ్ం సర్వం, యద్భూతం యచ్చభవ్యం, ఉతామృతత్వ శ్యేశాన: యదన్నే నాతి రోహతి
శ్లో: మౌక్తికై: పుష్యరాగైశ్చ, నానారత్న విరాజితం రత్నసింహసనం చారు, ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతాం.
శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: రత్నసింహాసనం సమర్పయామి.
పాద్యం:
మం: ఏతావానశ్యమహిమా, అతోజ్యాయాగ్ శ్చపూరుష: పాదోస్యవిశ్వాభూతాని, త్రిపాదస్యామృతం దివి.
శ్లో: గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక, భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన.
శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: పాదయో పాద్యం సమర్పయామి. (పుష్పముతో వినాయకుని పాదములపై నీరు చల్లవలెను.)
అర్ఘ్యం:
మం: త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుష:,పాదోస్యేహాభవాత్పున: తదోవిష్వజగ్వ్యక్రామత్, సాశనానశనే అభి
శ్లో: గౌరీపుత్ర నమస్తేస్తు, శంకరప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం, గధపుష్పాక్ష తైర్యుతం
శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: హస్తయో: అర్ఘ్యం సమర్పయామి. (నీరు విడువవలెను.)
ఆచమనీయం:
మం: తస్మా ద్విరాడజాయత, విరాజో అధిపూరుష: సజాతో అత్యరివ్యత, పశ్చాద్భూమి మధోపుర:
శ్లో: అనాధ నాధ సర్వజ్ఞ, గీర్వాణ పరిపూజిత, గృహాణాచమనందేవ, తుభ్యం దత్తంమయాప్రభో
శ్లో: శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమ: ముఖే ఆచమనీయం సమర్పయామి. ( వినాయకునిపై పుష్పముతో నీరు చల్లవలెను.)
పంచామృత స్నానం:
(క్రింది విధముగా చదువుచూ పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార నీరు పుష్పముతో వినాయకునిపై చల్లవలెను):
మం: యత్పురుషేణ హవిషా, దేవాయజ్ఞ మతన్వత
వసన్తో అస్యాసి దాజ్యం, గ్రీష్మ ఇధ్శశ్శ్రరద్ధివి:
శ్లో: 1. దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం
మధుపర్కం గ్రహణేదం గజవక్ర్త నమోస్తుతే
స్నానం పంచామృతైర్ధేవ గృహణ గణనాయక
పయోదధి ఘృతైర్యుక్తం శర్కరామధు సంయుతం
శ్రీ వరసిద్ది వినాయకస్వామినే నమ:
పంచామృత స్నానం సమర్పయామి.
శుద్దోదక స్నానం:
శ్లో: గంగాది సర్వతీర్ధేభ్య: అమృతైరమలైర్జలై:
స్నానం కురిష్య భగవాన్నమ పుత్ర నమోస్తుతే :
శ్రీ వరసిద్ది వినాయకస్వామినే నమ:
శుద్దోదక స్నానం: సమర్పయామి.( పుషముతో నీరు వినాయకుని పపై చల్లవలెను)
వస్రం:
మం: సప్తాస్యాసన్ పరిధయ: త్రిస్సప్త సమధ: క్రతా:
దేవాయద్య్హజ్ఞం తన్వానా: అబధ్యన్ పురుషపశుం
శ్లో: రక్తవస్ర్తద్వయంచారు దేవయేగ్యం చ మంగళం
శుభప్రధం గృహాణత్వం లంబోదర హరాత్మజ
శ్రీ వరసిద్ది వినాయక స్వామినే నమ: వస్ర్తయుగ్మం సమర్పయామి.( పత్తిని ఉండలుగాచేసి తడిపి పసుపు అద్ది వస్ర్తముగా సమర్పించుట ఆచారము. అట్టివి 2 వస్ర్తములు సమర్పించవలెను).
యజ్ఞోపవీతము
మం: తంయజ్ఞం బర్హిప్రౌక్షన్ పురుషం జాతమగ్రత:
తేన దేవాఅయజంత సాధాఋషయశ్చయే
శ్లొ: రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనంచోత్తరీయకం
గృహాణ సర్వధర్మజ్ఞభక్తానామిష్టదాయకం
శ్రీ వరసిద్ది వినాయక స్వామినే నమ:యజ్ఞోపవీతము సమర్పయామి ( ప్రత్తిని చేతితో కోంచెము మేర నూలువలె తీసి అక్కడ పసుపు అద్ది యజ్ఞోపవీతముగా సమర్పించవలెను).
గంధం:
మం: తస్మాద్యజ్ఞాత్సర్వహుత:సంభృతం పృషదాజ్యం
పశూగౌస్తాగౌశ్చత్రేవాయవ్యాన్, ఆరణ్యాన్ గ్రామశ్చయే
శ్లో: చందనాగరు కర్పూరకస్తూరీ కుంకుమాన్వితం
విలేపనం సుర శ్రేష్ట ప్రీత్యర్దం ప్రతిగుహ్యతం
శ్రీ వరసిద్దివినాయక స్వామినే నమ: దివ్యశ్రీ చందనం సమర్పయామి.( వినాయకునికి గంధము ఉంగరపు వ్రేలితో సమర్పించవలెను.)
