Saturday, 19 August 2017

హనుమంతుని జండా ఇంటి పై ఎందుకు ఉంచాలి......

మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్ |
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ||
అంజనా నందనం వీరం! జానకీ శోకనాశనం
కపీశ మక్షహంతారం! వందే లంకా భయంకరం
గోష్పదీ కృత వారాశిం! మశకీకృత రాక్షసం
రామాయణ మహామాలా రత్నం! వందే అనిలాత్మజం!
యత్ర యత్ర రఘునాధ కీర్తనం,
తత్ర తత్ర కృతమస్తకాంజలిం!
భాష్పవారి పరిపూర్ణలోచనం,
మారుతిం నమత రాక్షసాంతకం!!!
బుద్ధిర్బలం యశోధైర్యం! నిర్భయత్వ మరోగతా!
ఆజాడ్యం వాక్పటుత్వంచ! హనుమత్స్యరణాద్భవేత్!!
అతులిత బలధామం స్వర్ణశైలభ దేహం
దనుజ వన కృశానుం ఙ్ఞానినా మగ్రగణ్యం
సకల గుణ నిధానం వానరాణా మధీశం
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి!
హనుమంతుని జండా ఇంటి పై ఎందుకు ఉంచాలి......
మహభారత యుద్ద సమయంలో శ్రీ కృష్ణుడు అర్జునునికి చెప్పి రథం పై ఆంజనేయ స్వామి జెండా ఉంచమనెను. కారణం శ్రీ కృష్ణుడు రామ అవతారంలో ఉండగా, రామ సంహరణ యుద్ద సమయంలో హనుమంతుని సహయంతో రాముడు రావణుని సంహరించెను. కావున శ్రీ కృష్ణుడు ఆ సంఘటన గుర్తించి హనుమంతుడు ఉన్నచోట విజయం, లాభం కలుగుతుందని, అర్జునితో కపిరాజు జెండా ఉంచమని చెప్పి, తర్వాత యుద్దం చేయగా కౌరవుల పై విజయం సాధించిరి.
కావున ప్రతీ వారి నివాహ గృహముల పై, వాహనముల పై హనుమంతుని యొక్క జెండా ఉంచడం వల్ల సమస్తదేవతల యొక్క అనుగ్రహం కలిగి ఆ గృహనికి, అందు నివసించువారికి సమస్త గ్రహ దోషాలు. నరఘోష, ఏలినాటి శనిదోషం, తొలుగును. సకల కార్యములు దిగ్విజయముగా పూర్తి అగును.

Thursday, 17 August 2017

లక్ష్మీదేవికి చెరుకురసం నైవేద్యంగా పెడితే........

మిత్రులకు శుభోదయం.
లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నైవేధ్యాలలో చెరుకురసం చాలా ప్రీతికరం, ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి చెరుకురసం నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అంతే కాకుండా ఆ కుటుంబంలో ఎప్పుడు ధనానికి లోటు ఉండదు.
1) నమస్తేస్తు మహామాయే! శ్రీపేఠే సురపూజితే, శంఖచక్రగదాహస్తే ! మహాలక్ష్మీ ! నమోస్తుతే ||
అమ్మా ! శ్రీపీఠనివాసిని ! మహామాయారూపిణీ ! దేవతలచే పూజించబడుతల్లీ ! గదాశంఖచక్రాలను ధరించినదేవీ ! మహాలక్ష్మీ ! నీకు అనేక నమస్కారములు.
2) నమస్తే గరుఢారూఢేః ! కోలాసురభయంకరి! సర్వపాపహరే! దేవి! మహాలక్ష్మి! నమోస్తుతే ||
గరుత్మంతునిపై కూర్చుండి పయనించే తల్లీ ! కోలుడు అనే రాక్షసునికి భయం కల్గించిన దేవీ! సకలపాపహారిణి ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారములు.
3) సర్వజ్ఞే ! సర్వవరదే ! సర్వదుష్ట భయంకరి! సర్వదుఃఖహరే! దేవి! మహాలక్ష్మి ! నమోస్తుతే ||
సర్వజ్ఞురాలా ! సకలవరాలు ప్రసాదించే దయామయీ! సర్వదుష్టశక్తుల్నీ తోలగించేపరాశక్తీ! అన్ని దుఃఖాలనూ హరించే లక్ష్మీదేవీ! నీకు నమస్కారములు.
4) సిద్ధిబుద్ధిప్రదే! దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే ! సదాదేవె మహాలక్ష్మి! నమోస్తుతే ||
సిద్ధినీ బుద్ధినీ ప్రసాదించేతల్లీ ! భుక్తిని, ముక్తిని అనుగ్రహించే దేవీ! మంత్రమూర్తీ! దివ్యకాంతిమయీ ! మహాలక్ష్మీ నీకు నమస్కారము.
