మిత్రులకు శుభోదయం.
లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నైవేధ్యాలలో చెరుకురసం చాలా ప్రీతికరం, ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి చెరుకురసం నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అంతే కాకుండా ఆ కుటుంబంలో ఎప్పుడు ధనానికి లోటు ఉండదు.
లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నైవేధ్యాలలో చెరుకురసం చాలా ప్రీతికరం, ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి చెరుకురసం నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అంతే కాకుండా ఆ కుటుంబంలో ఎప్పుడు ధనానికి లోటు ఉండదు.
1) నమస్తేస్తు మహామాయే! శ్రీపేఠే సురపూజితే, శంఖచక్రగదాహస్తే ! మహాలక్ష్మీ ! నమోస్తుతే ||
అమ్మా ! శ్రీపీఠనివాసిని ! మహామాయారూపిణీ ! దేవతలచే పూజించబడుతల్లీ ! గదాశంఖచక్రాలను ధరించినదేవీ ! మహాలక్ష్మీ ! నీకు అనేక నమస్కారములు.
2) నమస్తే గరుఢారూఢేః ! కోలాసురభయంకరి! సర్వపాపహరే! దేవి! మహాలక్ష్మి! నమోస్తుతే ||
గరుత్మంతునిపై కూర్చుండి పయనించే తల్లీ ! కోలుడు అనే రాక్షసునికి భయం కల్గించిన దేవీ! సకలపాపహారిణి ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారములు.
3) సర్వజ్ఞే ! సర్వవరదే ! సర్వదుష్ట భయంకరి! సర్వదుఃఖహరే! దేవి! మహాలక్ష్మి ! నమోస్తుతే ||
సర్వజ్ఞురాలా ! సకలవరాలు ప్రసాదించే దయామయీ! సర్వదుష్టశక్తుల్నీ తోలగించేపరాశక్తీ! అన్ని దుఃఖాలనూ హరించే లక్ష్మీదేవీ! నీకు నమస్కారములు.
4) సిద్ధిబుద్ధిప్రదే! దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే ! సదాదేవె మహాలక్ష్మి! నమోస్తుతే ||
సిద్ధినీ బుద్ధినీ ప్రసాదించేతల్లీ ! భుక్తిని, ముక్తిని అనుగ్రహించే దేవీ! మంత్రమూర్తీ! దివ్యకాంతిమయీ ! మహాలక్ష్మీ నీకు నమస్కారము.
5) ఆద్యంతరహితే ! దేవి ఆద్యశక్తి ! మహేశ్వరి యోగజే ! యోగసంభూతే మహాలక్ష్మి ! నమోస్తుతే ||
ఆద్యంతాలు లేనిదేవీ ! ఆదిశక్తీ ! మహేశ్వరీ ! యోగం వల్ల జన్మించిన తల్లీ ! ధ్యానంలో గోచరించే జగన్మాతా ! మహాలక్ష్మి ! నీకు నమస్కారము.
6) స్థూలసూక్ష్మ మహారౌద్రే ! మహాశక్తి ! మహోదరే ! మహాపాపహరే ! దేవి ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||
స్థూలరూపంతోనూ, సూక్ష్మ రూపంతోనూ, మహారౌద్రరూపంతోనూ కనిపించేతల్లీ ! మహాశక్తిస్వరూపిణీ ! గొప్ప ఉదరం గల జగజ్జననీ ! మహాపాపాల్ని హరించేదేవీ ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారము.
7) పద్మాసనస్థితే ! దేవి ! పరబ్రహ్మ స్వరూపిణి ! పరమేశి ! జగన్మాత ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||
పద్మాసనభంగిమలో కూర్చొని ఉండేదేవీ ! పరబ్రహ్మ స్వరూపిణీ ! పరమేశ్వరీ ! జగజ్జననీ ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారము.
8) శ్వేతాంబరధరే! దేవి ! నానాలంకారభూషితే ! జగత్ స్థితే ! జగన్మాత ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||
తెల్లనివస్త్రములు ధరించిన దేవీ ! అనేకాలయిన అలంకారాలు దాల్చినతల్లీ ! లోకస్థితికి కారణమైన విష్ణుపత్నీ ! జగన్మాతా ! మహాలక్ష్మి ! నీకు నమస్కారము.
మహాలక్ష్మ్యష్టకస్తోత్రం యః పఠేత్ భక్తిమాన్నరః సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||
No comments:
Post a Comment