ఆభరణం:
మం: తస్మాద్యజ్ఞాత్సర్వహుత: ఋచస్సామానీజిజ్ఞిరే
ఛందాగం సి జిజ్ఞిరేతస్సాత్ యజుస్తస్మాదజాయతే
శ్లో: అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్
శుభాన్, గృహాణ పరమానంద ఈశుపుత్రనమోస్తుతే
శ్రీ వరసిద్దివినాయక స్వామినే నమ: అలంకరణార్దాం అక్షతాన్ సమర్పయామి. (అలంకరణార్దాం అక్షతలు సమర్పింపవలెను)
పుష్పాణి:
మం: తస్మాదశ్వాఅజాయంత ఏక్ చోభయాదత:
గావోహా జిజ్ఞిరే తస్మాత్, తస్మాజ్జాతా అజావయ:
శ్లో: సుగంధాణి సుపుస్పాణిజాజీకుందముఖానిచ
ఏకవింశతి పత్రాణిసంగృహాణ నమోస్తుతే
శ్రీ వరసిద్దివినాయక స్వామినే నమ: పుష్పాణి పూజయామి ( వినాయకునికి పుష్పములు సమర్పింపవలెను)
అధాంగపూజ: (ఇక్కడ వినాయకుని ప్రతి అంగమును పుష్పములచే పూజించవలెను.)
ఓం గణేశాయనమ: పాదౌ పూజయామి.(పాదములు)
ఓం ఏకదంతాయనమ: గుల్ఫౌ పూజయామి. (చీలమండలు)
ఓం శూర్పకర్ణాయనమ: జానునీ పూజయామి. (మోకాళ్ళు)
ఓం విఘ్నరాజాయనమ: జంఘే పూజయామి. (పిక్కలు)
ఓం అఖువాహనాయనమ: ఊరూ పూజయామి. (తొడలు)
ఓం హేరంబాయనమ: కటిం పూజయామి. (మొల)
ఓం లంబోదరాయనమ: ఉదరం పూజయామి. (కడుపు)
ఓం గణనాధాయనమ: నాభిం పూజయామి. (బొడ్డు)
ఓం గణేశాయనమ: హృదయం పూజయామి. (వక్షము)
ఓం స్థూలకంటాయనమ: కంటం పూజయామి.(కంటం)
ఓం స్కందాగ్రజాయనమ: స్కందౌ పూజయామి.(భుజములు)
ఓం పాశహస్తాయనమ: హస్తౌ పూజయామి.(చేతులు)
ఓం గజవక్త్రాయనమ: వక్త్రం పూజయామి.(నోరు)
ఓం విఘ్నహంత్రేనమ: నేత్రం పూజయామి. (కండ్లు)
ఓం శూర్పకర్ణాయనమ: కర్ణౌ పూజయామి. (చెవులు)
ఓం ఫాలచంద్రాయనమ: లలాటం పూజయామి. (నుదురు)
ఓం సర్వేశ్వరాయనమ: శిర: పూజయామి. (శిరస్సు)
ఓం విఘ్నరాజాయనమ: సర్వాంగాని పూజయామి.
ఏకవింశతి పూజ: (వినాయకుని 21 రకముల పత్రములచే (ఆకులచే) పూజింపవలెను. సంస్కృతపదము పక్కనే ఆపత్రము యొక్క తెలుగు పేరు కూడ యివ్వడమైనది.
ఇందులో కొన్ని పత్రములు సాధారణంగా పూజకు వాడనివి. కాని వినాయకచవితి రోజున అవి వాడుటకు అనుమతించబడియున్నది.)