5) ఆద్యంతరహితే ! దేవి ఆద్యశక్తి ! మహేశ్వరి యోగజే ! యోగసంభూతే మహాలక్ష్మి ! నమోస్తుతే ||
ఆద్యంతాలు లేనిదేవీ ! ఆదిశక్తీ ! మహేశ్వరీ ! యోగం వల్ల జన్మించిన తల్లీ ! ధ్యానంలో గోచరించే జగన్మాతా ! మహాలక్ష్మి ! నీకు నమస్కారము.
6) స్థూలసూక్ష్మ మహారౌద్రే ! మహాశక్తి ! మహోదరే ! మహాపాపహరే ! దేవి ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||
స్థూలరూపంతోనూ, సూక్ష్మ రూపంతోనూ, మహారౌద్రరూపంతోనూ కనిపించేతల్లీ ! మహాశక్తిస్వరూపిణీ ! గొప్ప ఉదరం గల జగజ్జననీ ! మహాపాపాల్ని హరించేదేవీ ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారము.
7) పద్మాసనస్థితే ! దేవి ! పరబ్రహ్మ స్వరూపిణి ! పరమేశి ! జగన్మాత ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||
పద్మాసనభంగిమలో కూర్చొని ఉండేదేవీ ! పరబ్రహ్మ స్వరూపిణీ ! పరమేశ్వరీ ! జగజ్జననీ ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారము.
8) శ్వేతాంబరధరే! దేవి ! నానాలంకారభూషితే ! జగత్ స్థితే ! జగన్మాత ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||
తెల్లనివస్త్రములు ధరించిన దేవీ ! అనేకాలయిన అలంకారాలు దాల్చినతల్లీ ! లోకస్థితికి కారణమైన విష్ణుపత్నీ ! జగన్మాతా ! మహాలక్ష్మి ! నీకు నమస్కారము.
మహాలక్ష్మ్యష్టకస్తోత్రం యః పఠేత్ భక్తిమాన్నరః సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||

Wednesday, 16 August 2017

రావిచెట్టు - దరిద్ర దేవత - లక్ష్మి కటాక్షం.



మిత్రులకు శుభోదయం.
అశ్వత్థ హుతభుక్ వ్యాసో గోవి౦దస్య సదాశ్రయః
అశేష౦ హర మే శోక౦ వృక్షరాజ నమో౭స్తుతే!!
మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణీ!
అగ్రత శ్శివ రూపాయ వృక్ష రాజాయతే నమః!!
రావిచెట్టు - దరిద్ర దేవత - లక్ష్మి కటాక్షం.
పూర్వం క్షీరసాగర మధనంలో లభించిన అనేక వస్తువుల్లో లక్ష్మిని, కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు. శ్రీహరి, శ్రీదేవిని పెళ్ళి చేసుకోదలచాడు. కానీ శ్రీదేవి ''ఓ నారాయణా! నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది. ఆ జ్యేష్ఠకు పెళ్ళి కాకుండా కనిష్ఠనైన నేను కల్యాణమాడటం న్యాయం కాదు కనుక ముందు ఆమె పెళ్ళికై సంకల్పించు'' అని కోరింది. ధర్మబద్ధమైన ''రమ'' మాటలను అంగీకరించి విష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు. స్థూలవదన, అశుభకారిణి, అరుణనేత్రి, కఠినగాత్రి, బిరుసు శిరోజాలు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు.
దరిద్ర దేవతకు ఇష్టమైన స్థలాలు
నిరంతర హోమధూమ సుగంధాలతో, వేద నాదాలతో నిండిన ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ ''ఓ ఉద్దాలకా! నాకు ఈ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించే, అతిథి పూజా సత్కారాలు జరిగే, యజ్ఞయాగాదులు నిర్వహించే స్థలాల్లో నేను నివసించను. అన్యోన్య అనురాగం గల భార్యాభర్తలు ఉన్న చోటగానీ, పితృదేవతలు పూజింపబడే చోటగానీ, ఉద్యోగస్తుడు, నీతివేత్త, ధర్మిష్టుడు, ప్రేమగా మాట్లాడేవాడూ, గురుపూజా దురంధరుడు ఉండే స్థలాల్లో నేను ఉండను. ఎక్కడ రాత్రింబవళ్ళు ఆలుమగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో, ఎక్కడయితే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతుంటాయో, ఎక్కడయితే దురాచారాలు, పరద్రవ్య, పరభార్యాపహరణ శీలులైనవారు ఉంటారో అలాంటి చోట మాత్రమే నేనుంటాను. కల్లు తాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతకులు ఎక్కడ ఉంటారో నేనక్కడ ఉండటానికే ఇష్టపడతాను'' అంది.
