Monday, 23 October 2017

కుజ దోషము...................


కుజ దోషము...................
కుజుడు ఉష్ణ ప్రకృతి గల గ్రహము. దీనిని పాప గ్రహముగా చెప్పబడును. వివాహము మరియు వైవాహిక జీవితములో కుజుని యొక్క అశుభ ప్రభావము అధికముగా కనిపించును.
కుజ దోషము కలవారిని మాంగళీకునిగా చెప్పబడును. ఈ గ్రహ దోషము కారణముగా అనేక మంది స్త్రీ పురుషులు జీవితాంతము అవివాహితులుగా వుండిపోయెదరు. ఈ దోషము వలన గల భయమును తొలగించుటుకొనుటకు దీని గురించి పూర్తిగా తెలుసుకొనుట అవసరము.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారము కుజ దోషము యొక్క పరిశీలన...........
వైదిక జ్యోతిష్యములో కుజుని లగ్నము, ద్వితీయ, చతుర్ధ, సప్తమ, అష్టమ మరియు ద్వాదశ బావములో దోష పూరితముగా చెప్పబడును. ఈ బావములలో ఉపస్థితిలో వున్న కుజుడు వైవాహిక జీవితము కొరకు అనిష్టాకారకముగా చెప్పబడును. జన్మ కుండలిలో ఈ పంచ బావములు కుజునితో పాటు ఎంత క్రూరమైన గ్రహములుగా కూర్చొని వున్నవో కుజుడు అంతే దోషపూరితముగా వుండును. అనగా రెండ బావము క్రూరమువా వుండిన రెండింతలు, నాల్గవ బావము క్రూరముగా వుండిన నాల్గింతలు. కుజుని పాప ప్రబావములు వేరు వేరు విధములుగా ఐదు బావములలో దృష్టి కలిగి వుండును.
1) లగ్న బావములో కుజుడు.
లగ్న బావము నుండి వ్యక్తి యొక్క శరీరము, ఆరోగ్యము, వ్యక్తిత్వము యొక్క విచారణ చేయబడును. లగ్న బావములో కుజుడు వున్న ఎడల వ్యక్తి క్రోదము మరియు ఉగ్ర స్వబావము కలవారై వుండును. ఈ కుజుడు వ్యక్తిని మొండిగాను మరియు ఎప్పుడూ గొడవపడే స్వబావము గలవాడుగా చేయును. ఈ బావములో ఉపస్థితిలో వున్న కుజుని దృష్టి చతుర్ధ బావ దృష్టి సుఖ స్థానములో వుండిన ఎడల గృహస్థ సుఖములలో లోపము ఏర్పడగలదు. సప్తమ దృష్టి జీవిత బావస్వామి స్థానములో వుండిన ఎడల భార్యా భర్తల మద్య విరోధములు మరియు దూరము కలుగుచుండును. అష్టమ బావముపై కుజుని యొక్క పూర్ణ దృష్టి జీవిత బాగస్వామికి సంఘటములను కలిగించును.
2) ద్వితీయ బావములో కుజుడు.
బావదీపిక నామక గ్రహములో ద్వితీయ బావస్థ కుజుడు కూడా కుజదోషము వలన పీడించబడగలడు. ఈ బావము కుటంబము మరియు ధనమునకు స్థానముగా వుండును. ఈ కుజుడు కుటుంబము మరియు బందుమిత్రులతో విరోధములను శృష్టించును. కుటుంబములో కలతలను ఏర్పరచి దాని కారణముగా బార్యా భర్తలలో అశాంతిని కలిగించును. ఈ బావము యొక్క కుజుడు పంచమ బావము, అష్టమ బావము మరియు నవమ బావమును చూస్తున్నాడు. కుజుని ఈ బావములలో దృష్టి కారణముగా సంతాన పక్షములో విపరీత ప్రభావము కలుగును. భాగ్యము యొక్క ఫలితములు బలహీన పడును.
4) చతుర్ధ బావములో కుజుడు.
చతుర్ధ స్థానములో కూర్చొని వున్న కుజుడు సప్తమ, దశమ మరియు ఏకాదశ బావములను చూస్తున్నాడు. ఈ కుజుడు మంచి స్థాయి, సంపత్తిని ప్రదానించును కాని గృహస్థ జీవితమును కష్టమయముగా చేయును. కుజుని యొక్క జీవిత బాగస్వామి యొక్క గృహముపై వుండిన వైచారికమైన మతబేదములు కలిగి వుండెదరు. మతబేదములు మరియు ఇరువురి మద్య అశాంతి కలిగి వుండుట వలన జీవిత బాగస్వామి యొక్క సుఖములలో లోపము ఏర్పడును. కుజ దోషము కారణముగా బార్య భర్తల మద్య వొడిదుడుకులు పెరిగి దూరముగా వుండవలసి వచ్చును. ఈ కుజుడు జీవిత బాగస్వామికి సమస్యలను కలిగించడు.
7) సప్తమ బావములో కుజుడు.
సప్తమ బావములో జీవిత బాగస్వామి యొక్క గృహముగా వుండును. బావములో కూర్చొని వున్న కుజుడు వైవాహిక జీవితము కొరకు అధికముగా దోషపూరితముగా వుండును. ఈ బావములో కుజ దోషము వుండుట కారణముగా జీవిత బాగస్వామి యొక్క ఆరోగ్యములో వొడిదుడుకులు వుండగలవు. జీవిత బాగస్వామి ఉగ్రముగాను మరియు క్రోదస్వబావము కలవారై వుండును. ఈ కుజుడు లగ్న స్థానము, ధన స్థానము మరియు కర్మ స్థానముపై పూర్ణ దృష్టిని ప్రదానించును. కుజుని యొక్క దృష్టి కారణముగా ఆర్ధిక సంఘటము, వర్తక వ్యాపారములలో హాని లేదా దుర్గటనలు కలుగుట అవకాశములు వుండును. ఈ కుజ గ్రహము చరిత్రపై కూడా కలంకములను తీసురావచ్చును. సంతానము యొక్క సందర్బములో కూడా ఇది కష్టకారిగా వుండును. కుజుని అశుభ ప్రభావము కారణముగా బార్యా భర్తల మద్య వడిదుడుకులు ఏర్పడి వారు ఇరువురు విడిపోయే అవకాశములు ఏర్పడవచ్చును. కుండలిలో యది కుజుడు ఈ బావములలో కుజదోషము కారణముగా పీడించబడి వున్న ఎడల దీనికి ఉపాయములను చేయవలసి వుండును.
8) అష్టమ బావములో కుజుడు.
అష్టమ బావము దు:ఖము, సంఘటము, ఆయువు యొక్క గృహముగా చెప్పబడుతున్నది. ఈ బావములో కుజుడు వైవాహిక జీవితములోని సుఖములను నాశనము చేయును. అష్టమస్థ కుజుడు మానసిక పీడ మరియు కష్టములను ప్రదానించువాడగును. జీవిత బాగస్వామి యొక్క సుఖములో బాదలను కలిగించును. ధన బావములో దీని దృష్టి వుండుట కారణముగా ధన హాని మరియు ఆర్ధిక కష్టము కలుగును. రోగముల కారణముగా దాంపత్య సుఖము బాదించబడును. జ్యోతిష్య విధానమునకు అనుసారముగా ఈ బావములో కూర్చొని వున్న అమంగళ కారుడైన కుజుడు శుభగ్రహములను కూడా శుభకరమును ప్రదానించుటలో సమస్యలను కలిగించును. ఈ బావములో కుజుడు యది వృషభము, కన్యా లేదా మఖర రాశిలో వుండిన ఎడల దీని అశుభత కొంతవరకు తగ్గవచ్చును. మఖర రాశిలో కుజుడు వుండిన ఎడల సంతాన సంబందమైన కష్టములు కలుగును.
12) ద్వాదశ బావములో కుజుడు.
ద్వాదశ బావము కుండలిలో సుఖము, బోగము, నిద్రా, యాత్ర మరియు వ్యయమును నిర్దేశించును. ఈ బావములలో కుజుని ఉపస్థితిలో వుండిన ఎడల కుజ దోషము కలుగును. ఈ దోషము కారణముగా బార్యా భర్తల మద్య గల సంబందములలో వొడిదుడుకులు ఏర్పడగలవు. వ్యక్తిలో కామ ప్రధమైన కోరికలు అధికముగా వుండును. యది గ్రహముల శుభ ప్రభావము లేని ఎడల వ్యక్తి నడవడికలో దోషము కూడా కలుగవచ్చును. ఆవేశలోకి వచ్చి జీవిత బాగస్వామికి నష్టములను కూడా కలిగించవచ్చును. వీరిలో గుప్త రోగములు మరియు రక్త సంబంద దోషములకు అవకాశములు వుండును.
కుజ, పుత్ర దోషాలు అంటే ఏమిటో తెలుసా................
ఏలినాటి శని ప్రభావం తరహాలో కుజ దోషమంటేనే అందరూ భయపడటం సహజం. కానీ కుజదోషం ఉన్న జాతకులు వివాహం చేసుకునే సమయంలో జ్యోతిష్య నిపుణుల సూచనలు పాటిస్తే సరిపోతుంది.
సాధారణంగా కుజ దోషమంటే కుజుని ఆధిపత్యంతో కలిగే దోషం. కుజునికి అంగారకుడు అనే మరో పేరున్న విషయం తెలిసిందే. ఈ దోషం ఉన్న జాతకులు వివాహం చేసుకునే సమయంలో, చేసుకోబోయే వారి జాతక ఫలితాలపై ఆధార పడాల్సి ఉంటుంది. ఒకవేళ కుజదోష జాతకులిరువురు వివాహం చేసుకోదలచుకుంటే జాతకాల్లోని కుజుని దశాకాలం, ఆధిపత్యం ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి. ఒకే విధమైన ఆధిపత్యంతో గల కుజదోష జాతకులు వివాహం చేసుకోవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
జాతకంలో కుజుడు 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజ దోషం తప్పక ఉన్నట్టే. పై స్థానాల్లో కుజుని ఆధిపత్యం మాత్రమే కాకుండా సూర్య, గురు, రాహు, కేతువులతో పాటు కుజుడు ఆధిపత్యం వహించినట్లయితే.., లేదంటే ఆ గ్రహాల దృష్టి కుజునిపై పడే విధంగా ఉంటే కుజదోషానికి పరిహారాలున్నాయి.
కాగా కుజదోషం ఉన్న జాతకులు వివాహం చేసుకోవాలంటే..
1. జాతకం ప్రకారం స్త్రీ, పురుషులిద్దరికి ఒకే విధమైన పూర్ణవంతమైన దోషాన్ని కలిగి ఉండాలి. (లేక)
2. స్త్రీ , పురుషులకు ఎటువంటి పూర్ణవంతమైన దోషం ఉండకూడదు.
పై రెండు లేని పక్షంలో ఇద్దరికి కుజదోషపరిహారం చేసుకునే మార్గమైనా ఉండితీరాలి.
ఇంకా కుజుని దశ ఇద్దరికి ముగించే స్థాయిలోనైనా కుజదోషస్థులు వివాహం చేసుకోవచ్చు.
ఇక పుత్ర దోషం - పుత్ర సంతానం ఉందా లేదన్న విషయాన్ని జాతకపరంగా తెలుసుకోవాలంటే పురుషుని జాతకాన్నిబట్టి చూడటం పరిపాటి. ప్రతి జాతకునికి ఐదోస్థానం పుత్ర స్థానంగా పరిగణించబడుతుంది. పుత్రకారకునిగా బుధుడు ఆధిపత్యం వహిస్తాడు. గురువు శుభస్థాన ఆధిపత్యం వహిస్తే జాతకులకు పుత్రప్రాప్తి తప్పకుండా లభిస్తుంది.
ఐదో స్థానంలో రాహు- కేతులుంటే పుత్రదోషం ఉంటుంది. దీనికే "నాగదోషమని" పేరు. ఈ దోషం గల జాతకులు తప్పకుండా నాగదోష పరిహారం చేయాలి. అలా చేసిన పక్షంలో నాగదోషం తొలగిపోవటంతో పాటు పుత్రప్రాప్తి లభిస్తుంది.
పరిహారాలు :
1. పుత్ర దోషం కలవారు నాగ విగ్రహ సమేతంగా గల వేపచెట్టు, మర్రి చెట్టులను 41 రోజులు ప్రదక్షిణ చేయాలి. 41 వరోజు అర్చన చేయాలి.
2. వెండితో నాగ ప్రతిమను తయారు చేసి ఒక మండలం (41రోజులు) పూజచేసి శివాలయాల్లో సమర్పించటమో లేక హుండీలలో వేయటమో చేయాలి.