ఓం సుముఖాయనమ: మాచీపత్రం సమర్పయామి (మాచి పత్రి)
ఓం గణాధిపాయ నమ: బృహతీ పత్రం సమర్పయామి (వాకుడు)
ఓం ఉమా పుత్రాయ నమ: బిల్వపత్రం సమర్పయామి (మారేడు)
ఓం గజాననాయనమ: దూర్వాయుగ్మం సమర్పయామి (రెండు గరికలు)
ఓం హరసూనవే నమ: దత్తూర పత్రం సమర్పయామి (ఉమ్మెత్త)
ఓం లంబోదరాయ నమ: బదరీ పత్రం సమర్పయామి (రేగు)
ఓం గుహాగ్రజాయనమ: అపామార్గ పత్రం సమర్పయామి (ఉత్తరేణి)
ఓం గజకర్ణాయనమ: తులసీ పత్రం సమర్పయామి (తులసి)
ఓం ఏకదంతాయనమ: చూతపత్రం సమర్పయామి (మామిడి)
ఓం వికటాయనమ: కరవీర పత్రం సమర్పయామి (గన్నేరు)
ఓం భిన్నదంతాయనమ: విష్ణుక్రాంత పత్రం సమర్పయామి (విష్ణుక్రాంతి)
ఓం వటవే నమ: దాడిమీ పత్రం సమర్పయామి (దానిమ్మ)
ఓం సర్వేశ్వరాయ నమ: దేవదారు పత్రం సమర్పయామి (దేవదారు)
ఓం ఫాలచంద్రాయ నమ: మరువక పత్రం సమర్పయామి (మరువం)
ఓం హేరంబాయ నమ: సింధువార పత్రం సమర్పయామి (వావిలి)
ఓంశూర్పకర్ణాయనమ: జాజీపత్రం సమర్పయామి (జాజి)
ఓం సురాగ్రజాయనమ: గండకీ పత్రం సమర్పయామి (ఏనుగుచెవి ఆకు)
ఓం ఇభవక్త్రాయ నమ: శమీ పత్రం సమర్పయామి (జమ్మి)
ఓంవినాయకాయ నమ: అశ్వత్థ పత్రం సమర్పయామి (రావి)
ఓం సురసేవితాయ నమ: అర్జున పత్రం సమర్పయామి (మద్ది)
ఓం కపిలాయ నమ: అర్క పత్రం సమర్పయామి (జిల్లేడు)
శ్రీ గణేశ్వరాయ నమ: ఏక వింశతి పత్రాణి పూజయామి
శ్రీ విఘ్నేశ్వర అష్టోతర శతనామావళి :
ఓం వినాయకాయ నమ: ఓం గ్రహపతయే నమ : ఓం అగ్రగణ్యాయ నమ:
ఓం విఘ్నరాజాయ నమ : ఓం కామొనే నమ: ఓం గ్రామణ్యై నమ:
ఓం గౌరీపుత్రాయ నమ : ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమ: ఓం గణపాయనమ:
ఓం గణేశ్వరాయ నమ: ఓం పాశాంకుశధరాయ నమ: ఓం స్దిరాయ నమ:
ఓం స్కందాగ్రజాయ నమ: ఓం చండాయ నమ: ఓం వృద్ధిదాయ నమ:
ఓం అవ్యయాయ నమ: ఓం గుణాతీతాయ నమ: ఓం సుభగాయ నమ:
ఓం పూతాయ నమ: ఓం నిరంజానాయ నమ: ఓం శూరయ నమ:
ఓం దక్షాధక్షాయ నమ: ఓం అకల్మషాయ నమ: ఓం వాగీశాయ నమ:
ఓం ద్విజప్రియాయ నమ: ఓం స్వయంసిద్దాయ నమ: ఓం సిద్ధిదాయ నమ:
ఓం అగ్నిగర్వభిదే నమ: ఓం సిద్దార్చితవదాంబుజాయ నమ: ఓం దూర్వాబిల్వప్రియాయ నమ్:
ఓం ఇంద్రశ్రీప్రదాయ నమ: ఓం బీజాపూరకాయ నమ: ఓం కాంతాయ నమ:
ఓం వాళబలప్రియాయ నమ: ఓం అవ్యక్తాయ నమ: ఓం పాపహారిణేనమ:
ఓం సర్వసిద్దప్రదాయకాయ నమ: ఓం వరదాయ నమ: ఓం కృతామాయ నమ:
ఓం శర్వతనయాయ నమ: ఓం శాశ్వతాయ నమ: : ఓం సమహితాయ నమ:
ఓం శర్వప్రియాయ నమ: ఓం కృతినే నమ: ఓం వకృతుండాయ నమ:
ఓం సర్వాత్మకాయ నమ: ఓం విద్వత్రియాయ నమ: ఓం శ్రీప్రదాయ నమ:
ఓం సృష్టికర్ర్తేనమ: ఓం వీతభయాయ నమ: ఓం సౌమ్యాయ నమ:
ఓం దేవానీకార్చితాయ నమ: ఓం గణనే నమ: ఓం భక్తకాంక్షితాదాయినే నమ:
ఓం శివాయ నమ : ఓం చక్రిణే నమ: ఓం అచ్యుతాయ నమ:
ఓం శుద్దాయ నమ: ఓం ఇక్షుచాపభ్రతే నమ: ఓం కేవలాయ నమ:
ఓం బుద్దిప్రియాయ నమ: ఓం అబ్జోత్పలకరాయ నమ: ఓం సిద్దాయ నమ:
ఓం శాంతాయ నమ: ఓం శ్రీశాయ నమ: ఓం జ్ఞానినే నమ:
ఓం బ్రహ్మచారిణే నమ: ఓం శ్రీపతయే నమ: ఓం మాయాయుక్తాయ నమ:
ఓం గజాననాయ నమ: ఓం స్తుతిహర్షితాయ నమ: ఓం కాంతాయ నమ:
ఓం ద్త్వెమాతురాయ నమ: ఓం కులాద్రిభృతే నమ: ఓం బ్రహ్మిష్ఠాయ నమ:
ఓం మునిస్తుత్యాయ నమ: ఓం జటినే నమ: ఓం భయవర్జితాయ నమ:
ఓం భక్తవిఘ్నవినాశినే నమ: ఓం చంద్రచూడాయ నమ: ఓం ప్రమత్తదైత్యభయాయ నమ:
ఓం ఏకదంతాయ నమ: ఓం అమరేశ్వరాయ నమ: ఓం వ్యక్తమూర్తయే నమ: 100
ఓం చతుర్బాహవే నమ: ఓం నాగయజ్ణోపవీతినే నమ: ఓం అమూర్తకాయ నమ:
ఓం శక్తిసంయుతాయ నమ: ఓం శ్రీకంఠాయ నమ: ఓం పార్వతీశంకరోత్చంగఖేల నమ:
ఓం చతురాయి నమ: ఓం వ్రతినే నమ: ఓం నోత్చవలాలనాయ నమ:
ఓం లంబోదరాయ నమ: ఓం మూలకంఠాయ నమ: ఓం సమస్త జగదాధారయ నమ:
ఓం శూర్పకర్ణాయ నమ: ఓం త్రయికర్ర్తే నమ: ఓం వరమూషకవాహనాయ నమ:
ఓం హేరంబాయ నమ: ఓం సామఘెషప్రియాయ నమ: ఓం హృష్టస్తుతాయ నమ:
ఓం బహ్మవత్తమాయ నమ: ఓం పురుషోత్తమాయ నమ: ఓం సర్వ సిద్ది ప్రదాయ కాయ నమ:
ఓం కాలయ నమ: ఓం స్ధూలతుండాయ నమ: ఓం సిద్దలక్ష్మి గణపతయే నమ:

దూర్వాయుగ్మ పూజ: (21గరికపోచలతో ఈపూజ చేయవలెను. క్రింది పది నామములు చదువుతూ ప్రతి నామమునకు “దూర్వాయుగ్మం” అనగా రెండేసి గరికపోచలు సమర్పించవలెను.)