రావి మొదట్లో జ్యేష్ఠావాసం
ఆమె మాటలకు వేదవిదుడైన ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకుని ''ఓ జ్యేష్ఠా! నువ్వు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకూ నువ్వీ రావిచెట్టు మొదట్లోనే కదలకుండా కోర్చో'' అని చెప్పి బయల్దేరి వెళ్ళాడు. భర్తాజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావిచెట్టు మొదలులో అలాగే ఉండిపోయింది. ఎన్నాళ్ళకీ ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్దపెట్టున దుఃఖించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవుల్లో పడ్డాయి. వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది. విష్ణువు కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై, ఆమెని ఊరడిస్తూ ''ఓ జ్యేష్ఠాదేవీ! ఈ రావిచెట్టు నా అంశతో కూడి ఉంటుంది. కనుక, నువ్వు దీని మూలంలోనే స్థిరనివాసం ఏర్పరచుకుని ఉండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్తుల యందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది'' అని చెప్పాడు. ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావిచెట్టు పూజనీయగాను, అక్కడ జ్యేష్ఠాదేవిని షోడశోపచార విధిని అర్పించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణ కురిపించేట్లు ఏర్పరచాడు శ్రీహరి.

Wednesday, 9 August 2017

దత్తాత్రేయ స్వామి చరిత్ర :.....

దత్తాత్రేయ స్వామి చరిత్ర :.....
త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపుడు గురుదత్తాత్రేయుడు. దత్త అనే పదానికి "సమర్పించిన" అనే అర్థముంది, త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము "సమర్పించుకున్నారు" కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు "ఆత్రేయ" అయింది.
ఉత్తరాది సాంప్రదాయంలో, దత్తాత్రేయను ఒక అవతారంగా లేదా శివుడి అవతారంగా, మరియు నాథ యొక్క అధినాథ్ సంప్రదాయానికి సంబంధించిన ఆది-గురు (ఆది గురువు)గా గుర్తిస్తున్నారు. దత్తాత్రేయ మొట్టమొదటిలో యోగదేవుడుగా తాంత్రిక లక్షణాలను ప్రదర్శిస్తూ వచ్చినప్పటికీ, తర్వాత అతడు మరింత భక్తి (సంస్కృతం: భక్తి) కి సంబంధించిన వైష్ణవ పూజావిధానాలను పుణికి పుచ్చుకుని, సంలీనమయ్యాడు; ఇతడు ఇప్పటికీ కోట్లాది హిందువుల చేత పూజింపబడుతూనే, భారతీయ చింతనలో అత్యున్నత సారాంశమైన గురువు కంటే ఎక్కువగా కృపాస్వభావం కలిగిన దేవుడిగా గుర్తించబడుతున్నాడు. దత్తాత్రేయుడు త్రిపుర రహస్య గ్రంథకర్తగా పేరు పొందాడు, అద్వైత వేదాంతాన్ని విశదీకరించిన ఈ గ్రంథాన్ని పరశురాముడికి అంకితం చేశాడు.
మసక చీకటిలో త్రాడును చూచి పామని భ్రమించి భయపడతాము. కాని తర్వాత దీపం సహాయంతో అది తాడని తెలియగానే ఆ భ్రాంతి, భయము తోలుగుతాయి. అలానే వాస్తవానికి బ్రహ్మమనబడు పరమాత్మా ఒక్కడే ఉన్నాడు. అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము, ఆశ, దుఃఖము కల్గుతాయి. ఆత్మజ్ఞానమనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము, ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవమవుతుంది. అపుడు భయానికి, దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలుగుతుంది. అంటే ఈ జగత్తు మిధ్యయని తేలిపోతుంది. సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్త్వం. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయ పూర్వక నమస్కారము. ఆ పరబ్రహ్మమే సత్యమైనది. అజ్ఞానం వలన దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్త్వాన్ని బోధించడానికి అత్రైమహాముని పుత్రుడై జన్మించి, శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు. భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు, యదువు మొ||న వారిని ఈ సంసారమనే దుఃఖసాగరం నుండి ఉద్దరించాడు. ఆయననే మరల శ్రీ పాదవల్లభుడుగాను, తరువాత శ్రీ నృసింహసరస్వతియనే పేరుతోనూ అవతరించి, తన శిష్యులైన సిద్దాదులనుద్దరించాడు.
పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడు అనేరాజు నిరంతరము హరి చింతన, అతిథి సేవలతోపాటు నిష్టతో ఏకాదశి వ్రతము ఆచరించేవాడు. ఒకరోజు ద్వాదశీ తిథి ఒక్క ఘడియ మాత్రమె ఉండగా. దుర్వాస మహర్షి, శిష్యప్రశిష్యులతో కలిసి అతని వద్దకొచ్చారు. అంబరీషుడు ఆయనను పూజించి, త్వరగా అనుష్టానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ప్రార్ధించాడు. అపుడా మహర్షి, స్నానానికి నదికి వెళ్లి పారణ సమయం మీరిపోతున్నాగాని రాకుండా ఆలస్యం చేయసాగారు. తిథిమించి పొతే అంబరీషునికి వ్రతభంగమవుతుంది. అలాగని అతడు భోజనం చేస్తే, అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది. అందుకని అతడు ఆ రెండింటిని పరిరక్షించుకోదలచి ,కొదద్ది తీర్థం మాత్రం త్రాగాడు. ఇంతలో దుర్వాసుడోచ్చి కోపించి, ‘రాజా, నీవు నానాయోనులలో జన్మింతువు గాక!’ అని శపించాడు. అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణువేడాడు. అపుడాయన సాక్షాత్కరించి దుర్వాసునితో,’మహర్షీ, నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు. అతనిని రక్షించడం నా ధర్మం. అయినా మహర్షులైన మీ శాపం వ్యర్దం కాకూడదు కనుక, ఆ శాపాన్ని నాకు వర్తిమ్పాజేయి’ అన్నారు. అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి దుర్వాషుడుసరే అన్నాడు. స్వామీ అంతా మీ అభీష్టం ప్రకారమే కానీ అన్నాడు. ఆ విధంగా శ్రీహరి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు.
దత్తాత్రేయుని జననం : ....
దేవహుతి మరియు కర్ధముని కుమార్తె అనసూయ . అనసూయాదేవి అత్రిమహర్షికి భార్యయై, మహా పతివ్రతగా ప్రసిద్దికెక్కింది. ఒకసారి త్రిలోక సంచారియైన నారదమహర్షి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నివాసాలకు వెళ్లి, అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని గురించి యెంతగానో ప్రశంశించాడు. అప్పుడు త్రిమూర్తుల భార్యలు అసూయచెంది, ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్భందించారు. అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అతిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. అనసూయదేవి వారికి యెదురేగి స్వాగతం చెప్పి, ఆర్ఘ్య – పాదాదులు సమర్పించి, మీకు నేనేమి చేయాలో సెలవియ్యండి. అత్రి మహర్షి తపస్సుకోసం అరణ్యంలోకి వెళ్లారు. అపుడు అతిథులు ‘అమ్మా! మాకెంతో ఆకలిగా ఉంది, నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము గదా? మాకు వెంటనే భోజనం పెట్టు’ అన్నారు. ఆమె లోపలకు వెళ్లి విస్తర్లు వేసి, అయ్యలారా! భోజనానికి దయజేయండి. అని ప్రార్ధించింది. అపుడు వారు ‘సాధ్వీ, మాదొక షరతు ఉన్నది. నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము. లేకుంటే యిలా ఆకలితోనే వెళ్లిపోతాము’ అన్నారు.
వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది. అంతేగాక, ఆకలితో తిరిగిపోయిన అతిథి, గృహస్థుల పుణ్యాన్ని, తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం. కాని పరపురుషుల యెదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది! పరస్పర విరుద్దమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకోజూచిన అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది. వారి విచిత్రమిన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకుంది. అయ్యలారా అలానే చేస్తాను, భోజనానికి లేవండి! అని చెప్పి ఆశ్రమం లోపలకు వెళ్లి, అత్రిమహర్షి పాదుకలతో, స్వామి, ‘నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను.’ అని చెప్పుకొన్నది. ఆమెయొక్క పాతివ్రత్య మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి వెళ్లేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు. ఆమె భావాన్ననుసరించి ఆమెకు బాలింతరాలకు వలె స్తన్యమొచ్చింది.ఆమె ఆ వెంటనే వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు పాలిచ్చింది. ఆ మహా పతివ్రత తన దివ్యద్రుష్టివలన వారు త్రిమూర్తులు అని తెలుసుకొని ఊయాలలో పెట్టి, ఆ జరిగిన కథనే జోలగా పాడుచున్నది.
ఇంతలో అత్రి మహర్షి వచ్చి,ఆమె నుండి సర్వము తెలిసికొని ఊయలలొని త్రిమూర్తులను దర్శించి, ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను యిలా స్తుతించాడు. ‘ఓ మహావిష్ణు! ఈవు సృష్టి-స్థితి-లయ కారణుడవు. జగత్సాక్షివి, విశ్వమయుడవు. విశ్వాధరుడవు. ఓ పరమేశ్వర! నీవు సహజంగా ఒక్కడవే అయినా నీ లీలచేత త్రిమూర్తులుగా మారి క్రేడిస్తున్నావు. వాస్తవానికి ఈ జగత్తు నీ కంటే వేరుగాకపోయిన, మసక చీకటిలోని త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు , ‘నేను-నాది’ అనే మాయతో గూడిన భావన వలన నీకంటె వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది.