3. రామేశ్వరం, శ్రీ కాళహస్తి లాంటి పుణ్యక్షేత్రాలలో నాగదోష నివారణకు పూజలు చేసి పరమేశ్వరుని ధ్యానించటం ద్వారా పుత్రప్రాప్తి లభించటంతో పాటు పుత్రదోషం తొలగిపోతుంది
కుజ దోషము-పరిహారములు..................
ధరణీ గర్భ సంభూతం - విద్యుత్కాంతి సమప్రభం|కుమారం శక్తిహస్తం - తం మంగళం ప్రణమామ్యహం ||
అని మన పూర్వ మహర్షులు వర్ణించారు. ఇనుము,తుప్పు పొరతో నిండిన గోళం అని అందుకే కుజ గ్రహం ఎర్రగా ఉంటుందని అంటారు వైజ్ఞానికులు.మరి ఈ శ్లోకం అదే తెలుపు తున్నదికదా... ఎరుపుకి, ఇనుములోని శక్తికి అధిపతి అయిన కుజుడు గ్రహ రాజ్యంలో సైన్యాధ్యక్షుడు అని జ్యోతిషంలో శాస్త్రజ్ఞులు చెప్పారు.వినయంగా నమస్కరించే వారికి కోరికలు తీర్చే కల్ప వృక్షం కుజుడు. మంగళవారము కుజునకు చెందినది.ఎరుపు వర్ణము కలిగి, ఎరుపు వస్త్రములు ధరించి, శంఖంలాంటి మెడ, సుందరమైన పాదాలు, పొట్టేలు వాహనము, చేతిలో శులాయుధం కల మంగళుడు నిజంగా మంగలప్రదాయుడే. కేవలం గ్రహాల మంచి అయినా, చేదు అయినా వాణి పేరు బట్టి నిర్ణయించ కూడదు. కొన్ని అంశములు, వాటి స్తితి గతుల బట్టి నిర్ణయించాలి. కేవలం కుజుడే కాదు, ఏ గ్రహము అయినా సుభ, అశుభ ఫలితములు కలిగి ఉంటాయి. అలాగే శని ఇతర గ్రహాలూ కూడా..
మరి వివాహ విషయములో కుజగ్రహ దోషము గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తారు అంటే... స్త్రీల జతకములో కుజుని స్థానం బట్టి వరుని పరిగణిస్తారు. మాంగల్యం అనేసౌభాగ్యము స్త్రీలకు సంబంధించినది కావటంవల్ల కుజదోషం వివాహాల విషయంలో చూడటం సంభవిస్తున్నది. మరి ఈదోషం పురుషులకు పురుషులకు కూడా అప్పదించి కుజ దోషం కల స్త్రీకి కుజదోషం కల పురుషునికి వివాహం చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు, జాతక పొంతనాలు చూడకకుండ చేసిన సరికాదు. ఇక్కడ వివాహ కారకుడు అయిన శుక్రుడు కుజునికి శత్రువు. శాస్త్రరిత్య వివాహ కారకుడు అయిన శుక్రుడు ప్రమాద రహిత స్తానాలలో ఉండుట ఉత్తమం.
కుజ దోషంగా చెప్పబడే స్థానాలు: రెండవ ఇంట, నాలుగవ ఇంట, ఏడవ ఇంట, ఎనిమిదవ ఇంతద, పన్నెండవ ఇంట కుజుడు ఉండకూడదని.
కాని కుజనక్షత్రాలలోగాని, రాశులలోగాని, ఉచ్చ రాశులలోగాని, కుజ దోషం ఉండదు. అల్లానే, బుధ, రవి, గురు దృష్టులు ఉంటె దోషము ఉండదు. అవి పరిశీలించి, జాతక పొంతనలు చూసి వివాహము చేయాలి. అలా చేయనిచో భార్య,భర్తల అన్యోన్యత లోపించుట, తరచుగా కలహాలు, భర్తకు నీచ సంబంధము లుండుట, దాంపత్య సుఖము లోపించుట, భర్త నిర్వహించావలైన బాధ్యతలకు దూరంగా సన్యాసి మనస్తత్వము కలిగి ఉండుట,సంతన హీనత , దుర్వర్తనం, ఇళ్ళ సంసారంలో అనేక లోపాలు ఉంటాయి కాబట్టి కుజ దోషం గురించి వివాహాలలో తరచి చూడటం జరుగుతుంది. ఏయే గ్రహాలతో ఉంటె ఏయే ఫలితాలోగుడా చెప్పబడింది
వీటి గురించి అనేక పరిహారాలు శాస్త్రం నందు చెప్పబడినాయి కావున భయ పడవలసిన అవసరం లేదు.ఈ పరిహారక క్రియలు సమస్య యొక్క స్వరూపం బట్టి,జాతక పరిశీలనా చేసిన తరువాత చేయ వలసి ఉంటుంది. ఈ పరిహారాలు అందరికి ఒకలాగేనే ఉండవు. ఈ పరిహారాలు ఎవరికీ వారు ఆచరిస్తేనే మంచిది వ్యక్తి చేయలేని పరిస్తితిలో ఇంకా ఎవరైనా చేయవచ్చు. పరిహరక క్రియ ఏదైనా మనస్సు కేంద్రీకరించటం,నమ్మకము,విశ్వాము, భగవంతునికి సంపూర్ణ సమర్పణ ఉండాలి.భగవంతుడే ఈ క్రియలు జరుపుతున్నడన్నా భావన రావాలి. ఎవరికీ ఏది వీలు అయితే దాని ఆచరించచ్చు కుజగ్ర దోష శాంతి విధానాలు చెప్పబడినాయి.
· సుభ్రహ్మన్యస్వామి కుజుని అధిపతి కావున అయన షష్టి నాడు సుబ్రహ్మన్యష్టకం ఏడు సార్లు పారాయణ చేయాలి.
· ఏడు మంగళ వారాలు ఉపవాసం ఉంది కుజ గాయత్రి డెభై సార్లు పారాయణం, చేసి ఆఖరి వారము కందులు దానం ఇవ్వాలి.
· కుజ శ్లోకం ప్రతి రోజు డెభై మార్లు పారాయణం చేయాలి. కుజ జపం చేయించి కందులు ఒకటింపావు ఎర్రని వస్త్రములో మూట కట్టి దక్షిణ, తాంబూలాలతో దాన మివ్వాలి.
· స్త్రీలు పగడపు మాల, ఎర్రని వస్త్రాలు, ఎర్రగాజులు, కుంకుమ ధరించి ఎర్రని పూలతో పూజించాలి.
· ఎర్రని పండ్లు, ఎర్రని వస్త్రాలు దానం చేయటం అదియును సుబ్రహ్మణ్య స్వామీ ఆలయంలో ఇచ్చిన మంచి ఫలితము ఇస్తుంది.
· ఎడమ చేతి ఉంగరం వేలికి వెండిలో పొదిగిన పగడపు ఉంగరము ధరించాలి.సుబ్రహ్మణ్య ఆలయాలు స్తుతి, అష్టకాలు నిరంతరం చేయాలి.
· ప్రతి రోజు సుబ్రహ్మణ్య, దుర్గ, గణపతి స్తోత్రాలు చేయచ్చు.
· పిల్లలు లేని దంపతులు ఏడు ఆదివారాలు డెభై ప్రదక్షిణాలు చొప్పున చేయాలి.
· షష్టి, సుబ్రహ్మణ్య షష్టి, కృత్రిక నక్షత్రం వచ్చిన రోజున ఏడు మంగలవారాలు ఆవు పాలతో అభిషేఖం చేయాలి.
· కుజ దోషం పరిహారార్థం బలరామ ప్రతిష్టిత పంచలింగాల క్షేత్ర దర్శనం (నాగావళి నదీ తీరంనండు)
· కుజ కవచం, మంత్రం, స్తోత్రం, అష్టకం, అష్టోత్తరం,కుజ మంగలాష్టకం మొదలైనవి చేయాలి.
· రామాయణంలో కుజ దశ అంతర్దశ లకు పారాయణ ఘట్టాలు చెప్పబడినాయి.,
·
· కుజదోషము నివారించుటకు రామాయణములో చేయదగు పారాయణ క్రమములు:
· కుజదశలో కుజుని అంతర్దశకు....ఉత్తరకాండ ఇరవై ఆరవ సర్గ పారాయణ, కందిపపు పొంగలి, బెల్లం నైవేద్యము.
· కుజ దశలో రాహు అంతర్దశకు -- యుధకాండ యాభై ఎనిమిదవసర్గ, తేనే న ఎండుద్రాక్ష నైవేద్యము.
· కుజ దశలో కేతు అంతర్దశకు-- యుధకాండ నూట పదహారు సర్గ , ఖర్జూరం, కొబ్బరికాయ నైవేద్యము
· కుజ దశలో శని అంతర్దశకు -- అరణ్యకాండ డెభై వ సర్గ -- నేరేడు, నల్లద్రాక్ష నైవేద్యము.
· కుజుదశలో బుధ అంతర్దశ --- బాలకాండ పదహారవసర్గ -- ఆకుపచ్చ ద్రాక్ష, తాంబూలం.
· కుజు దశలో గురు అంతర్దశ -- సుందర కాండ యాభై ఒకటి సర్గ--- అరటిపండ్లు నైవేద్యము.
· కుజ దశలో శుక్ర అంతర్దశకు --- సుందరాకాండ యాబై మూడు సర్గ -- పాతిక బెల్లం, కారెట్.నైవేద్యం
· .
· కుజ దశలో రవి అంతర్దశకు --- బాలకాండ ఇరై మూడు సర్గ -- చామ కారెట్ దుంప నైవేద్యము.
· కుజదశలో రవి అంతర్దశకు --- బాలకాండ పదిహేడవ సర్గ-- పాలు, పాయేసం నైవేద్యము
· కుజ గ్రహ దోషానికి మామూలు పరిహారములు:
· సింధూర వర్ణ ఆంజనేయ స్వామికి ఏడు మంగళ వారములు ప్రదక్షిణాలు చేయాలి
· ఎర్రని పుష్పాలు మాల సుబ్రహ్మణ్య, ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి అలంకరించాలి.
· బెల్లం కలిపిన యెర్రని కందిపప్పు గోవుకు తినిపించాలి.
· మంగళవారము రోజున ఎర్రని కుక్కకు ఆహారం వేయాలి.
· స్త్రీలు ఏడు మంగలవారాలు ఏడుగురు ముతైదువులకు ఎర్రని పూలు , ఎర్ర జాకెట్, ఎర్ర గాజులు, ఎర్ర కుంకుమ, దానం చేయాలి.
· ఎర్ర చందనం, కందులు, ఎర్ర మేక, దానిమ్మ పండ్లు ఎర్రవస్త్రాలలో కట్టి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో వీలు అయితే, లేదా ఇన్న్తి వద్ద అయిన సరే దానం ఇవ్వాలి.
· కోతులకు తీపి పదార్థములు తినిపించాలి.
· రాగి పాత్రలో నీరు తాగటం, రాగి పాత్రలు వాడటం మంచిది.
· పోట్లకాయలు తరగటం, మంచిది కాదు.
· రక్త దానము చేయుట చాల మంచిది.
· అమ్మవారికి (దుర్గ) ఎర్ర చీర సమర్పించటం, నవగ్రహ గుడిలో కుజ విగ్రహం వద్ద ఎర్రపులతో పూజ పగడ దానం, ఎర్రరవికలగుడ్డ దానం మంచిది.
· కుజుని అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉంది, కండి పప్పుతో చేసిన పదార్ధాలు తినాలి.
· రాగిపళ్ళెంలో కందులు, కందిపప్పు పోసి దక్షిణ తామ్బులంతో మంగళవారం మధ్యాహ్నం ఒక యువకుడికి దానం చేయాలి.
· కుజగ్రం వల్ల కలిగే రోగములకు ఎర్రటి కుండలో అన్నం వండి, ఎర్రవస్త్రంలో మూట కట్టి, దాని మీద దీపం వెలిగించి రోగికి దిష్టి తీసి కుక్కలకు అన్నం పెట్టుట ద్వార నయం అవుతుంది. కాని డాక్టర్ దగ్గర మందులు మానేయ కూడదు.
· కుజుడు అన్నదమ్ములకు కారకుడుగా చెప్తారు, మూడవ ఇంట్లో ఉంటె ఎన్నో చిక్కులు వస్తాయి. ఏనుగు దంతం వస్తువు ఇంట్లో దక్షిణం పక్క ఉంచి కుజుని ఆరాధించాలి.