ఓం గణాధిపాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం ఉమాపుత్రాయనమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం అఘనాశనాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం వినాయకాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం ఈశపుత్రాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం సర్వసిద్ధిప్రదాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
7.ఓం ఏకదంతాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం ఇభవక్త్రాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం మూషక వాహనాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
10.ఓం కుమారగురవే నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ధూపం: మం: యత్పురుషం వ్యదధు: కతిధావ్యకల్పయన్, ముఖం కిమస్య కౌబాహూ, కావూరూ పాదా ఉచ్యేతే
శ్లో: 1. వనస్పతిరసై ర్దివ్యై ర్నానాగన్ధై స్సుసంయుతమ్- ఆఘ్రేయస్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం – ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ
శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: ధూపమాఘ్రాపయామి.(అగరవత్తులు వెలిగించి వినాయకునికి ధూపముచూపించవలెను.)
దీపం:
మం: బ్రాహ్మణోస్య ముఖమాసీత్, బాహూరాజన్య: కృత: ఊరూతదస్య యద్వైశ్య: పద్భ్యాగ్ం శూద్రో అజాయత
శ్లో: సాజ్యం త్రివర్తి సంయుక్తంవహ్ని నాయోజితం ప్రియం, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: దీపం దర్శయామి(దీపమునకు నమస్కరించి వినావకునికు చూపించవలెను.)
ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.(నీరువదలవలెను.)
నైవేద్యం:
మం: చంద్రమా మనసోజాత: చక్షోస్సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ పాణాద్వాయురజాయత
శ్లో: 1. సుగన్ధా స్సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాందేవ చణముద్గై: ప్రకల్పితాన్
భక్ష్యం భోజ్యంచ లేహ్యంచ చోష్యం పానీయమేవచ ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక.
(ఒక పళ్ళెములో పళ్ళు, పాలు, నీళ్ళతో పాటు చేసిన పిండి వంటలు, వంటలు కొంచెంకొంచెము ఉంచి, నీళ్ళు చల్లుతూ తర్వాత పళ్ళెము చుట్టూ నీరు త్రిప్పుచూ వినాయకునికి నైవేద్యం చూపించవలెను.)
ఓం భూర్భువస్సువ: ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య దీమహి ధియో యోన: ప్రచోదయాత్ సత్యంత్వర్తేనపరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి.
శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: కల్పోక్త నైవేద్యం సమర్పయామి.
ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయస్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయస్వాహా మధ్యేమధ్యే పానీయం సమర్పయామి
అమృతాపి ధానమసి, ఉత్తరాపోశనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధఆచమనీయం సమర్పయామి.
(3సార్లు కొంచెం కొంచెం నీరు వదలవలెను.)
తాంబూలం:
మం: నాభ్యా ఆసీదన్తరిక్షమ్ శీర్ష్ణో ద్యౌస్సమవర్తత పద్భ్యాగ్ం భూమిర్దిశశ్రోత్రాత్ తధాలోకాగ్ం అకల్పయన్
శ్లో: పూగీ ఫలైస్స కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
(5తమలపాకులు, 2వక్కలు వినాయకుని వద్ద ఉంచి నమస్కరించవలెను.)
రాజనం: (కర్పూరం వెలిగించి ఈ క్రింది విధముగా చదువుతూ గంటమ్రోగించవలెను.)
మం: వేదాహమేతం పురుషం మహాంతం, ఆదిత్యవర్ణం తమసస్తుపారే, సర్వాణి రూపాణి విచిత్య ధీర: నామానికృత్వా అభివదన్ యదాస్తే
సమ్రాజంచ విరాజంచాభి శ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్ర స్యయాముఖే, తయామాసగ్ం సృజామ: సంతతశ్రీరస్త్రు,సమస్త సన్మంగళాని భవంతు
నిత్య శ్రీరస్త్రు నిత్యమంగళానిభవంతు
శ్లో: ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తధా నీరాజనం మయాదత్త గృహాణ వరదోభవ
శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: కర్పూర నీరాజనం సమర్పయామి.