ఊయలలొని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు. త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తిచెంది, తమ నిజరూపాలతో ప్రత్యక్షమై. వరం కోరుకోమన్నారు. అప్పుడు అత్రి మహర్షి భార్యవైపు చూస్తూ ‘సాధ్వీ, వీరు మనస్సు చేతగూడ పొందడానికి వీలుగానివారు. అయినా నీ భక్తీ వలన ఇలా వచ్చారు. నీ అభీస్టమేమిటో నివేదించుకో అన్నాడు.’ అప్పుడు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడడ్డారు. కనుక ఈ మూడు మూర్తులగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది, మీ అవతారకార్యం నేరవేర్చుకోవడమే నా అభీష్టము అన్నది. అత్రిమహర్షి సంతోషించి , మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ముద్దరించండి.అని కోరాడు. అపుడు వారు మహర్షీ మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము. ఆ తర్వాత అత్రి అనసూయలకు దత్తాత్రేయుడు జన్మిస్తాడు. ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడే; శ్రుతులకు గూడ అందని సచ్చిదానంద స్వరూపుడు; మానవుల అభీష్టాలు నెరవేర్చి యోగము, జ్ఞానము ప్రసాదించేవాడు.స్మరించిన తక్షనంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూఉంటాడు.
అలనాటి! దుర్వాశ శాపం వల్లనే పరమాత్మాయైన శ్రీదత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంటాడు.అసలు ఆయన అవతరించిందే అందుకు. సర్వజనోద్దరణమనే దత్తావతార కార్యం సృష్టిఉన్నంత వరకు కొనసాగాల్సిందే. కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తుంటాడు. శ్రీ దత్తాత్రేయుడే ఆది గురువు.

Sunday, 6 August 2017

"అరుంధతి" నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు....?

పెళ్లి అయిన తరువాత "అరుంధతి" నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు....?
ఈ ప్రశ్న నేటిదికాదు, నాటిదేనని చెబుతున్నది ‘సూత సమ్హితా శౌనకాది మహర్షి గణాలకు ఒకసారి ఇదే సందేహం కలిగింది. దీనిని వారు త్రికాలవేత్త సమస్త పురాణ వ్యాఖ్యానదక్షుడు అయినటువంటి సూతుని ముందుంచగా, ఆయన ‘అరుంధతీ దేవి ప్రాముఖ్యతను ఇలా వివరించాడు.
“అరుంధత్యనసూయా చ సావిత్రీ జానకీసతీ
తేజస్వనీ చ పాంచాలీ వందనీయ నిరంతరం!!’
అనగా అరుంధతీ, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది. ఈ అయిదుగురు స్త్రీ మూర్తులు సదా వందనీయులని తెలుస్తున్నది. అరుంధతిదేవి పతివ్రతలో అగ్రగామి. ఈమె చరిత్రను స్మరించినంతనే పుణ్యం కలుగుతుందని ‘నైమిసమ్హితా పేర్కొంటోంది. అసక్తికరమైన అరుంధతి జన్మవౄత్తాంతాన్ని ఇపుడు మీకు చెప్పబోతున్నాను అన్నాడు సూత మహాముని.
ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో అత్యంత తేజోవితయైన ఒక కన్యను, వర్ణింపనలవికాని ఓక సుందరుని సౄష్టించాడు. ఆ కన్య పేరు ‘సంధ్యా. యువకుని పేరు మన్మథుడు. సౄష్టికార్యంలో తనకు సాయపదమని చెబూతూ బ్రహ్మ ఆ యువకునికి -
అరవింద మశోకంచ చూతంచ నవమల్లికా
నీలోత్పలంచ పంచైతే పంచబాణాశ్చసాయకా!! అంటూ
అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలం అనే అయిదు సమ్మోహన బాణాలను అందించాడు. బాణశక్తిని పరీక్షింపదలచిన మన్మథుడు వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెట్టగా, బ్రహ్మతో సహా అందరూ అక్కడే ఉన్న ‘సంధ్యా ను చూసి మోహానికి లోనయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాగ్దేవి ఈశ్వరుని ప్రార్థించగా, స్వామి అక్కడ ప్రత్యక్షమై పరిస్థితిని చక్కబరిచాడు. రెప్పపాటుకాలంలో జరిగిన తప్పుకు తలవంచిన సౄష్టికర్త కోపించి మన్మథుని ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని శాపం ఇచ్చాడు.