· ఏడు, ఎనిమిది స్థానాలలో కుజుడు ఉంటె డబ్బు ఉన్న సుఖము ఉండదు, అందుకని ఏడు మంగళ వారాలు సిరా స్నానం చేసి దక్షిణ దిశలో మూడు వాతుల దీపం వెలిగించి సాయంకాలాలు కుజ స్తోత్రము, సుబ్రహ్మణ్య పారాయణం చేయాలి, ఉపవాసం ఉండి కందిపప్పుతో తాయారు చేసిన ఆహారము తీసుకుంటే భార్య భర్తలు గూడా సంతోషంగా ఉంటారు, సమయాని డబ్బు అందుతుంది.
· కుజుని వలన స్వర పేటికకు సంబంధించిన వ్యాధులు వ్దస్తే మంగళ వారం, క్రుత్హిక నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించి గంట, దీప దానము చేసిన సమస్య తొలగును.
· వివిధ భావాలలో కుజదోషం ఉంటె తీసుకోవలసిన జాగ్రతలు:
· భావము: వీరు అబద్ధములు ఆడకూడదు, దంతముతో చేసిన వస్తువులు ఇంటిలో ఉంచరాదు, ఏ వస్తువైనా దానం teesukoraadu
· భావము: వీరు ఆర్థిక బాధలతో బాధలు పడుతుంటే (కుజుడు బలహీనుడు అయితే) ఒక ఎర్రరుమాలు జేబులో ఉంచు కోవాలి, ఆరు మంగళ వారాల పాటు చిన్నపిల్లలకు బెల్లము, గోధుమతో చేసిన తీపి పదార్థములు తినిపించాలి.
· భావము: వీరు ప్రయాణాలలో జాగ్రతలు పడాలి, పొరుగు వారితో గొడవలు పెట్టుకోరాదు, వెండి ఉంగరంలో పగడం వేసి ఎడమ చేతికి ధరించాలి.
· భావము: వీరు పంచదార, తీపి వ్యాపారము చేయాలి, కోతులకు, సాధువులకు, తల్లిగారికి భోజనములు పెట్టాలి.
· భావము: వీరు రాగి చెంబులో నీరు పోసి నిద్రిచే ముందు తల వైపు పెట్టుకుని, ఉదయమే అనీరు పచ్చని చెట్టులో పోయాలివేప చెట్టు దక్షిణం వైపు నాటాలి..
· భావము: అంగారక మంత్రము జపించాలి, ఇందుప వస్తువులు ఇంట్లో పెట్టుకో కూడదు, పడిన వస్తువులు ఇంట్లో ఉంచరాదు.
· భావము: మరదలు, పిన్ని, అక్క, చెల్లెలు, అత్తా వీరిని గౌరవించాలి, తీపి తినిపిస్తూ ఉండాలి, వారిచే తిట్టించుకో కూడదు.
· భావము: నాలుగు, ఆరు భావాల్లోని రేమేడీలు చేసుకోవాలి, విధవ స్త్రీల ఆశీర్వాదం తీసుకోవాలి.
· భావము: కుడిచేతి ఉంగరం వేలికి వెండి పగడపు ఉంగరము ధరించాలి, వదినగారిని గౌరవించాలి, ఎర్రగుడ్డ జేబునండు పెట్టుకోవాలి, అన్నగారు చెప్పినవి చేయాలి.
· భావము: ఆఫీసులో కాని, వ్యాపార స్థలమునందు కాని సుబ్రహ్మణ్య స్వామీ ఫోటో తగిలించండి, పగడము ఉంచండి, పాలు పొంగి పొయ్యిలో పదనీకండి.
· భావము: చిన్న మట్టి పాత్రలో తెనేకాని, సిన్దురంకాని వేసి ఉంచండి
· భావము: ఉదయము పరగడుపున తేనే తాగండి, సుబ్రహ్మణ్య స్వామీ ఫొటోకు ధూప, దీప, నైవేద్యములు సమర్పించండి.
· -- ఇవి అన్ని రోజులు పాటించవలసిన నియమములు
కుజ దోషం నివారణ మార్గం - ఏది ఎలా ఎప్పుడు చేయాలి.........?
మన పురాణాలలో కుజ గ్రహం ను,అంగారకుడు అని,మంగళుడు అనే నామాలు ఉన్నాయి.అలాగే కుజుడు భూమి పుత్రుడు అని కూడా తెలుసు..ఒక సారి కుజుడు తన తల్లి తండ్రుల అనుమతి తీసుకోని వినాయకుడి గురించి తపస్సు చేయడానికి నర్మదా నది తీరంలో ఒక ప్రదేశంను ఎంచుకొని నిరాహారంగా 1000 సంవత్సరాలు గణపతి గురించి తపస్సు చేసినాడు.అలా 1000 సంవత్సరాలు కుజుడు తపస్సు చేసినా తరువాత మాఘ బహుళ చవితి చంద్రోదయం నాడు వినాయకుడి ప్రతక్ష్యమయ్యాడు.అలా ప్రతక్ష్యమైన వినాయకుడు ఎలా ఉన్నాడు అంటే దశా భుజాలు కలిగి బాలుడి గా ఉన్నాడు.అదే విధంగా వినాయకుడి తలమీద ఒక చంద్ర వంక కూడా ఉన్నది.
వినాయకుడు,అంగారకుడు తో ఇలా అన్నాడు." నీ తపస్సుకు మెచ్చితిని నీకు ఏమి వరం కావాలో అని కోరుకొమ్మన్నాడు.అప్పుడు అంగారకుడు ఎంతో సంతోషించి ఆ వినాయకుడిని ఎన్నో విధములుగా స్తుతించాడు.అలా ప్రతక్ష్యమైన వినయకుడ్నిని అంగారకుడు తనకు " అమృతం" కావాలని,అదే విధంగా నేను ఎప్పడు నీ నామ స్మరణ చేస్తుండాలని అని వరమియమని అంగారకుడు కోరుకొన్నాడు అప్పుడు వినాయకుడు తదాస్తు అని దీవించి ,నీవు ఎర్రని రంగులో ఉన్నావు ఎర్రని వస్త్రం కట్టుకోన్నావు,ఈ దినం మంగళవారం.కనుక ఇక నుంచి నీ పేరు మంగళుడు అని వరం ఇచ్చి వినాయకుడి అంతర్ధానం అయ్యాడు.ఆ తర్వాత అంగారకుడు(మంగళుడు) అమృతం ప్రాప్తిస్తుంది
అమృతం సేవించిన తరువాత కుజుడు(మంగళుడు) ఒక ఆలయం కట్టించి అందులో వినాయకుడిని ప్రతిష్టించి ,ఆ వినాయకుడిని శ్రీ మంగళమూర్తి అని పేరు పెట్టాడు.ఈ ఆలయం ఇప్పటికి మన భారత దేశంలో ఉంది.అదేవిధంగా వినాయకుడు ఇంకొక వరం కుజుడికి ప్రసాదించాడు. ఎవరైతే అంగారక చతుర్ధి రోజు( బహుళ చతుర్ధి ,కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధి లేదా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధి రోజు) మంగళవారం రోజున ఉపవాసం ఉండి వినాయకుడికి భక్తి శ్రద్దలతో పూజచేస్తారు వారికీ ఉన్న అన్ని కుజగ్రహ దోషాలు అన్ని తొలగిపోతాయి.అని వరం ప్రసాదించాడు అలాగే వినాయకుడి అనుగ్రహం కూడా కలుగుతుంది.ఈ పూజా ఫలం ఎటువంటిది అంటే ఒక సంవత్సరం సంకష్టి వ్రతం అంటే ఒకక్క నెలలో ఒక చతుర్ద్ది వస్తుంది..అలా 12 నెలలు ఎవరు వ్రతం చేస్తారో?అలా చేయడం వల్ల ఎలాంటి పుణ్య ఫలం వస్తుందో ఈ ఒక్క అంగారక చతుర్ధి రోజున చేసీ వినాయకుడి వ్రతం వల్ల కలేగే ఫలితం సమానం..అలాగే అన్ని దోషాలు,ముఖ్యంగా కుజ దోషాలు సంపూర్ణంగా నివారించాబడతాయి.
శుభం. మంగళంమహత్........... శ్రీ....శ్రీ....శ్రీ....శ్రీ....శ్రీ....శ్రీ.....శ్రీ....శ్రీ...శ్రీ.

Sunday, 22 October 2017

నాగులచవితి విశిష్టత........

నాగులచవితి విశిష్టత........
నవనాగ నామ స్తోత్రం
అనంతం వాసుకిం శేషం పద్మనాభంచకంబలమ్
శంఖపాలం ధార్తరాష్ట్రం తక్షకం కాళీయం తధా!
ఏతాని నవ నామాని నాగానాంచ మాహాత్మనాం
సాయంకాలే పఠేనిత్యం ప్రాతః కాలే విశేషతః
తస్మై విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్!!
నాగారాధన తో చెవి, చర్మ సంబంధ వ్యాధులు పోతాయని, సంతానం కలుగుతుందని ఓ నమ్మకముంది. కొన్ని వ్యాధుల నిర్మూలనలో సర్ప విషం విలువ తెలిసిందే. ఇంతటి సామాజిక ప్రయోజనం ఉన్నందువల్లనే ఒక ప్రాంతం, ఒక దేశమని కాకుండా నేటికీ చాలామంది సర్పారాధన చేస్తున్నారు. ప్రాణులన్నిటా పరమాత్మ ఉన్నాడని, ఏ ప్రాణి నీ అనవసరం గా భాదించకూడదని, దేనివల్ల జరగాల్సిన మేలు దానివల్ల జరుగుతూనే ఉంటుందని తెలియజెప్పే ఓ సందేశం తో సర్ప పూజ ఆచరణ లోకి వచ్చిందని పూర్వులు చెబుతారు. నాగ దేవతలను ఆరాధించే సంస్కృతీ ప్రపంచవ్యాప్తం గా పలు ప్రాంతాలలో ఉంది. అందరు జరుపుకోనేది ఒకే కారణానికి, కాని ఆచరించే విధానాలు వేరుగా ఉంటాయి.కొన్ని వేదమంత్రాల్లో సర్పమంత్రాలు ప్రత్యేకంగా ఉన్నాయి. గుళ్ళు గోపురాలు, విగ్రహాలు లేనప్పటి నుండి కూడా నాగ పూజలను ఆచరించే వారు. ప్రకృతి తో పాటు గా నాగారాధన అనాదిగా వస్తున్న ఆచారం. మన తెలుగునాట ముఖ్యం గా శ్రావణ శుద్ద చవితి, పంచమి నాడు, కార్తీక శుద్ద చవితి, పంచమి నాడు ఈ నాగ పూజను విశేషం గా జరుపుతారు.
నాగుల చవితి, పంచమి గురించి పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి. గ్రీష్మ వర్ష ఋతువులలో సర్వ సాధారణం గా పాములు బయట సంచరించవు. శరదృతువులో ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి పాములు బాగా స్పందించి సంచరిస్తూ ఉంటాయి. అందుకే ఈ కాలం లోనే నాగులను పూజించడం ఆచారం గా చెప్పబడింది. శ్రావణ మాసం లో వర్షాల వల్ల పుట్టల నుంచి పాములు వెలుపలికి వచ్చి బాదిస్తాయి, కావున నాగ పూజ వర్షాకాలం లో ప్రాధాన్యత ను సంచరించుకుంది.
వాసుకి, తక్షకుడు, ఐరావతుదు ధనుంజయుడు, కర్కోటకుడు, అనంతుడు, శేషుడు వీరిని సర్ప జాతికి మూల పురుషులుగా పురాణాల ద్వారా తెలుస్తుంది. వీటిలో వాసుకి, అనంత, శేష సత్వగుణ ప్రధానులు, ఐరావత ధనుంజయ,శంఖపాల రజోగుణ ప్రధానులు, తక్షక కర్కోటక తమోగుణ ప్రధానం గా గలవారు.
ఆదివారం నాడు తక్షకజాతి ,సోమవారం నాడు శంఖపాల జాతి , మంగళవారం నాడు కర్కోటక జాతి, బుధవారం నాడు వాసుకి,గురువారం ఐరావత జాతి, శుక్రవారం ధనుంజయ జాతి, శనివారం శేష జాతి సర్పాలు విషపూరితమై సంచరిస్తాయి. ఆయా జాతి సర్పాలు కాటు వేసినప్పుడు ప్రాణులు జీవించడం కష్టతరమవుతుందని, మిగిలిన వారాలలో అన్య జాతి సర్పాల కాటువల్ల ప్రాణాపాయ స్థితి నుండి బయటపడవచ్చని తెలుస్తోంది.