(పళ్ళెములో నీరు వదలవలెను.)
మంత్రపుష్పం (చేతిలో పువ్వులు, అక్షతలు తీసుకుని క్రింది విధముగా చదువుతూ నమస్కరించవలెను.)
మం: ధాతా పురస్తాద్యముదాజహార, శక్ర:ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్ర: తమేవం విద్వానమృత ఇహ భవతి, నాన్య:పంధా అయనాయ విద్యతే ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం వశ్వశంభువం
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: వేదోక్త సువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయామి. (అక్షతలు, పుష్పములు వినాయకుని పాదములపై ఉంచవలెను.)
పునరర్ఘ్యం:
శ్లో: అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్ద్గం పాపనాశన.
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: పునరర్ఘ్యం సమర్పయామి. (నీరు వదలవలెను.)
ఆత్మప్రదక్షిణ:
(అక్షతలు, పువ్వులు తీసుకుని కుడిచేతిమీదుగా తమచుట్టూ తాము తిరుగుతూ ఈక్రింది విధముగా చదువవలెను)
శ్లో: 1. యానికానిచపాపాని జన్మాంతర కృతానిచ, తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపాహం పాప కర్మాణా పాపాత్మా పాప సంభవ:
3.అన్యధశరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష వినాయక.
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. (అక్షతలు, పువ్వులు వినాయకుని పాదముల చెంత ఉంచవలెను.)
సాష్టాంగం:
మం: ఉరసా శిరసా దృష్ట్యామనసా వచసాతధా పద్భ్యా కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే.
శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: సాష్టాంగ నమస్కారం సమర్పయామి.
(సాష్టాంగ నమస్కారం అనగా ఎనిమిది అంగములతో చేయు నమస్కారము. అనగా 1.వక్షము 2.శిరస్సు 3. కండ్లు 4. మనస్సు5. వాక్కు 6. పాదములు
చేతులు 8. చెవులు. పురుషులు మాత్రమే పూర్తిగా సాగిలపడిచేయవలను.)
రాజోపచారములు: ఛత్రం సమర్పయామి, చామరంవీచయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, దర్పణందర్శయామి,అశ్వానారోహయామి,గజానారోహయామి, రధానారోహయామి,ఆందోళికాది సమస్త రాజోపచార,భక్త్యోపచార, శక్త్యోపచార పూజాన్ మనసా సమర్పయామి. (పుష్పములను సమర్పించవలెను.)
శ్లో: 1. యస్య స్మృత్యాచ నమోక్త్యా తప: పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే వివాయక.
మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం వినాయక యత్పూజితం మయాదేవపరిపూర్ణం తదస్తుతే.
అనయా ధ్యాన ఆవాహనాది షోడచోపచార పూజయాంచ,భగవాన్ సర్వాత్మక శ్రీ వరసిద్ధి వినాయక దేవతాసుప్రీతస్సుప్రసన్నో వరదో భవతు.
అపరాధ క్షమార్పణ:
శ్లో: 1. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయాదాసోయమితి మాంమత్వాక్షమస్వ పరమేశ్వర.
ఆవాహనం నజానామి నజానామి విసర్జనం పూజావిధిం నజానామి క్షమస్వ పరమేశ్వర సర్వాపరాధాన్క్షమధ్వం
శ్రీ వరసిద్ధి వినాయక దేవతాప్రసాదం శిరసా గృహ్ణామి.(పూజ చేసిన పుష్పములు, అక్షతలు తీసుకొని శిరస్సున ధరించవలెను.)
వ్రతం సువ్రతమస్తు
శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ప్రసాదేన సర్వకార్యేషు సర్వదా దిగ్విజయమస్తు.
ఉద్వాసన మంత్రం: (వినాయక ప్రతిమ ఉంచిన పీటను చేతితో పట్టుకొని క్రింది మంత్రము చదువ వలెను.)
మం: యజ్ఞేన యజ్ఞ మయజంతదేవా తాని ధర్మాణి ప్రధమాన్యాసన్ తేహనాకం మహినానస్సచన్తే యత్రపూర్వేసాధ్యాస్సంతి దేవా: శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: యధాస్థానముద్వాసయామి.
హరి: ఓం తత్సత్
బ్రహ్మార్పణమస్తు
(ఇంతటితో వినాయకుని పూజావిధానము పూర్తి అయినది.)
శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకధ:
(అక్షతలు చేతిలో తీసుకొని కధ చదువవలెను.)
శూతుడు అను ఋషి శౌనకాది మునులకు వరసిద్ధివినాయక వ్రతమును గురించి చెప్పెను.
వినాయకుడు అనగా దుష్టులను, విఘ్నములను అదుపులో పెట్టువాడు అని అర్ధము. ఇతడు విద్యాధిదైవతము గాను, వ్రాయుట అను పద్ధతిని ఆరంభించిని దైవము గాను పూజింపబడు చున్నాడు.