తనవల్లనే కదా ఇంతమంది నిగ్రహం కోల్పోయారనే అపరాధభావంతో ‘సంధ్యా చంద్రభాగా నదీతీరంలో తపస్సు పేరిట తనువు చాలించదలచి పయనమై పోయింది. అపుడు బ్రహ్మ వశిష్టమహామునిని పిలిచి సంధ్యకు తపోదీక్షను అనుగ్రహించమని కోరగా, వశిష్టుడు ఆమెకు ‘శివా మంత్రానుష్టానమును వివరించి తన ఆశ్రమానికి వెడలిపోయాడు. సంధ్య తదేకనిష్టలో తపమాచరించి శివుని అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెను వరం కోరుకొమ్మని కోరగా, ఆమె “ఈ లోకంలో సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామవికారం కలగరాదనే’ వరాన్ని అనుగ్రహించమంది. శివుడు ఆమె లోకోపకార దౄష్టికి సంతోషించి మరో వరాన్ని కోరుకోమన్నాడు. అపుడు సంధ్య ‘నా భర్త తప్ప పరపురుషుడెవరైనా నన్ను కామదౄష్టిలో చూచినట్లయితే, వారు నపుంసకులుగా మారాలి, అంతేకాదు నేను పుట్టగానే అనేకమందికి కామవికారాని కల్గించాను. కాబట్టి ఈ దేహం నశించిపోవాలీ అని కోరింది. శివుడు ‘తథాస్తూ అని మేధతిథి అనే మహర్షి గత పుష్కరకాలంగా యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో అదౄశ్యురాలివై శరీరాన్ని దగ్దం చేసుకుని, తిరిగి అదే అగ్నికుండం నుండి నీవు జన్మిస్తావు. నీ శరీరం నశించే సమయంలో ఎవరినైతే భర్తగా తలుస్తావో! అతడే నీ భర్త అవుతాడని చెప్పి అంతర్థానమయ్యాడు.
శివాజ్ణ్జగా సంధ్యా శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధం చేస్తూ వశిష్టుడే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నికుండం నుండి తిరిగి జన్మించింది. సంస్కౄత భాషలో ‘అరుం’ అంటె అగ్ని, తేజము, బంగారువన్నె అనే అర్థాలున్నాయి. ‘ధతీ అంటె ధరించినది అనే అర్థం వున్నది. అగ్ని నుంచి తిరిగి పుట్టింది కాబట్టి ఆమె ‘అరుంధతీ అనబడింది. పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి పెంచి పెద్ద చేసి – వశిష్టునకు ఇచ్చి వివాహం జరిపించాడు. అరుంధతి తన పాతివ్రత్య మహిమ వలన త్రిలోకపూజ్యురాలైంది. ఈ దంపతులకు పుట్టినవాడే ‘శక్తీ. శక్తికి పరాశరుడు, పరాశరునకు వ్యాసుడు జన్మించారు. అరుంధతిని మనవారు ‘ఆరని జ్యోతీ అని ‘అరంజ్యోతీ అని పిలుస్తూంటారు. విష్ణుసహస్రనామాల్లో సైతం అరుంధతి సంతతి గురించి, మనమలు, మునిమనమలు గురించి ప్రస్తావించబడివుంది.
అరుంధతీ నూతన దంపతులకు ఇచ్చే దీవెనలు ఏమిటి? అంటే, కొత్త పెళ్ళైన దంపతులకు ఆకాశంలో సప్తఋషి మండలంలో వున్న వశిష్టుని తారకు ప్రక్కనే వెలుగుతుండే అరుంధతీ నక్షత్రాన్ని కూడా చూపిస్తారు. దీనివెనుక ఒక ప్రధాన కారణమున్నది. వశిష్ట, అరుంధతీ ద్వయం ఆదర్శ దంపతులకు ఒక ప్రతీక. కొత్తగా పెళ్ళైన దంపతులు సైతం వారివలెనే ఉండాలనే ఉద్దేశ్యంతో మనవారు ఆ దంపతులిద్దర్ని తారారూపంలో వీక్షింపచేస్తూ రావడం ఒక సాంప్రదాయమైంది.
గరుడ పురాణం......
గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి. ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడినది. అందుకే ఈ పురాణమునకు "గరుడ పురాణం" అని పేరు వచ్చింది. ఈ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి.
ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరక లోక వర్ణన ఉంటుంది. ఇంకా మానవుడు చేశే వివిధ పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు, పాపాలు చేస్తే వాటి ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు, పితృ కార్యాల వర్ణన ఉంటుంది.