మనిషి పుట్టుకకు ముందు, తర్వాత కలిగే జన్మల రహస్యాలను ఇముడ్చుకొని ఉంటుందని పూర్వుల మాట. గత జన్మ లో సర్పశాపం ఉంటే ఈ జన్మలో సంతాన హాని అనుభవిస్తారని పరాశర మహర్షి స్వయం గా తెలియజేసాడని పురాణాల ఆధారం గా తెలుస్తోంది. ఈ కారణంగానే కాల సర్పదోషం ప్రాప్తిస్తుంది. జాతకాన్ని పరిశీలించినట్లయితే, జాతకుని కుండలి లో రాహు కేతువుల మధ్య గ్రహాలు ఉండడాన్ని కాల సర్ప దోషం గా పరిగణిస్తారు. ఈ దోషం ఉన్న వారికి, జీవితం లో కొన్ని అనుకోని ఊహించలేని మార్పులు జరుగుతుంటాయి. దీని పరిహారినికి మనకున్న నివారణోపాయలలో నాగ ప్రతిష్ఠలు , నాగులచవితి ,నాగ పంచమి రోజున చేసే పూజలు ప్రాధాన్యమైనవి. నాగుల చవితి నాడు ఉపవాసముండి పంచమి నాడు నాగ ప్రతిమకు శక్తి కొలది పంచామృతాలతో విధివిధానం గా మంత్రోపచారాలతో సుగంధభరిత పుష్పాలు, జాజి, సంపెంగ వంటి వాటితో పుట్టకు పాలు, చలిమిడి, వడపప్పు, నువ్వులతో చేసిన చిమ్మిలి, క్షీరాన్నం మొదలైనవి నైవేద్యం గా సమర్పించి నాగదేవతను భక్తిశ్రద్దలతో పూజిస్తే కాలసర్ప దోషాలు, రాహుగ్రహ దోషాలు, నాగ దోషాలు ,సర్వ దోషాలు తొలగుతాయని శాస్త్ర వచనం, ముఖ్యం గా సంతానం కలగకపోవడం, ఆలస్య వివాహం, భార్యాభర్తలు విడిపోవడం, దాంపత్య సౌఖ్యం లేకపోవడం, చిన్నతనంలోనే వైధవ్యం ప్రాప్తించడం వంటి ప్రధాన సమస్యలన్నీ నాగ దోషాల వల్ల కలిగేవే. ఇటువంటి సమస్యలతో తీవ్రం గా బాధపడుతున్నవారు ఈ విధానాలని ఆచరించి సత్ఫలితాలని పొందవచ్చు. దోషం తీవ్రం గా ఉన్న జాతకులు మంగళవారం కాని, ఆదివారం నాడు కాని ఉపవాసముండి నాగ దేవతాలయం చుట్టూ లలితా సహస్రనామం చదువుతూ ప్రదక్షినచేయడం ద్వారా, శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించి దుర్గా దేవి ని పూజించడం ద్వారా, నాగ సూక్తము చదవడం ద్వారా దోష నివారణ కలుగుతుంది.
నాగ శిలలను గ్రామ సమీపం లో చెరువు, నది, రావి మారేడు చెట్ల కింద ప్రతిష్టిస్తారు. ముఖ్యం గా రామేశ్వరం వంటి పుణ్య క్షేత్రం లో ప్రతిష్టించడం సర్వ శుభప్రదం. శ్రీ రామ చంద్రుడు తనకు ఉన్న శుక్రవంక నష్టరేఖ, కాల సర్ప దోషాల నివారణ కోసం కల్పం లో చెప్పినట్లు రామేశ్వరం లో నాగ శిలలను ప్రతిష్టించాడని పురాణ ప్రతీతి. ప్రతిష్ఠ జరిగిన శిలల పై మారేడు, రావి దళాల నీడ, ఆకులు, వర్షపు నీరు ఎండిన ఆకులు పడినంత మాత్రాన అభిషేక ఫలం దక్కుతుందని పురాణ వచనం.

కాలసర్పయోగ ( దోష ) ఫలితాలు........

కాలసర్పయోగ ( దోష ) ఫలితాలు........
1. జ్ఞానదృష్టిలేకపోవటములేకమెదడుసరిగాఎదగకపోవడమువల్లఅవమానాలు ( లేక ) అపార్ధాలుచేసుకోవడము.
2. జన్మించినసంతానమునకుబుధిమాంద్యముకలుగుట.
3. గర్భములోశిశువుమరణించుట .
4. భార్యభర్తలమధ్యసక్యతలేకపోవుట ( లేక ) వైవాహికజీవతంలోఅసంతృప్తి.
5. మరణించినశిశువుకలుగుట.
6. గర్భమునిలవకపోవడము, విచిత్రమయినరోగములుకలగడము.
7. అంగవైకల్యముసంతానముకలగడము, వాహనప్రమాదాలు.
8. శస్త్రచికిచలువిపలము అయిమరణించడంజరుగుతుంది.
9. వృషణములవ్యాధులు , వ్యసనాలకుభానిసలుకావడము.
10. వీర్యకణములునశించుట, నసుపుకత్వముఏర్పడుట.
11. కాన్సర్, సిఫిలిస్ , హెర్నియా , ఎయిడ్స్ , ముత్రసంబందమయినరోగములుకలగడము.
12. వంశవృదిలేకపోవడము, కుటుంబములోప్రేమఅభిమనములుతగిపోవడము.
13. శత్రువులవలనమృతిచెందడము, సంతానముశత్రువులుగామారడము.
14. మానసికశాంతిలేకపోవడము, విషజంతువులవల్ల, జలప్రమాదములవల్లమరణించడం.
15. అవమానాలులేకఅపనిందలవల్లమరణించడం, పరస్రిసంపర్కము.
16. రునగ్రస్థులుఅగుటహామీలుఉండుటజరుగును.
జాతకునిజన్మకుండలిలోరాహుకేతువులమద్యమిగిలినఅన్నిగ్రహాలువచ్చినచొదానినికాలసర్పయోగంఅనిఅంటారు. దీనిలోచాలరకాలువున్నాయి. వాటివాటిస్తితులనుబట్టివాటికిపేర్లునిర్ణయంచెయ్యటంజరుగుతుందిదానిప్రకారమేకాలసర్పయోగంవలనకలిగేఫలితంకూడానిర్ణయంచెయ్యబడుతుంది.
వివిధరకాలకాలసర్పయోగములు
1.)అనంత కాల సర్ప యోగము
2.)గుళికకాలసర్పదోషం
3.)వాసుకికాలసర్పదోషం
4.)శంక పాల కాలసర్పదోషం
5.)పద్మకాలసర్పదోషం
6.)మహాపద్మకాలసర్పదోషం
7.)తక్షకకాలసర్పదోషం
8.)కర్కోటకకాలసర్పదోషం
9.)శంఖచూడకాలసర్పదోషం
10.)ఘటకకాలసర్పదోషం
11.)విషక్త, లేక విష దానకాలసర్పదోషం
12.)శేషనాగకాలసర్పదోషం
అనంత కాల సర్ప యోగము
జన్మ లగ్నము నుండి సప్తమ స్థానము వరకు రాహు కేతు గ్రహముల మధ్య మిగతా గ్రహములు
( రవి ,చంద్ర ,కుజ ,బుధ ,గురు ,శుక్ర, శని ). వుంటేదీనినిఅనంతకాలసర్పయోగముఅంటారు.
ఫలితాలు: కుటుంభసమస్యలు, దీర్గరోగాలు, వైవాహికజీవతంలోఅసంతృప్తి, మానసికశాంతిలేకపోవడము, రునగ్రస్థులుఅగుటహామీలుఉండుటజరుగును.
గుళికకాలసర్పదోషం:
మాములుగాఇదిజాతకచక్రంలోరెండోవ ఇంటప్రారంభంఅయ్యిఎనిమిదొవ ఇంటసంమప్తంఅవుతుంది.
ఫలితాలు:ఆర్ధికమరియుకుటుంభఇబ్బందులు, . భార్యభర్తలమధ్యసక్యతలేకపోవుట ( లేక ) వైవాహికజీవతంలోఅసంతృప్తి, మిత్రులవలన విరోదములు కలుగును.
వాసుకికాలసర్పదోషం:
మూడోవ ఇంటమొదలయితొమ్మిదొవ ఇంటసమాప్తం.
ఫలితాలు: అన్నదమ్ములకలహాలు, సమస్యలు, బందువులవలనసమస్యలుఎకువగావుంటాయి
ఉద్యోగములోబాధలు, పదోనతిలోఆటంకాలు, ఉద్యోగమువుదిపోవటంజరుగును.
శంక పాల కాలసర్పదోషం:
నాలుగోవ ఇంటమొదలయిపదవ ఇంట సమాప్తం.
ఫలితాలు: తల్లివలనలేదాతల్లికిసమస్య, వాహనగన్డం, నివాసస్తలసమస్యలు, విద్యలోఆటంకములు, ఉద్యోగ, వ్యాపారములలోలాబములులేకపోవుట.
పద్మకాలసర్పదోషం:
అయిదోవ ఇంటప్రారంభమయిపదకొండవ ఇంటసమాప్తం.
ఫలితాలు: జీవితభాగస్వామితోకానిపిల్లలతోకానిసమస్యలు విచిత్ర వ్యాదులు రావడము, వ్యసనముల వల్ల భారి నష్టాలు రావడం, భార్య భర్తల మధ్య అనుమానాలు తలేతడం, ధనము ఖర్చుఅగుట, శత్రువుల వలన జైలుకు వెల్లడము, కష్టాలు కలుగును, బాల్యము నుండీ బాధలు కలుగును.
మహాపద్మకాలసర్పదోషం:
ఆరవ ఇంటప్రారంభంఅయ్యిపన్నెండవ ఇంటసమాప్తం.
ఫలితాలు: ఆరోగ్యసమస్య, అప్పులబాధ, శత్రుబాధ, భార్యభర్తలుఅనుకూలముగాలేకపోవడము, జీవితాంతమురోగములవలనబాధనిరాసయకువగాఉండును. వ్రుధాప్యములోకష్టాలుకలగడము, శత్రువులతోపోరాడటం, గృహమునందుఅసంతృప్తికలుగుతుంది.
తక్షకకాలసర్పదోషం:
యేడవ ఇంటప్రారంభంలగ్నము ఇంటసమాప్తం.
ఫలితాలు: వ్యాపారము లో చిక్కులు, పిత్రార్జితం ఖర్చు చేయడము, పుత్ర సంతానము లేదని బాధ పడటము, జీవిత భాగస్వామి తో సమస్యలు, పర శ్రీ సంగమము, శత్రు పీడా, అనారోగ్యం కలుగును.
కర్కోటకకాలసర్పదోషం:
ఎనిమిదొవఇంటప్రారంభంరెండోవ ఇంటసమాప్తం.
ఫలితాలు: వైవాహికజీవతంలోఅసంతృప్తి, అకాల మరణము, మోసములకు గురికావడము, దీర్గ రోగములు, ఆపరేషన్లు, ఎంత కష్టపడిన పలితము దక్కదు. జీవితములో అన్ని ఆలస్యముగా జరుగుతాయి, మంచి ఉద్యోగము దొరుకుట చాల శ్రమ చేయవలసి వస్తుంది, విపరీత ధన నష్టము జరుగును.
శంఖచూడకాలసర్పదోషం:
తొమ్మిదొవఇంటప్రారంభంవమూడోవ ఇంటసమాప్తం.
ఫలితాలు: అత్యంతదురదృష్టస్తితి, దేవునియందుభక్తిలేకపోవడము, తండ్రి, గురువులతోవిరోధము, వ్యవసాయమునందుఅధికముగాశ్రమించిననష్టములుకలుగును. అవమానములు, బాధలు, ధనమునందుఅసంతృప్తికలుగును.
ఘటకకాలసర్పదోషం:
పదవఇంటప్రారంభంనాలుగోవ ఇంటసమాప్తం.
ఫలితాలు: వ్యాపారమరియుఉద్యోగసమస్యలు, తల్లితండ్రులకుదూరముగానివసించదము, మిత్రద్రోహులు , వ్యాపారలావాదేవులలోనష్టము, సంతానదోషములుకలుగును.
విషక్త, లేక విష దానకాలసర్పదోషం:
పదకొండవఇంటప్రారంభంఅయిదోవ ఇంటసమాప్తం.