విఘ్నేశ్వరుని పుట్టుక:
పూర్వం గజముఖుడైన అసురుడు పరమేశ్వరుని మెప్పించి కోరరాని వరముకోరి, తను అజేయుడుగా, ఎవరూ వధింపరాని విధంగా ఉండుటకై పరమశివుని తన ఉదరమునందు నివసించాలని వరము పొందినాడు. అది విన్న పార్వతీదేవి కలతచెంది శ్రీ మహావిష్ణువును ప్రార్ధింపగా,నందీశ్వరుని గంగిరెద్దుగా, తాను గందిరెద్దును ఆడించేవానిగా వేషము ధరించి,గంగిరెద్దును గజాసురుని ఎదుట చిత్రవిచిత్రముగా ఆడించి ఆ అసురుని మెప్పించి, ఆఅసురుని ఉదరకుహరమందున్న పరమశివుని కోరినాడు. అంత విష్ణుమాయను గ్రహించి,తనకు చేటుకాలము దాపురించిందని తలచి, శివుని ఉద్దేశించి, గజాసురుడు ” ప్రభూ! శ్రీ హరి ప్రభావముచే నాజీవితకాలము ముగియనున్నది. నా అనంతరం నా శిరస్సు త్రిలోకములు పూజించునట్లు, నాచర్మమును నిరంతరము నీవు ధరించునట్లు వరము నిమ్మని తన శరీరమును నందీశ్వరునకు వశము చేసి శివునకు తన ఉదరకుహరమునుండి విముక్తిని ప్రసాదించినాడు. చాలాకాలమునకు శివుడు తిరిగి కైలాసమునకు వచ్చుచున్నాడన్న శుభవార్త తెలిసిన పార్వతీదేవి సర్వాలంకారభూషితురాలై భర్తను స్వాగతింపదలచి, అభ్యంగనస్నాన
మాచరించుటకుసిద్ధమై, నలుగుపిండితో ఒక బాలునిబొమ్మను చేసి, దానికి ప్రాణప్రతిష్ట చేసి,లోపలికి ఎవరూ రాకుండా వాకిలి వద్ద కాపలా ఉంచెనుఅంత సంతోషముతో పార్వతి చెంత చేరాలని వస్తున్న పరమేశ్వరుని గాంచిన ఆ బాలుడు అభ్యంతరమందిరమందు నిలువరించగా, పరమేశ్వరుడు ఆగ్రహము పట్టలేక ఆ బాలుని శిరమును ఖండించి మందిరము లోనికి ఏగినాడు. మాటలసందర్భంలో బాలుని ప్రసక్తి రాగా జరిగిన ఘోరముతెలుసుకొన్న పార్వతీదేవిని శివుడు ఓదార్చి, ఉత్తరదిశగా తలపెట్టి నిద్రించుచున్న ప్రాణి తలను తెచ్చి ఆ కుర్రవాని మొండెమునకు అతికింపుమని తన పరివారమునకు ఆదేశించెను. వారు ఉత్తరముగా పరుండిన ఒక ఏనుగు తలను తిచ్చి ఆబాలుని మొండెమునకు
అతికించిరి. అప్పుడు శివుడు ప్ర్రాణప్రతిష్ట చేయగా ఆబాలుడు గజాననుడైనాడు. గజాననుడు తల్లిదండ్రులకు భక్తితో సేవించుచుండెను. ఇతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను ఒక మూషికమును వాహనముగా చేసికొనెను. కొంతకాలమునకు పార్వతిపరమేశ్వరులకు కుమారస్వామి జనియించెను. అంత మహేశ్వరుడు కుమారులతో “ఇరువురిలో ఎవరు ముల్లోకములందలి
పుణ్యతీర్ధములందు స్నానమాచరించి ముందుగా తనను చేరుదురో వారికి ఆధిపత్యము యిత్తుననెను. వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనమునధిరోహించి, వాయువేగమున బయలువెడలెను. గుజ్జురూపమున నున్న గజాననుడు తన మూషకవాహనంపై తండ్రి పెట్టిన పోటి నెగ్గడం అసాధ్యమని గ్రహించి, కాస్త ఆలోచించి, ఈ పోటీ తన గురించి పెట్టినట్లు గ్రహించి, గజాననుడు భక్తితో ముమ్మారు తల్లిదండ్రులకు,ప్రదక్షిణ నమస్కారాలాచరించి ప్రణమిల్లాడు. అక్కడ కుమారస్వామి ఏ తీర్ధమునకు పోయిననూ అన్నగారు తనకన్న ముందు ఉండటం చూసి, ఆశ్చ్రర్యమునొంది, కైలాసమునకు చేరగానే తల్లిదండ్రులకు ప్రణమిల్లుతున్న అన్నగారిని చూసి, జరిగినది తెలుసుకొని, తన అహంకారమును