* నాలుగవ అధ్యాయం
శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి నాల్గవ అధ్యాయంలో వైతరణిని గురించి వివరించాడు. నరకమంటే ఏమిటి అది ఎవరికి ప్రాప్తిస్తుంది, దానిని ఎలా తప్పించుకోవాలి,వైతరణి అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది లాంటి వివరాలు ఇందులో వర్ణించబడ్డాయి. పాపాత్ములు మాత్రమే యమపురి దక్షిణ ద్వారం నుండి పోవలసి ఉంటుంది. దక్షిణ మార్గంలో వైతరణి నది ఉంటుంది. దక్షిణ మార్గంలో వెళ్ళవలసిన దుర్గతి మనిషిగా పుట్టి చేయకూడని పాపాలు చేయడమేనని పురాణంలో చెప్పబడింది. బ్రహ్మహత్య,శిశుహత్య, గోహత్య, స్త్రీహత్య చేసేవారూ గర్భపాతం చేసేవారూ, రహస్యంగా పాపపు పని చేసేవారూ, గురువులు, పండితులు, దేవతలు, స్త్రీ, శిశు.
* రెండవ అధ్యాయం
హరించే వారు,తీసుకున్న అప్పు తీర్చని వారు, ఒకరు దాచిన ద్రవ్యాన్ని అపహరించే వారు, విశ్వాసఘాతుకులు, విషాన్నం పెట్టి ఇతరులను హత్యచేసే వాళ్ళు వైతరణిని దాటి వెళ్ళవలసినదే. దోషులను పొగిడేవారు,మంచివారిని నిందించే వారు,ఋణగ్రస్థులను ఎగతాళి చేసే వారు, నీచులతో స్నేహం చేసేవారు, సత్పురుషులతో స్నేహం చేయని వారు,పుణ్య తీర్ధాలనూ, సజ్జనులనూ, సత్కర్ములనూ, గురువులనూ,దేవతలనూ నిందించేవారు యమలోకం దక్షిణపు మార్గాన నడవాల్సి ఉంటుంది. పురాణాలను, వేదాలను, మీమాంస, న్యాయ శాస్త్రాలను, వేదాంత శాస్త్రాలను దూషించేవారు, ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు, ఎదుటి వారు దుఃఖిస్తుంటే ఆనందించే వారు, చెడు మాటలు పలికేవారు, పెద్దల హితోపదేశాన్ని వినని వారు, ఆత్మస్తుతి చేసే వారు, పరనింద చేసేవారు. అధర్మ మార్గంలో నడిచేవారు దక్షిణమార్గాన ఏడుస్తూ పడిపోవలసిందే.
తల్లి తండ్రులకు, గురువుకు, ఆచార్యులకు,పూజింపతగిన వారికి అవమానం కలిగించేవాడు, పతివ్రత వినయ సంపన్నురాలైన భార్యను అకారణంగా ద్వేషించి విడిచి పెట్టేవారు, ఏదైనా ఇస్తానని మాట తప్పిన వారు, ఇచ్చిన దానిని తిరిగి తీసుకునేవారు, దానం ఇచ్చి తరువాత ఇచ్చినందుకు బాధ పడేవారు వైతరణిని దాటక తప్పదు. దానం చేసే వారిని ఇవ్వవద్దని ఆపేవారు, యజ్ఞ విధ్వంసకులు, హరికథకులకు విగ్నం కలిగించే వారు, పరుల భూముల సరిహద్దులను చెరిపి భూమి ఆక్రమించే వారు, పశువుల బీడును దున్ని వాటికి మేతలేకుండా చేసేవాడు, అనవసరంగా పశుహత్య చేసేవాడు. కపిల గోవుపాలను దైవకార్యాలకు కాక స్వంత కార్యాలకు వినియోగించే వారు ఇలాంటి పాపాలు చేసే ప్రతి మనిషి యమలోకం దక్షిణ మార్గాన ఉన్న వైతరణిలో కూలబడవలసిందే. యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్ములను వైతరుణిలో త్రోసి వేస్తారు.
గోదానం చేయని వారు ఊర్ధ్వ దేహక్రియలు జరగని వారు ఆ నదిలో అనేక బాధలు అనుభవించినా నది ఒడ్డున ఉండే బూరుగ చెట్టుకు వ్రేలాడ వలసి వస్తుంది.అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, వంచనచేసి ధనం సంపాదించేవారు దొంగతనం చేసేవారు పచ్చని చెట్లను నరికేవారు, ఫలవృక్షాలను పూలతోటలను ద్వంసం చేసేవారు తీర్ధయాత్రలను చేసే వారికి ఆటంకం కలిగించేవారు, వితంతువులను మోసం చేసి మానహరణ చేసే వారు వైతరణిలో దుఃఖాన్ని అనుభవించి ఒడ్డున ఉన్న బూరుగ చెట్టుకు కట్టబడి యమభటుల చేతి దెబ్బలు తింటూ ఉంటారు. ఇలా పాపాత్ములు వైతరణిలో పడి బాధలు అనుభవించాలని గరుడ పురాణం చెప్తుంది. గరుడ పురాణం అనేది మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు వ్రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. దీనిని చదవడంవల్ల మనిషి తన జీవితాన్ని మంచి మార్గంలోకి మలచు కోవడానికి ప్రయత్నిస్తాడు.