ఫలితాలు: ఆర్ధికమరియువ్యాపారకష్టాలు, నేత్ర సంబంధ రోగములు , సోదరులు , మిత్రులతో తగాదాలు, గృహమును విడచి పరదేశములో నివసించదము, కోర్టు వ్యవహారములలో తల దుర్చడం, రహస్య విషయాలు గోప్యముగా ఉంచడము జరుగును.
శేషనాగకాలసర్పదోషం:
పన్నెండవఇంటప్రారంభంఆరవ ఇంటసమాప్తం.
ఫలితాలు: ఎక్కువఖర్చులు, శత్రుబాధలు కోర్టు వివాదాలు , అవమానాలు, ప్రాణభయము, అధిక ఖర్చులు.
ని సంతానయోగములు
కుజుడు పంచమములొ వుంది ఆ పంచమం శని రాశి గాని శని నవంసము గాని ఆ శనికి సప్తమా ద్రుష్టి కలిగి వుంటే సంతానము కలగదు.
పంచమములొ శని లేక రాహువు వుంది పాప గ్రహ ద్రుష్టి వున్నచొ సంతానము కలగదు.
పుత్ర స్థానమునందు రవి, కుజ రహువులు మరియు శని బలముగా వుంది పుత్ర కరక గ్రాహం బలహీనముగా వున్నా సంతానము కలగదు.
పంచామదిపతి నీచలో వున్నా పంచమ స్థానము కర్కాటక రాశిలో కుజుడు వున్నా సంతానము కలగదు.
పంచామదిపతి ఆస్థాన్గాతుడు అయి వుంది బుధుడు సమ రాశిలో ఉన్తే సంతానము కలగదు.
గురువు, లగ్నాధిపతి , సప్తమాధిపతి, పంచామదిపతి నిబలురు అయిన ఆ జాతకులకు సంతానము కలగదు.
శని షష్టమాదిపతి 6 వ బావమునందు, చంద్రుడు సప్తమ భవమునన్దున్న జాతకులకు సంతానము కలగదు
మేష రాశి లో గురువు మరియు బుధుడు వుంది మేషరాసి పంచమ భావము అయినచో సంతానము కలగదు.
కుజుడు మరియు శని చతుర్ధము లో ఉంటే సంతానము కలగదు.
చంద్రుడు 10 లో శుక్రుడు 7 లో 4 లో పాపులు ఉన్నచో సంతానము నశించును.
లగ్న , పంచమ, నవమదిపతులలో యవరికయినాను కుజ, శనుల సంబంధము, అష్టమాదిపతి సంబందము కుడా ఉన్నచో సంతాన నష్టము కలుగును.
గురువు పంచమదిపతి పాపుల మధ్య నున్నను , సష్ట,వ్యమాది పతులు అప్తంగాతది దోషములు ఉన్నచో సంతానము కలగదు.
వృచిక లగ్నమునందు గురు సుక్రులు లేక శని బుధులు ఉన్నచో సంతానము కలగదు.
పంచమ స్థానము నందు గురువు వుండి ఆ పంచమ స్థానము మేషము , కర్కాటక, మకర మరియు ధనుర్ లగ్నములు అయినచో సంతాన నష్టము కలుగును.
2, 5, 7 పతులు ఎవరయినా 6, 8, 12 స్థానములందు వుండి శత్రు గ్రహ మధ్య గతులయిన, పంచమధిపతి శత్రు, నీచ రాసులు అందుండగా మరియు 9 వ స్థానములో పాపులు వున్నాను సంతానము కలగదు.
సింహ , వ్రుచిక రాశుల వారికీ జన్మ లగ్న మునందు పాప గ్రహములు వుండి గురు, శుక్రులు కలసి వ్యయమునందు వున్నా సంతానము కలగదు
బుధుడు నుండి శని తను , పుత్ర , కళత్ర మరియు వ్యయభవములలొ ఉన్నచో సంతానము కలగదు.
పంచమది పతి వ్యయములో వుండి చతుర్ధ, దశమ భావదిపతులు తో సంబంధము యార్పడితే సంతానము కలగదు.
పంచమ స్థానములో రాహువు ఉంటే అల్ప సంతానము లేక సంతాన నష్టము లేక సంతానము లేకపోవడము జరుగును. శ్రీ సంతానము యకువగా ఉండును, మరియు రాహువు పయ్ పాపుల ద్రుష్టి వున్నా సంతానము కలగదు.
పంచమ స్థానములో కేతువు వున్నా పయ్ పలితములు కలుగును.
శ్రీ జన్మ రాశికి పంచమ రాశి లో పురుషుడు జన్మించిన సంతాన నష్టము.
పంచమదిపతి చంద్రుడు బుదునితో వ్యయము నందు గురువు అష్టమము నందు వున్నా సంతానము కలగదు.
అష్టమము నందు శని వుండి వాని దశ వచినపుడు పుత్ర నష్టము కలుగును.
పంచమదిపతి శని, రవితో కలసి మేషము నందుండి పంచమము కుజుని ద్రుష్టి కలిగిన సంతానము కలగదు.
సంతానము కలుగుట
పంచమదిపతి లగ్నది పతి సుభులతో కూడిన కేంద్రములందు వుండి ధనాధిపతి బలము కలిగి ఉంటే పుత్ర సంతానము కలుగును.
లగ్నది పతి పంచమము భావములో వుండి నవమదిపతి సప్తమ స్థానములో వుండి ద్వితీయ అధిపతి మరియు ధనాధిపతి లగ్నములో ఉంటే పుత్ర సంతానము కలుగును.
నవములో గురువు, గురునికి కేంద్రమున శుక్రుడు ఉంటే లగ్నాధిపతి బలముగా ఉంటే చాల ఆలస్యముగా సంతానము కలుగును.
పంచమదిపతి శని అయితే గురు, చంద్ర ద్రుష్టి ఉంటే స్వల్ప సంతానము కలుగును.
పంచమదిపతి పంచమునన్దు గులికుడుంది ఆ స్థానాధిపతి పంచమములొ వున్తెయ్ కవలలు సంతానము కలుగును.
ద్వితీయ , పంచామదిపతులకు కుజ, శని సంబందము ఉంటే సష్తమ స్థానము లందు గురువు ఉంటే శ్రీ సంతానము కలుగును.
రవిగాని , శని గాని సి గ్రహ రాశి అంశాలలో వుండగా బుధ ద్రుష్టి ఉంటే శ్రీ సంతానము కలుగును.
గురుని నవంసదిపతి కేంద్రములలో ఉంటే సంతానము కలుగును.
శని, కుజులు కలసి 4 వ స్థానము నందు ఉంటే దత్తపుత్రులు కలిగి వుంటారు.
పంచమ భావము నందు శని, చంద్రుడు శని నవంసము నందు ఉంటే దత్తపుత్రులు కలిగి వుంటారు.
లగ్న పంచామదిపతులకు పరస్పర ఒకరి రాశులందు ఒకరు వున్నాను జాతకుని పుత్రులు తండ్రి ఆజ్ఞను శిరసా వహిస్తారు.
పంచమదిపతి , నవమధిపతి కలసి వుండి ధసమధి పతి మహర్ధస జరుగు చున్నపుడు సంతానము కలుగును .
పంచమము కర్కాటకము అయి అందు చంద్ర, గురువులు వున్నా శ్రీ సంతానము ఎకువ .
లగ్న, పంచమది పతి , గురువు ముగ్గురు కేంద్ర కోణములన్దునను జాతకుడికి పుత్ర సంతానము కలుగును..
భాగ్యది పతి , భాగ్య మునందు వున్నాను సంతాన యోగము కలుగును .
పంచమములొ చంద్ర, శుక్రులు వుండి ఆ శుక్రున కు పంచమములొ బుధుడు వున్నా స్త్రీ సంతానము అధికము.
జన్మ లగ్నమునకు పంచమమున గురువు , గురువునకు పంచమమున శని, శనికి పంచమమున రాహువు వున్నాను పుత్ర సంతానము కలుగును
నవమ స్థానములో గురువు వానికి పంచమ స్థానములో రవి ఆ రవికి సప్తమ స్థానములో కుజుడు వున్నా పుత్రా సంతానము కలుగును.
చంద్రునకు పంచమమున గురువు ఆ గురువుకు పంచమమున సాని ఆ సానికి పంచమము నందు రాహువు వున్నా పుత్రా సంతానము కలుగును.
రాహువు కేతువులు సప్త గ్రహములతో కూడిన పలితము
1)రాహువుతో రవి లేక శుక్రులు లగ్నము నుండి ద్వితీయ భావములో ఉన్న లేక రాహువు ఉన్న నేత్ర సంబందమయిన వ్యాదులు కలుగును.
2)ద్వితియములో రాహువు శుక్రులు వుంది అష్టమములో కేతువు శని గ్రహములు ఉన్న రాహువు శుక్రులకు కేతువు, శనుల ద్రుష్టి ఉన్న ముత్ర సంబందమయిన లేక వృషణములు లకు వ్యాదులు మరియు గొంతు సంబందమయిన వ్యాదులు వచును.
3)రాహువు గురువులు కలసియునచో దురాచారములకు లోను అగును. దైవముఫై నమ్మకము ఉండదు. కేతువు గురువు కలసివున్న దైవ బక్తులు అగును.
4)రాహువు అష్టమ బావములో వుంది రాహువుకు రవి, కుజ, మరియు శని వీరిలో ఎవరి ద్రుష్టి తగిలిన వివాహములు ఆలస్యము అగును. బార్య లేక భర్తలలో మృతువు సంభవించును.
5)రాహువు చంద్రునితో కలసి లగ్నమునందు వుండగా పంచమ, నవమ స్థానములు అనగా కొనములలో పాపులు ఉన్నచో మానసిక చంచలత్వము, మంద బుద్ది ఆత్మ హత్యలకు పాల్పడటము జరుగును.
6)జన్మ లగ్నములో శని రహువులు కలసివున్న అనారోగ్యము నాల్గవ స్థానములో ఉన్న మాతృనష్టము, విద్య విగ్నములు కలుగును. ఏడవ స్తనమునందు ఉన్న పితృ సౌక్యము వుండదు. దశమ స్తానములో ఉన్న వృతిరీత్యా చికాకులు కలుగును.
7)పంచమదిపతి అయిన చంద్రుడు శని కుజులతో రాహువు కలసివున్న సంతాన నష్టము కలుగును.
8)శుక్రుడు కేతువు తో కలసి ఉన్న బార్య గయాళి, స్వల్ప సంతతి కలది, బార్య సహోదరులకు నష్టము కలుగును.
9)శని, కేతువులు కలసి కేంద్రములలో ఉన్న రాజయోగము పట్టును.
7 లో శని, కుజ, మరియు రహువులతో కూడిన బ్రంహచార్యము , వివాహము అయిన దాంపత్య జీవితము వుండదు.
రాహువు విద్య స్తానములో ఉన్న విద్యబ్యాస కాలములో రాహువు దాస వచ్చినాచో వైద్య శాస్త్రము అబ్యాసిన్చును.
కేంద్రముల యందు రాహువు పాప గ్రహములతో కూడినను ఆ శిశువు సీగ్రముగా మరణించును.
4 వ అధిపతి రాహువుతో కలసి 6 నందు ఉన్న చోరుల వల్ల మరనింతురు.
6 వ బావము నందు చంద్రుడు లగ్నమునందు రాహువు వున్నాను అపస్మారక రోగము కలుగును.
లగ్నము నందు గురువు, రాహువు ఉన్న దంత రోగములు కలుగును.
కారకాంస లగ్నము నుండి ద్వాదశ భావము నందు కేతువు వున్నాను మరణము అనంతరము బ్రంహా సానిద్యము పొందును.
ద్వితీయ భావములో కేతువు మరియు శుక్రుడు కలసిన పర శ్రీ లతో సంబందము కలిగి వుంటాడు.
కేతువుతో శని మరియు కుజులతో కలసి ద్వితియము లో వుంటే వివాహము ఆలస్యము అగును.
బుధ, కేతువులు 3 భావము లో ఉన్న చెవి వ్యాదులు లేదా ఏదయినా అవయవ లోపము జరుగును.
3 వ భావములో కేతువు, శని కలసిన మంచి ఆరోగ్యము కలిగించును.
కేతువుతో కలసి శని 9 వ స్తానములో ఉంటే తండ్రికి అరిస్టములు కలుగును.
కేతువు, శుక్రులు కలసి 9 వ స్తానములో వుండిన బార్య లేదా భర్తకు నష్టము , స్థిర చర ఆస్తులకు నష్టములు కలుగును.
7 లో కేతువుతో శుక్ర, కుజులు కలసిన వ్యభిచారము చేయును.
7 లో కేతువు తో బుధుడు కలసిన వివాహ విషయములలో మోసము జరుగును.