నిందించుకొని, తండ్రితో అన్నయ్యకే గణాధిపత్యమును ఒసంగమనెను. మహేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి తిధియందు గజాననునకు విఘ్నాధిపత్యమునొసంగెను. ఆ దినమున గజాననుడు సర్వజనులు భక్తిశ్రద్ధలతో చేసినపూజను గ్రహించి, కుడుములు, ఉండ్రాళ్ళు ,పళ్ళు మొదలుగా గల ఎన్నో రకాలు నైవేద్యాలను ఆరగించి, కైలాసమునకేగి, తల్లితండ్రులకు పాదాభివందనం చేయడానికి ఎంతో కష్ట పడుతున్న వినాయకుని చూసి పరమశివుని శిరమునందలి చంద్రుడు వికటముగానవ్వెను. అంత రాజదృష్టి శోకిన రాళ్ళు కూడ నుగ్గవునను సామెత ననుసరించి, విఘ్నేశ్వరుని ఉదరము పగిలి కుడుములచట ఎల్లెడల ద్రొల్లెను. అంత పార్వతీ దేవి శోకించుచు చంద్రుని చూచి, ” పాపాత్మా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను. కావున నిన్ను చూచినవారు నీలాపనిందలు పొందుదురుగాక.” అని శపించెను. ఆ సమయమును సప్తమహర్షులు యజ్ఞము చేయుచు తమభార్యలతో అగ్నికి ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయమున క్షీణించుచుండ అంతస్వాహాదేవి అరుంధతిరూపము తప్ప తక్కిన ఋషిపత్నుల రూపములను తానే ధరించి, భర్తకు ప్రియమును కలుగచేసెను. అయితే ఋషులు అగ్ని దేవునితో ఉన్నది తమ భార్యలేనని భావించి, వారిని పరిత్యజించినారు. పార్వతీదేవి శాపానంతరము చంద్రుని చూచుటవల్లే తమకిట్టి నీలాపనిందలు కలిగెనని గ్రహించి, వారు బ్రహ్మదేవుని కడకేగి, జరిగినది విన్నవించి ప్రార్ధింపగా బ్రహ్మదేవుడు ఋషులతో వారి పత్నుల తప్పు ఏమియు లేదని తెలిపి, వారితో కూడ బ్రహ్మ కైలాసమునకు ఏతెంచి, ఉమామహేశ్వరులను సేవించి, మృతుడై ఉన్న వినాయకుని బ్రతికించెను. అంత దేవాదులు,” పార్వతీ దేవి! నీవిచ్చిన శాపవశమును లోకములకెల్ల కీడు వాటిల్లెను. కావున దానిని ఉపసంహరింపమని ప్ర్రార్ధింప అంత పార్వతీ దేవి , “ఏనాడు వినాయకుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ దినము చంద్రుని చూడరాదు.” అని శాపావకాశము నొసెంగెను. అంత వారందరు వారి గృహమలకేగి భాద్రపద శుద్ధచవితి నాడు చంద్రుని చూడక జాగరూకతతో సుఖముగా నుండిరి.ఇట్లు కొంత కాలము గడిచెను. అందువల్ల అతడు గణపతి అయ్యొను. అటులనే విఘ్నములకు కూడా ఆధిపత్యము ఒసగుటవలను విఘ్నేశ్వరుడైనాడు. ఈ ఆధిపత్యములు స్వీకరించిన రోజు,తాను జన్మించినరోజు భాద్రపద శుద్ధ చవితి కనుక ఆరోజు ముల్లోకములలోని వారు వినాయకుని పూజించి తమతమ అభీష్టములు పొందెదరు. శ్యమంతకోపాఖ్యానము: ద్వాపరయుగమున శ్రీకృష్ణపరమాత్ముని నారదుడుదర్శించి స్తుతించుచు ప్రియసంభాషణ జరుపుచు, ” స్వామీ! సాయంసమయమాయెను. ఈనాడు విఘ్నేశ్వర చతుర్ధి గాన పార్వతీశాపముచే చంద్రుని చూడరాదు. కాన సెలవివ్వవలసింది.” అని నారదుడు వెడలగానే ద్వారకయందు ఆనాటి రాత్రి చంద్రుని చూడరాదు. అనిచాటింపు వేయించెను. ఆనాటి రాత్రి క్షీరప్రియుడగుటచే శ్రీకృష్ణుడు మింటికి చూడకనే గోష్టమునకు పోయి పాలుపిదుకుచు పాలలో చంద్ర ప్రతిబింబము గాంచి, “ఆహా! నాకిక ఎట్టి ఆపద రానున్నదో” అని సంశయించెను.