* ఆరవ అధ్యాయం
ఈ అద్యాయంలో జనమరణాల చక్రం గురించిన వివరణ ఉంటుంది.గర్భస్థ శిశువు వర్ణన శిశువు అవస్థ శిశుకు జ్ఞాననంకలగటం జననం మరలా అజ్ఞానంలో పడటం తిరిగి కర్మానుసారం జన్మించడం గురించిన వర్ణన విపులంగా చేయబడింది. జన్మ రాహిత్యం జ్ఞానులకు, పుణ్యాత్ములకు మాత్రమే కలుగుతుంది.పాపులు చావు గర్భవాసాన్ని బాధగా భరిస్తుంటాడు. తల్లి తిన్న పులుపు చేదు పదార్ధాల వలన వేదన పడతాడు. ఆ తరువాత పంజరంలో పక్షిలా కొద్ది రోజులకు క్రిందికి తిరుగుతాడు. గాద్గద స్వరంతో భగవంతుని స్తుతిస్తాడు. ఏడవ మాసానికి మరింత జ్ఞానోదయమై అటూఇటూ కదలుతూ గత జన్మలో పాపపుణ్యాలనుఎరుగక చేసిన పాపకార్యాలు తలచుకుని మరింత చింతిస్తాడు. తను అర్జించిన సంపదలను అనుభవించిన భార్యా బిడ్డలు తనను పట్టించుకోక పోవడం గుర్తుచేసుకుని రోదిస్తూ భగవంతుడా పుట్టుక సంసార బాధలు తప్పవు అని భావన.
పాపాత్ముడు పురుషుని రేతస్సుని ఆధారంగా చేసుకుని కర్మననుసరించి నిర్ధిష్టమైన స్త్రీ గర్భంలో ప్రవేసిస్తాడు. అలా ప్రవేసించిన అయిదు రోజులకు బుడగ ఆకారాన్ని పొందుతాడు. పది రోజులకు రేగుపండంత కఠిమైన ఎర్రని మాంసపు ముద్దలా తయారవుతాడు.ఒక మాసకాలానికి తలభాగం తయారవుతుంది. రెండు మాసాలకు చేతులు భుజాలు ఏర్పడతాయి. మూడు మాసాల కాలానికి చర్మం, రోమాలు, గోళ్ళు, లింగం, నవరంధ్రాలు ఏర్పడతాయి. ఐదవ మాసానికి ఆకలి దప్పిక వస్తాయి. ఆరవ మాసానికి మావి ఏర్పడి దక్షిణవైపుగా కదలిక మొదలౌతుంది. ఇలా మెల్లిగా తల్లి తీసుకునే ఆహారాన్ని స్వీకరిస్తూ పరిణితి చెందుతూ ఉంటుంది. జీవుడు దుర్గంధ భూయిష్టమైన ఈ గర్భకూపంనుండి నన్ను త్వరగా బయటకు త్రోసి వేయి తండ్రీ. మరో జన్మ ఎత్తి నీ పాదసేవ చేస్తాను నాకు మోక్షప్రాప్తిని కలిగించు అని పరి పరి విధాల ప్రార్ధిస్తాడు.
ఇలా శోకించే శిశువు వాయుదేవుని సహాయంతో ఈ లోకంలో జన్మించి వెంటనే ముందున్న జ్ఞానం నశించి అజ్ఞానం ఆవరించి ఏడ్వటం మొదలు పెడతాడు. ఆ తర్వాత పరాధీనుడై తన ఇష్టాయిష్టాలు,శరీర బాధలు చెప్ప లేక బాల్యావస్థలు పడుతూ యవ్వనంలోకి ప్రవేశించి ఇంద్రియాలకు వశుడై ప్రవర్తించి పాపపుణ్యాలను మూట కట్టుకుని వృద్ధాప్యం సంతరించి తిరిగి మరణాన్ని పొందుతాడు. తిరిగి కర్మానుసారంగా గర్భవాసం చేసి మరొక జన్మను ఎతుత్తాడు. ఇలా జీవన చక్రంలో నిరంతరం జీవుడు మోక్షప్రాప్తి చెందే వరకు తిరుగుతూనే ఉంటాడని గరుడ పురాణం ఆరవ అధ్యాయం చెప్తుంది.....
" ఓం నమో నారయణాయ "