7 వ భావములో రాహువుతో కుజుడుగాని, రావిగాని, శని గాని చేరిన నీచ శ్రిలతో సంబందము, వ్యభిచారము, భార్యను కోల్పోవడము జరుగును.
7 లో రవి, రహువులు కలసిన సంతాన నష్టము కలుగును.
7 లో రాహువుతో గురు, శుక్రులు కలసిన విధవతో సంగమము జరుగును.
లగ్నము నందు శని పంచమములొ కుజ రహువులు వున్నాను సోదరులు వుండరు.
కుజ రహువులకు 6 వ అధిపతితో సంబందము ఉన్న గాయములు, లేక ఎవరయినా తుపాకితో కాల్చుట లేక కత్తితో పొడుచుట జరుగును.
కుజ రాహువుల కలయిక భు ఆక్రమణలు, కోల్పోవడము జరుగును.
లగ్నమున రవి, రహువులు వున్నాను శిరసు భినముగా ఉండును.
రవితో రాహువు లేక కేతువుతో సంబందము వుండి 8 లో వుంటే అవమానములు కలుగును.
శనితో రాహువు లేక కేతువు వుండి 7 లో ఉన్నచో వ్యభిచారము చేయును.
లగ్నము నందు రవి, 7 లో రాహువు వుంటే భార్య గర్భము ధరించదు.
7 లో రాహువు, 2 లో శని వుండిన ద్వికలత్ర యోగము కలుగును.
రాహు, శుక్రులు కలసిన చాకలి సంగమము జరుగును.
————————————————-
కాల సర్ప యోగము:
రాహు,కేతువుల ప్రభావము మన మీద ఉంటుందా …..
సూర్యుని నించి వచ్చే కాంతి కిరణాలు గ్రహముల మీద పడి అవి అయ్యా రంగులుగా విడి పోయి సప్త కాంతులు మన శరీర, మనస్సులని ప్రభావితము చేస్తుందని, అనగా ఆయా గ్రహాలూ మనమీద ప్రభావాలు చూపిస్తాయని మన పూర్వీకులు జ్యోతిష్య శాస్త్రాని ప్రజలకు అందించారు. అంతే కాదు జ్యోతి అనగా కాంతి మనుష్యుల మీద ఎలా ప్రభావితము చూపుతుందో ఛాయ కూడా మానవుని ప్రభావితము చేస్తుందని, రాహు, కేతువులను చాయా గ్రహాలుగా వర్ణించారు. ఈ సూక్ష్మము గ్రహించని వారు రాహు, కేతువులు గ్రాహాలే కాదు, అవి ఎలా మనిషి మీద ప్రభావముచూపుతాయి అని వితండ వాదన… అసలు గ్రహాలే ప్రభావము ఉండదని ఇంకో వాదన. కొన్ని వేల సంవత్సరాల నుండి ఈజ్యోతిష్యము, ఫలితాలు, అనేక అంశాలు మానవుని నిత్య జీవితములో అనుభవాలు కాదనలేనివి.
ఇక అసలు విషయము రాహుకేతువులు స్తితి, ప్రతి మనిషి మీద మంచి చెడుల ఫలితాలను చూపుతాయి. గ్రహాల గురించిన విషయాలు,వర్ణనలు, పుట్టుకలు శ్లోకాలు, కదల రూపములో రమ్యముగా చెప్పబడినాయి. అప్పటి రోజులలో కంప్యూటర్, ఇల్లంటివి లేవు కదా… నేటి మానవుని కంటే మన మహర్షులు ఇంకా కొన్ని అడుగులు ముందుకు వేసి అనుభవాలు, మంచి, చెడులు, నివారణోపాయాలు కూడా చెప్పారు. వాటిని మనము తప్పక ఆచరించి ఫలితాలను అనుభావిచాలేకని వాదనలతో నిరుపించాలేము కదా…
రాహువు పార్ధివ నామ సంవత్సర, భాద్రపద శుక్ల పూర్ణిమ నాడు, పూర్వ భాద్ర నక్షత్రాన జన్మించాడు. కశ్యప ప్రజాపతికి అతని భార్య అయిన సింహికకి. అమృతము పంచె సమయములో అమృతము విష్ణుమూర్తి ఆజ్ఞ మీరి తాగినందుకు అతని శిరస్సు ఖండిచ బడినది. పాము రూపముగా చెప్పబడే రాహువు అమృత మహిమ వడలన తోక విడిపోయి కేతువుగా అవతరించాడని పురాణ కధనము.
కాల సర్ప యోగము:
కాల సర్ప యోగము అనగా రాహు, కేతువుల మధ్య మిగిలిన ఏడు గ్రహములు ఉండుట వలన ఏర్పడే యోగము. ఇందులో మంచి యోగములు ఉండవచ్చు, చేదు యోగములు ఉండవచ్చు. చెడు యోగము కలిగిన రాహు కేతువుల పూజ చేయించుకోవాలి. ఐ మనుష్యులకే కాదు, దేశానికి, రాష్ట్రాలకి కూడా ఉండవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాము:-
రాహువు, కేతువులు మిగిలిన గ్రహములకు వ్యతిరేక దిశలో నడచును. ఏడు గ్రహములు రాహువు ఉన్న దిశ వైపు నడచిన కాల సర్ప యోగము ఏర్పడును. ఇది భారతీయుల సిద్ధాంతము. యురేనస్, నేఫ్ద్తున్, ఫ్లుటో గ్రహములు రాహు కేతువుల కక్ష్య వెలుపల ఉన్న కాలసర్ప యోగము ఏర్పడుతుందని పాశ్చాత్యుల సిద్ధాంతము.
కాల సర్ప యోగ దోషములు:
రాహు, కేతులు 1 – 7 స్థానము నందు ఉంటె భార్య, భర్తల మధ్య విరోధము, అశాంతి, మనస్పర్థలు, చురుకు దానము లోపించుట జరుగును. ఒక్కోసారి వివాహ యోగము కూడా ఉండక పోవచ్చుని.
రాహు కేతువుల కాల సర్ప యోగాలు:
యోగ్దము అనేది మంచి, చెడు రెండు వుంటాయి. ఆ సమస్యల స్వరూపము తెలుసుకుందాము:
1 – 7 అనంత కాలసర్ప దోషము దీనివలన దాంపత్య జీవితములో ఇబ్బందులు ఎదురు అవుతాయి.
2 – 8 గుళిక కాలసర్ప దోషము దీనివలన కుటుంబ సమస్యలు, వాక్, ఆర్థిక సమస్యలు ఉంటాయి.
3 – 9 వాసుకి కాలసర్ప దోషము దీనివలన ఉపయోగము లేని ప్రయాణాలు, బంధువుల వలన బాధలు.
4 -10 శంఖపాల కాలసర్ప దోషము దీనివలన వాహనాలు, గృహ, భూమి సంబంధిత సమస్యలు.
5 -11 పద్మ కాలసర్ప దోషము దీనివలన సంతన సమస్యలు, ఆందోళనలు.
6 -12 మహాపద్మ కాలసర్ప దోషము దీనివలన నిద్ర లేకపోవటాము, శారీరిక, ఆర్థిక ఇబ్బందులు.
7 -1 తక్షక కాలసర్ప దోషము దీనివలన భార్య, భర్తల మధ్య విభేదాలు, వ్యాపార సమస్యలు.
8 -2 కర్కటక కాలసర్ప దోషము, దీనివలన నష్టాలు, ఆకస్మిక ప్రమాదాలు జరుగును.
9 -3 శంఖచూడ కాల సర్ప దోషము దీనివలన పూర్వ పుణ్య లోపమువల్ల సమస్యలీ, పెద్దల వల్ల సమస్యలు.
10 -4 ఘటక కాలసర్ప దోషము దీనివలన ఉద్యోగ సమస్యలు, హోదాలలో, గౌరవములలో లోపాలు.
11 -5 విషక్త కాలసర్ప దోషము దీనివలన వ్యాపార లాభాలలో సమస్యలు.
12 -6 శేషనాగ కాలసర్ప దోషము దీనివలన అధిక వ్యయము వలన కలిగే ఇబ్బందులు.
మరి కాలసర్ప యోగము వలన జరిగే మంచి ఏంటి..
ఈ యోగము జాతకుని కష్టించు వానిగాను, దైవ్దభక్తి గల వానిగాను, ధర్మ నిష్ఠ పరునిగాను, మార్చును.
జాతక చక్రములోని ఇతర దోషములు హరించును.
ఇతర గ్రహముల దోషములు కాలసర్ప యోగము వలన నిర్మూలించ బడును.
జాతకుని ముందుకు నడిపించి గొప్పతనము సాధించుటకు కావలసిన శక్తిని కలిగించును. ఎదుటి వారు కలుగ చేయు ఆపదలనుండి తప్పించుత్డకు శక్తిని ఇచ్చును.రాహువుతోగాని, రాహువుకు ముందు కాని గురు చంద్రుల కలయిక వలన మంచి యోగము కలుగును.
సవ్య, అపసవ్య కాలసర్ప దోషాలు ఉంటాయి. రాహువునుంచి కేతుగ్రహము వరకు సప్త గ్రహాలు ఉంటె అది సవ్య కాలసర్ప యోగము, కేతువు నుండి మొదలు అయి రహుగ్రహ మధ్యలో సప్త గ్రహాలు ఉంటె అపసవ్య కాలసర్ప యోగము అందురు.
ఇక మూడవది రాహు, కేతుల మధ్య లగ్నము ఉండి మిగిలిన సప్త గ్రహాలూ కేతు, రాహుల మధ్య ఉంటె అది లగ్న కాలసర్ప యోగము అందురు.
సర్పదోషము, నాగ దోషము: జోతిష్యములో రాహు, కేతువులను సర్పముగా భావితురు తల రాహువుగాను, తోక కేతువుగాను చెప్పుదురు. ఈ దోషములను నాగదోషముగా చెప్పుదురు. నాగ దోషము ఉన్నప్పుడు తప్పని సరిగా పుట్ట పూజలు, నగెర స్వామి గుడిలో పూజలు దర్శనములు, దానాలు పరిహార క్రియలు చేయాలి. అవి జతకములో గ్రహ స్తితి బట్టి నిర్ణయించాలి. నాగ దోషములు చెప్పబడే కొన్ని గ్రహ స్తితి గతులు:
జాతక చక్రములో లగ్నము నుండి ఆరు, ఏడు, ఎనిమిది స్థానాలలో రాహువు ఉంటె సర్ప దోషము. ఇతర ఏ యోగాలు లేకుండా ఈ దోషము ఉంటె దుష్కర్మల పట్ల ఆసక్తి, సుఖము లేక పోవుట, ఉద్యోగ సమస్యలు, కొందరికి వివాహము కాక పోవుట జరుగును.
జాతక చక్రములో చంద్రుని నుండి ఎనిమిదవ స్థానములో రాహువు కేతువు ఉంటె సర్ప దోషముగా చెప్పాలి.
జాతక చక్రములో రాహువు నుంచి ఎనిమిదవ స్తానములో రవి ఉంటె సర్ప దోషము.
జాతక చక్రములో లగ్నము నుండి త్రికోణము నందు కాని, కేంద్రము నందు కాని రాహు, కేతువులు ఉంటె సర్ప దోషము.
—————————
నాగ శాపం
నాగ దోషానికి పరిహారాలు నాగ ప్రతిష్ట మాత్రమే కాదు.ఈ దోషాన్ని పంబన్ ఘట్ అనే విధానం ద్వారా సరిచేయవచ్చు.కేరాలకి చెందిన నాగ వంశీకులు ఈ దోషాన్ని పరిపూర్ణంగా నిర్మూనించగలరు.త్రయంబకేశ్వర్ ,కుక్కి ,మన్నర్సాల,కౌలాలంపూర్ మున్నగు ప్రదేశాలలో ఈ దోషానికి పరిహారాలు అనగా తొమ్మిది గ్రహాలకి తొమ్మిది నాగులను నియమించబదిందని సర్ప శాస్త్రం తెలియబరుస్తుంది.మొదటిది ఆశ్లేష బాలి,నవనాగా మండలం,నారాయణ నాగాబలి,మహా సర్ప బలి ఈ నాలుగు రకాల పరిహారలతో తొమ్మిది రోజుల హోమమును చేయటం జరుగుతుంది.నాగ దోషం గల జాతకులు ధరించిన వస్త్రాలను ఉప హోమ గుండములో వేయటం జరుగుతుంది.జాతకుడు పుట్టిన సంఖ్యను బట్టి ఒక రంగు ఉద్దేశం అవుతుంది.ఆ రంగు వస్త్రాలను పూర్నాహుతిలో వేయటం జరుగుతుంది. ఈ తొమ్మిది రోజులు జాతకులు శాకాహారం మాత్రమె తీసుకోవాలి.పొట్లకాయ తినరాదు.ప్రతి నిత్యం సర్ప సూక్తం చదవాలి.ఇలా పరిహారాలు చేసుకునే వారికి శీఘ్ర సంతానం కలుగుతుంది.కోర్టు వ్యవహారాలూ,వ్యాపార సమస్యలు,అనారోగ్య సమస్యలు నయమవుతాయి.