వృష్ణి వంశీయుడగు నిమ్నుడను వానికి ప్రసేనుడు, సత్రాజిత్తు అను యిరువురు కొడుకులు ఉండెడివారు. సత్రాజిత్తు సూర్యదేవుని ఆరాధించి,సూర్యుని మెప్పించి,అత్యంత ప్రకాశవంతమైన రోజుకి ఎనిమిది బారువుల బంగారము నిచ్చునట్టి శ్యమంతకమణి అను ఒక దివ్యమైన మణిని వరంగా పొందెను.ఆ మణిని తీసుకుని శ్రీకృష్ణదర్శనార్ధము ద్వారకకు విచ్చేసిన సత్రాజిత్తు ద్వారా మణి మహిమను తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఆ మణిని ద్వారకను పాలిస్తున్న ఉగ్రసేన మహారాజుకు కానుకగా యిమ్మనెను. సత్రాజిత్తు అందుకు నిరాకరించెను. కొంతకాలమునకు ప్రసేనుడు అశుచిగా ఉండి మణిని ధరించి వేటకు వెడలెను.మహామహిమాన్వితమైన ఆమణిని శుచి కాని వారు ధరించినచో వారికి అపాయము వాటిల్లగలదు. ఒక సింహము అది ఒక మాంసఖండముని భ్రమసి ప్రసేనుని చంపి ఆ మణిని గ్రహింపగా జాంబవంతుడను భల్లూకరాజు సింహమును చంపి మణిని తీసుకొనిపోయి తన కుమార్తె అయిన జాంబవతికి ఆటవస్తువుగా యిచ్చెను. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మరణవార్త విని, “శ్రీకృష్ణుడు మణినీయనందులకు తనసోదరుని చంపి మణిని అపహరించెను”. అని చాటించెను. అది విని శ్రీకృష్ణుడు నాడు క్షీరమున చంద్రబింబ దర్శనదోషంబని తలచి దానిని నివారించుకొనుటకు తనపరివారముతో అరణ్యమునకు బయలుదేరి ప్రసేనుని జాడలు, అతనిని చంపిన సింహపు జాడలు,జాంబవంతుని అడుగుల జాడలు అనుసరించి జాంబవంతుని గుహకు చేరి మణిని తీయునంతలో జాంబవంతుడు వచ్చి కృష్ణునితో యుద్ధమునకు తలపడెను. యుద్ధము అతిభయంకరముగా ఇరువది ఎనిమిది రోజులు సాగెను. మహాపరాక్రమవంతుడగు జాంబవంతుడు తన బలము క్షీణించుట గ్రహించి శ్రీకృష్ణుని సాక్షాత్తు విష్ణువుగా గుర్తించి శరణుజొచ్చి శమంతకమణిని, తనకుమార్తె అగు జాంబవతిని శ్రీకృష్ణునికి సమర్పించెను. కృష్ణుడు ద్వారకకు చేరి ఆ మణిని సత్రాజిత్తుకు అందజేసి జరిగినదంతయు వివరించెను. సత్రాజిత్తు తను ప్రచారము చేసిన అపవాదుకు సిగ్గుపడి తన కుమార్తె అగు సత్యభామను కృష్ణునకు సమర్పించెను. జాంబవతి, సత్యభామలను పరిణయమాడుతున్న శ్రీకృష్ణుని మునులు, దేవాదులు భక్తిప్రపత్తుల స్తుతించి, శ్రీకృష్ణునితో, ” మీరు సమర్ధులు గాన నీలాపనిందలు బాపుకొంటిరి. మాకేమి గతి ” అని ప్రార్ధింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చవితి నాడు పొరపాటున చంద్ర దర్శనమయిన యెడల ఆనాడు గణపతిని యధావిధిని పూజించి ఈ శ్యమంతకమణి కధను విని అక్షతలు శిరమున దాల్చు వారు నీలాపనిందల నొందకుందురు గాక.” అని ఆనతీయ దేవాదులు సంతసించి తమనివాసములకు పోయి ప్రతి సంవత్సరము అందరు తమ తమ శక్త్యానుసారము భాద్రపద శుద్ధ్హ్హ్హ చవితి నాడు గణపతిని పూజించి అభీష్టసిద్ధిగాంచుచు సుఖముగా నుండిరి. శాపమోక్షప్రకారము వినాయక వ్రతకధను సూతుడు శౌనకాదిమునులకు వినిపించి తన నిజాశ్రమమునకరిగెను.
వినాయక వ్రత మహిమ:
ఈవ్రతమును అన్నికులములవారు, స్త్రీపురుషులెల్లరూ చేయవచ్చును. భక్తిశ్రద్ధలతో చేసినచో వినాయకుడు వారివారి ప్రయత్నములను సఫలమొనర్చి, విజయము చేకూర్చును. ఈ వ్రతమును చేసి పూర్వము ధర్మరాజాదులు రాజ్యమును,దమయంతి నలుని పొందిరి. వృత్రాసురుని చంపినపుడు ఇంద్రుడు, సీతను వెదకునపుడు శ్రీరాముడు, గంగను భువికి తెచ్చునపుడు భగీరధుడు, క్షీర సాగర మధనము చేయనపుడు దేవాసురులు, కుష్టు వ్యాధి నివారణకై సోమదేవ మహారాజు ఈ వ్రతము చేసి తమ ప్రయత్నములో అఖండ విజయమును పొందిరి. అటులనే ఏదేని బృహత్కార్యము తలపెట్టినపుడు వరసిద్ధి వినాయక వ్రతమొనరించి కార్యోన్ముఖులైనచో తప్పక విజయము సాధింతురు. వినాయక
చవితి రోజున చంద్రదర్శనదోషమును పోగొట్టుకొనుటకు ఈ క్రింది శ్లోకము జపించవలెనని ధర్మసింధువునకు ఆదేశము కలదు.
శ్లో: సింహ: ప్రసేనమవధీత్ సింహా జాంబవతాహతా: సుకుమారక మారోధీ: తవహ్యేష శమంతక:
శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకధ సమాప్తము.
స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిం మహీశా: గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం లోకా స్సమస్తా స్సుఖినో భవంతు.
మంగళం మహత్..!!