స్వప్నంలో పాములు కలలోకి వస్తే అది సర్ప దోషమని సర్ప శాస్త్రం మనకి తెలియపరుస్తుంది.అలాంటి వారు కూడా దోష పరిహారము చేసుకొనుట మంచిది.
జాతకంలో లగ్నము నుండి 8వ స్తానంలో రాహువు ఉంటే లేదా శని ,రాహువు యొక్క దృష్టి 8వ స్థానం పై పడితే సర్పదోషం ఏర్పడుతుంది .రాహు కేతువుల లగ్నంలో కానీ , 2వ స్థానంలో కానీ ,5 వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ ,8వ స్థానంలో కానీ ఉంటే ఆ జాతకులకు సర్ప దోషం ఉందని గుర్తించాలి.ఏ సర్పదోషం ఎవరి జాతకంలో అయితే ఉంటుందో వారికి క్రింద వివరించబడిన సమస్యలు ఎదురవుతాయి. సర్పదోషాల వలన ఆయుహ్క్షీనమ్ , సంతానం కలగకపోవటం,సంతానం కలిగినా వెంటనే చనిపోవడం ,భార్య భర్తల మధ్య విభేధాలు ఏర్పడడం ,దంపతులకు విడాకులు తీసుకొనే పరిస్తితి ఏర్పడడం ,అకస్మాత్తు రోడ్డు ప్రమాదాలు జరగడం, గర్భస్రావాలు జరగడం,వివాహం ఆలస్యంగా జరగడం,మాంగల్య దోషం లాంటి సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.
ఇదే కాక రాహు కేతుల స్థానాలను బట్టి పన్నెండు రకాల కాల సర్ప యోగాలను జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది. ఈ పన్నెండు రకాల కాల సర్ప యోగాల వలన విభిన్న సమస్యలు ఏర్పడతాయి.ఏ యోగం ఏ జాతకులకు ఉంటుందో క్రింద వివరించబడింది.
జాతక చక్రంలో లగ్నంలో అనగా ఒకటవ స్థానంలో రాహువు మరియు 7వ స్థానం కేతువు ఉన్నట్లైతే ఈ జాతకులకు “ అనంత కాలసర్ప యోగం”గా భావించాలి. ఈ యోగం వలన వీరి దాంపత్య జీవితంలో విబేధాలు ఏర్పడతాయి. తప్పు నిర్ణయాలు తీసుకొని అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.
జాతక చక్రంలో లగ్నం నుండి 2వ స్థానంలో రాహువు మరియు 8వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “కులిక కాలసర్ప యోగం”గా గుర్తించాలి.దీని వలన వీరికి సంపాదన తక్కువగా ఉంటుంది.అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదాలు మరియు అకాల మరణాలు సంభవిస్తాయి.
జాతక చక్రంలో లగ్నం నుండి 3వ స్థానంలో రాహువు మరియు 9వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “వాసుకి కాలసర్ప యోగం”గా గుర్తించాలి. ఈ జాతకులకు ఆత్మ గౌరవం తగ్గి సంఘం లో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటారు.ఆత్మహత్యలకు పాల్పడతారు.సోదరులతో విబేధాలు ఏర్పడతాయి.విదేశాలకు వెళ్ళుటకు ఇబ్బందులు ఎదుర్కొంటారు.
జాతక చక్రంలో లగ్నం నుండి 4వస్థానంలో రాహువు మరియు 10వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “శంఖ పాల కాలసర్ప యోగం”గా గుర్తించాలి. ఈ జాతకులు అందరినీ దుర్భాషలడతారు. జాతకుని తల్లికి అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి.ఉద్యోగంలో లేదా వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటారు.వాస్తు సరిగ్గా లేని ఇంటిలో నివసిస్తూ అధిక సమస్యలకు గురి అవుతారు.
జాతక చక్రంలో లగ్నం నుండి 5వ స్థానంలో రాహువు మరియు 11వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “పద్మ కాలసర్ప యోగం” వీరికి వ్యాపారంలో నష్టాలు ఎదురవుతాయి. స్నేహితుల వలన సమస్యలు వస్తాయి. సంతానంలో కొరత లేదా ఆలస్యం ఏర్పడుతుంది.
జాతక చక్రంలో లగ్నం నుండి 6వ స్థానంలో రాహువు మరియు 12వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “మహా పద్మ కాలసర్ప యోగం”గా గుర్తించాలి. ఈ జాతకులకు శత్రువులు ఎక్కువగా ఉంటారు.అనారోగ్యాల పాలవుతు ఉంటారు.ఏకాంతంగా మిగిలిపోవడం,జైలు పాలవడం లాంటివి జరిగే సూచనలు ఉన్నాయి.
v జాతక చక్రంలో లగ్నం నుండి 7వ స్థానంలో రాహువు మరియు లగ్నంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “తక్షక కాల సర్ప యోగం”గా గుర్తించాలి.ఈ జాతకుల జీవిత భాగస్వామి చెడు ప్రవర్తన గలవారై ఉంటారు.పరిస్థితులు వీరిని వైరాగ్యానికి గురి చేస్తాయి.
జాతక చక్రంలో లగ్నం నుండి 8వ స్థానంలో రాహువు మరియు 2వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “కర్కోటక కాల సర్ప యోగం”గా గుర్తించాలి.ఈ జాతకులు నిరంతర అనారోగ్యంతో భాదపడతారు.సంపదకు మించి ఖర్చులు పెరిగిపోవడంతో అప్పుల పాలవుతారు .
v జాతక చక్రంలో లగ్నం నుండి 9వ స్థానంలో రాహువు మరియు 3వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “శంఖాహూడ కాల సర్ప యోగం”గా గుర్తించాలి.ఈ జాతకులు అన్నీ రకాల చెడు వ్యసనాలకు అలవాటు పది ఉంటారు.వీరికి ఉన్న ఆస్తి మరియు సంపదను కోల్పోతారు. విదేశాలకు వెళ్ళుట కష్టంగా మారుతుంది.ప్రయాణాలలో సమస్యలు వస్తాయి .
v జాతక చక్రంలో లగ్నం నుండి 10వ స్థానంలో రాహువు మరియు 4వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “ఘాతక కాలసర్ప యోగం”గా గుర్తించాలి.ఈ జాతకంలో వారు చేసే ఉద్యోగంలో కానీ ,వ్యాపారంలో కానీ సరిగ్గా రాణించలేరు. వీరి కుటుంబ సభ్యులలో ఒకరు మాంత్రికుడిగా మారి క్షుద్ర పూజలు ప్రయోగించి ఇతరులను కష్టాలకు గురి చేస్తారు.
v జాతక చక్రంలో లగ్నం నుండి 11వ స్థానంలో రాహువు మరియు 5వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకి “విశాధర కాల సర్ప యోగం”గా గుర్తించాలి.ఈ జాతకులు వీరి కన్నా అగ్రజులైనా సోదరి లేక సోదరులతో విబేధాలు ఏర్పడతాయి.స్నేహితుల వలన సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.సంధిగ్ధమైన మనస్సు కలిగి ఉండడం వలన వ్యాపారాలలో నష్టాలు ఏర్పడతాయి.అప్పులు చేసి ఆస్తి పోగొట్టుకొంటారు.
v జాతక చక్రంలో లగ్నం నుండి 12వస్థానంలో రాహువు మరియు 6వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “శేషనాగు కాల సర్ప యోగం”గా గుర్తించాలి.ఈ జాతకులు సంపాదనకు మించి ఖర్చును చేస్తారు.వీరికి వీడని అనారోగ్య సంశ్యాలు ఏర్పడతాయి.జైలు పాలయ్యే అవకాశాలు వస్తాయి.వీరికి తెలియని శత్రువులు హాని చేయడానికి ప్రయత్నిస్తారు.
జాతక భావంలో ఉన్న ఈ నాగ శాపం,సర్ప దోషం,కాల సర్ప దోషం యొక్క ప్రభావల నుండి వచె సమస్యలు తొలగించుకోడానికి సర్ప శాస్త్ర విధానాన్ని అవలంబించి కేరళలో ఉన్న మన్నర్షాల మరియు పాంబు మెక్కట్టు లో ఆశ్లేష బలి,నారాయణ నాగ బలి,మహా సర్ప బలి,నవనాగ మండలం అను పరిహారాలు జాతకుని ఫోటో,జన్మ నక్ష్త్రమ్,జన్మ లగ్నం,మేనమాల గోత్రం,జాతకులు వాడిన వస్త్రం మొదలగు వాటిని సేకరించి ఈ పరిహారాలు జరుపుతారు.ఈ పరిహారాలు నాలుగు రోజులు జరుగుతాయి.ఈ నాలుగు రోజులు ప్రతి నిత్యం ఏదో ఒక సమయంలో నైనా ఏ ప్రదేశంలో నైనా సర్ప సూక్తాన్ని భక్తి శ్రద్ధలతో చదవాలి.
——————————————–
నాగ దోషం ,కాల సర్ప దోషం నివారనోపాయలు
కాల సర్పం యోగం పట్టినవారు.సప్తమ,అష్ట్టమాల్లో రాహు కేతువులు ఉన్నవారు.పూర్వ జన్మలో పాములను చంపినా వారు లేదా మంత్ర తంత్ర విధి విధానాలతో బంధించినవారు,పాముల పుట్టలను త్ర్రావ్వి ఇండ్లు కట్టిన వారు నాగదోషం కలవారై పుడుతారు.అటువంటి వారు వివాహం,సంతానం,కుటుంబ అభివృద్ధి విషయాల్లో అడ్డంకులు,అవమానాలు పొంది,విరక్తి కలిగి జీవితం అంతం చేసుకొందమనే స్తితికి వస్తారు..
1.నాగదోషం త్రీవ్రమైనది అయితే శుక్ల పౌడ్యమినాడు శ్రీకాళహస్తిలో నిద్రచేసి మరుసటి దినం శివ దర్శనం చేసి పూజలు జరిపించుట వల్ల నివారణ కల్గుతుంది
2.ఆరు ముఖాల రుద్రాఅక్షాలు చెవులకు లేదా గాజులలకు లేదా ఉంగరంగా ధరించుట వల్ల ,ఏనుగు తోక వెంట్రుకలు ఉంగరంగా లేదా చేతికి కడియంగా ధరించుట వల్ల నివారణ పొందగలరు
3.నాగ ప్రతిమకు 27 దినాలు పూజచేసి దేవాలయమునకు దానం చేయవలేయును.
4. రాహు కాలంనందు ప్రతి సోమవారం నాగ దేవతకు క్షేరాన్ని నివేదన చేసి పూజ చేయాలి. లేదా రాహు కాలంనందు నాగ దేవతకు క్షేరాన్ని నివేదన చేసి నవగ్రహ ఆలయంలో దానంగా ఇచ్చుట వల్ల నివారణ కల్గును
5.త్రీవ్ర్రమైన నాగదోషంఉన్న యడల నాగ పంచమి రోజున శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించి దుర్గ, పాతాళ వినాయకుని దర్శించి పూజించటం వల్ల నివారణా కల్గును
———————————————————
పితృ దోషం ఎటుల ఏర్పడుతుంది
పితృ దోషం ఉండే వాళ్ళకు జీవితంలో అనేక కష్ట నష్టములు ఎదుర్కోవలసి వస్తుంది పిత్రుదోషం కుటుంబమందు ఎదో ఒక్కరికి సంప్రాప్తించును అసలు పితృ దోషం ఎందుకు వస్తుంది అనేది చూద్దాము.
కుటుంబమున ఎవరో ఒకరు అదే అత్తో మామో చిన్ననో పెదనాన్నో అన్నానో తమ్ముడో చెల్లియో అక్కయో వారికి నిర్దేసించ బడిన ఆయుస్సుకు ముందే ఆత్మాహుతి అంటే ఆత్మ హత్య చేసుకోవడమో ఆక్సిడెంట్ వాళ్ళ చనిపోవడమో లేక ఇతర కారణముల వాళ్ళ ముందే చనిపోతే వారి ఆయుస్సు నిర్దేశించబడిన వరకు ప్రేతత్వములో తిరుగుతో వుంటారు. అలాంటి వారికి అపర కర్మ లేదు చాల తంతు అంటే పరిహారడులు చేసి తర్వాత ప్రేత కర్మ చేయవలసి వుంటుంది. అలా చేయకపోతే ఇక్కడే తిరుగుతూ ఆకలి డప్పులకు అలమటిస్తూ మనలను శపిస్తూ తిరుగుతుంటారు.
ఇలా ఒక కుటుంబంలో ఎన్ని మనదో అపమ్రుత్యు వాత పడ్డ వారి లెక్క మనకు తెలీకుండా వుంటుంది. అలాంటి శాపం వల్లే కుటుంబములో ఏదో ఒక పిల్ల వాడికో లేక పిల్లకో పితృ దోషంతో పుడుతుంటారు. ఇక వారి జీవితం అంట కష్ట మయంగానే వుంటుంది. అసలు ఈ పితృ దోషం తెలుసుకోవలసింది ఎటుల అంటే జాతకంలో రాహు కేతువుల మద్య అన్ని గ్రహములు ఇమిడి వుంటారు. అలాంటప్పుడు అది కాల సర్ప దోషం అని జాతక రీత్యా అంటారు. అది పితృ దోషం వాళ్ళ వస్తుంది. ఈ దోష్సం లేకుండా ఇంట్లో పిల్లలు వుండరు.
కాల సర్ప దోష నివారణకు ముఖ్యమైనది పెద్దలు ఇంట్లో పితరులకు తర్పనాదులు మరియు శ్రాద్హ కర్మలు తప్పకుండ వదలకుండా చేయడం వాళ్ళ కొంత తగ్గుతుంది. మరి రాహు ప్రీతి కొరకు దుర్గను కేతు ప్రీతి కొరకు గణేశుని ప్రార్తించ వలసి వుంటుంది. అందుకే మన శాస్త్ర సంప్రదాయములో కలౌ చండి వినయకౌ అని అంటారు. ఈ రెండు దేవతలు త్వరగా ప్రీతిపాత్రులై మనకు మంచి కలుగ చేస్తారు.

Saturday, 21 October 2017

వైఖానస ఆగమం.......

వైఖానస ఆగమం......
శ్రీ లక్ష్మీ వల్లభారంభాం విఖనో ముని మధ్యమామ్ |
అస్మదాచార్య పర్యంతాం వన్దే గురు పరంపరామ్ ||
శ్రీమహావిష్ణువుని ప్రప్రథమంగా అర్చన చేసిన మహర్షి విఖనస మహర్షి అందుచే వారి వంసానుగమంగా విఖనసునికి జన్మించిన పుత్ర సంతతిని వైఖానసులు అంటారు. వీరు ఇంద్రునికి అత్యంత ప్రీతిపాత్రులు. నిత్యం శ్రీపతిని పూజించేవారు.
నారాయణః పితా యస్య మాతా చాపి హరిప్రియా |
భ్రుగ్వాది మునయః శిష్యా తస్మై శ్రీ విఖనసే నమః ||
ఆనందితాచార్య మనన్య భాజనం సుత్ర్యైక నిష్టం కరణ త్రాయేణా |
అనారతం శ్రీపతి పాద పద్మయో: నమామి వైఖానస మాది వైష్ణవం ||
శ్రీమద్రామానుజాచార్యుల వారు వైఖానుసుల యొక్క విశిష్టతను కీర్తిస్తూ తెలిపిన శ్లోకం ఇది. ఏ సుత్రమైతే నిందించటానికి శక్యము కానిదో, ఎవరైతే దైవిక, శ్రౌత, శారీరక కర్మలను ఒకే సూత్రము ద్వారా నిత్యమూ శ్రీపతి ఐన శ్రీమహావిష్ణువు యొక్క పాద పద్మములను ఆరాదించినారో వారే వైష్ణవ సంప్రదాయానికి నాంది పలికింది. వారే ఆది వైష్ణవులు.వారే వైఖానసులు.
విష్ణువుని ముఖ్య దైవంగా కొలిచే వైఖానసులు ఇప్పటికీ తమ యొక్క వైఖానస భగవత్ శాస్త్రం అనే ప్రాథమిక గ్రంధం ఆధారంగా తిరుమలలో వేంకటేశ్వరునికి, శ్రీరంగంలో శ్రీరంగనాధునికి మరియు ఇతర ప్రముఖ వైష్ణవ ఆలయాలలో నిత్యపూజలను అందిస్తున్నారు.
వైఖానసులు, వారి నమ్మకం ప్రకారం, వైదిక సాంప్రదాయమైన కృష్ణ యజుర్వేదీయ తైత్తీరియ శాఖను పాటించే జీవిత సమూహం. వైఖానస సాంప్రదాయం ప్రకారం ఋషివిఖనసుడు మహావిష్ణువు యొక్క అంశతో మహావిష్ణువుకే జన్మించాడు. బ్రహ్మతో పాటుగానే ఇతనికి ఉపనయనం జరిగింది. మహావిష్ణువే గురువుగా సమస్త వేదాలు, మరియు భగవత్ శాస్త్రాన్ని అభ్యసిస్తాడు. ఆపై భూమి మీదకి నైమిశారణ్యం వద్దకు వస్తాడు. అక్కడ వైఖానస కల్పసూత్రాన్ని రచించి తన నలుగురు శిష్యులైన అత్రి, భృగువు, కశ్యపుడు మరియు మరీచికి ఉపదేశిస్తాడు. అత్రికి సమూర్తార్చన, భృగువుకి అమూర్తార్చన, కశ్యపుడికి తర్కం-జపం, మరియు మరీచికి అగ్ని హుతం పై ఉపదేశాలు చేస్తాడు. వైఖానసుల ప్రకారం వైదిక హవిస్సు క్రతువునే వీరు కొనసాగిస్తున్నారు. యాగం చేస్తూ అగ్నిలో హవిస్సులు పోస్తే వచ్చే ఫలితమే వైష్ణవారాధాన ద్వారా వస్తుందని నమ్ముతారు.
వీరు ముఖ్యంగా విష్ణువు యొక్క ఐదు రూపాలను కొలుసారు.
విష్ణువు – సర్వాంతార్యామియైన దేవాదిదేవుడు
పురుషుడు – జీవితం యొక్క సూత్రము
సత్యము – దైవం యొక్క మారని అంశం
అచ్యుతుడు – మార్పు చెందని వాడు
అనిరుద్ధుడు – ఎన్నటికీ తరగని వాడు
‘ఏ నఖాః తే వైఖానసాః ఏ వాలాః తే వాలఖిల్యాః‘ అన్న వేదశృతి వాక్యానుసారంగా ఎవరైతే అనఖా: అనగా పాపరహితులో వారే వైఖానసులు. వైఖానసాగమాను సారంగా జీవన శైలి కలిగియున్న వారిని ప్రత్యేకంగా వైఖానసులు అంటారు అలా ఎందుకనగా
శ్లోకం :
యే వైఖానస సూత్రేణ సంస్కృతాస్తు ద్విజాతయః
తే విష్ణు స దృశా జ్ఞేయం సర్వేషాం ఉత్తమోత్తమం |
వైఖానసానాం సర్వేషాం గర్భ వైష్ణవ జన్మనాం
నారాయణః స్వయం గర్భే ముద్రాం ధరాయేత్ నిజాం ||
వైఖానసులు ఒక తపస్సంపన్నుల సమూహం. వీరి ప్రస్తావన మొదటి సారిగా మనుధర్మశాస్త్రంలో వస్తుంది. మనువు మనిషి యొక్క వర్ణాశ్రమంలోని ఆఖరి రెండు చరమాంకాలయిన వానప్రస్థం ఇంకా సన్యాసాశ్రమం గురించి చెబుతూ వైఖానస నిబంధనను తెలుపుతాడు. తద్వారా వైఖానస సముదాయం ఆ కాలానికే ఉందని తెలుస్తుంది. నారాయణీయంలో కూడా వీరి ప్రస్తావన వస్తుంది. కానీ సైద్ధాంతికంగా వైఖానస సూత్రాలు నాలుగోశతాబ్దికన్నా పాతవి కావని తెలుస్తోంది. ఎనిమిదవ శతాబ్దం నాటి ఆలయ శిలాశాసనాల ద్వారా వైఖానసులు పూజారులని తెలుస్తోంది. వైఖానసులు పూజారిలే కాక దేవాలయంలో ధర్మకర్తల బాధ్యతలు కూడా నిర్వహించేవారు. గుడికి సంబంధించిన ఆస్తులకు జవాబుదారీగా ఉండే వారు. శ్రీవైష్ణవుల రాకతో వైఖానసుల ప్రాభవం తగ్గిపోయింది. రామానుజాచార్యుడి రాకతో ఈ ప్రాభవం మరింత తగ్గింది. రామానుజులు దేవాలయ పూజారి వ్యవస్థను రూపుమాపు చేసాడు. అయిదు స్థాయిలలో ఉన్నది పది స్థాయిలకు మార్చాడు (ప్రధానార్చకుడు-అర్చకుడు-తీర్థం (నీరు) తెచ్చే వ్యక్తి - వంట చేసే వ్యక్తి - ఘంటారావం చేసే వ్యక్తి ఉన్న వ్యవస్థ నుండి శూద్రులకు స్థానం కల్పిస్తూ నిర్మాల్యం తొలగించడం-పాలుపూలుపళ్ళు తేవడం- ఉత్సవ పల్లకీ మోయడం - గుడిలో తులసీవనం పోషించడం మొ॥ ఉన్న వ్యవస్థను నెలకొల్పడం). ఈ విధంగా శూద్రులకు ఎన్నడూలేని స్థానం దేవాలయంలో దక్కినప్పటికీ వైఖానసుల అవసరం తగ్గలేదు. ఈనాడు ప్రముఖ వైష్ణవ దేవాలయాలన్నిటిలోనూ ప్రధానార్చకులుగా వైఖానసులే ఉంటారు.
వైఖానస-పాంచరాత్ర వైరం.....
ఒక కథనం ప్రకారం శైవుల రాక వలన వైఖానసులంతా తిరుమల ఆలయం చేరతారు. వీరు వీడి వచ్చిన ఆలయాలన్నీ అప్పటి చోళ రాజు స్వాధీనం చేసుకుని శైవాలయాలుగా మార్చివేస్తాడు. కొద్ది కాలానికి ఆ ఆలయాలలో తిరిగి వైష్ణవ పూజలను రామానుజుల ఆధ్వర్యంలో శ్రీవైష్ణవులు కొనసాగిస్తారు. అంతలోనే అందరు వైఖానసులు నరికివేయబడతారు. అది చోళరాజు చేయించినదా లేక రామానుజులు చేయించిన చర్యనా అన్నది ఎవరికీ తెలీదు. ఆ విధంగా ఒక్క వైఖానస పురుషుడు కూడా మిగలకుండా అవుతుంది. అప్పుడు రామానుజులు వేంకటేశ్వర స్వామిని సమీపించి పూజాపునస్కారాల విషయమై చర్చిస్తూ, శ్రీవైష్ణవుల ఆధ్వర్యంలో పూజలు జరగాలని స్వామి వారిని కోరతాడు. కానీ స్వామివారు ఒక వైఖానస బాలకుడి విషయం తెలిపి అతనికి ఉపనయనం చేయించి అతని చేతనే పూజలు జరిపించాలని కోరతాడు. రామానుజులు ఈ విషయమై విముఖంగా ఉంటాడు. పాంచరాత్రాగమంలోనే పూజలు జరగాలన్నది ఆయన ఆశయం. ఈ బాలుణ్ణి కూడా హతమార్చాలని పన్నాగం జరుగుతుంది. స్వామి పుష్కరిణిలో మునిగి తేలగానే ఆ బాలుడు వటువుగా మారిపోతాడు. స్వామివారి వైభవం తెలుసుకున్న ఇతరులు, రామానుజులు తిరుమల పూజలను తిరిగి వైఖానసులకే అప్పగిస్తాడు. అప్పటి నుండి తిరుమల ఆలయం మొదలు చాలా ఆలయాల్లో వైఖానస-శ్రీవైష్ణవ వైరం ముందుకొస్తుంది. నేటికీ కొన్ని ఆలయాలలో ప్రధానార్చకత్వంపై వివాదాలున్నాయి. అయినా శ్రీరంగంలోని రామానుజుల పార్థివశరీరమూర్తి అని చెప్పబడే తాన్ ఆన తిరుమేణికి పూజ చేసేది వైఖానసులే.